Mother and Daughter Theft : ఈ మధ్యకాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడం కోసం ఏకంగా తమ అందమైన శరీరాలను ఆయుధాలుగా వాడుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమతో పాటు తమ అనుకున్న వాళ్ళని కూడా కటకటాల పాలు చేస్తున్నారు. కాగా తాజాగా ఓ మహిళ అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఏకంగా తన కూతురుతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలోని అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతంలో రాణి (పేరు మార్చాం) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. కాగా గత కొద్ది కాలంగా రాణి కి తన భర్తతో మనస్పర్థలు, విభేదాలు రావడంతో వేరుగా ఉంటోంది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని దొంగ గా మారింది. ఈ క్రమంలో ఈ దొంగతనాల్లో తన కూతురిని కూడా భాగం చేసింది. తాజాగా రాణి టిప్ టాప్ గా తయారయ్యి తన కూతురుతో కలిసి స్థానిక పట్టణంలోని ఓ నగల దుకాణానికి వెళ్లి చేతివాటం ప్రదర్శించింది.
ఆ సమయంలో తన అందం, అభినయం, వయ్యారాలు ఒలకబోస్తూ నగల కొట్టు యజమాని ని మరిపించింది. దీంతో నగల కొట్టు యజమాని కొంతమేర అశ్రద్ధగా ఉండటంతో చేతికందిన నగలన్నీ బ్యాగ్ లో సర్దుకొని వెళ్ళి పోయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత నగల కొట్టు యజమాని తేరుకొని తన కొట్టులో జరిగిన దొంగతనం గురించి తెలుసుకొని నిర్ఘాంతపోయాడు. అలాగే తన కొట్టు లో ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాలు పరిశీలించగా తల్లి కూతురు చేసిన ఘరానా మోసం గురించి బయట పడింది.

దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి రాణి దొంగతనం చేసిన నగలను ఇప్పించాలని పోలీసులను కోరాడు. అలాగే తన వద్ద ఉన్నటువంటి సిసి ఫుటేజీలను పోలీసులకు ఇచ్చి రాణి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లీకూతుళ్లను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా గతంలో వీరిద్దరు చేసిన ఘరానా మోసాలు కూడా బయట పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites