NTR vs Jayalalitha vs KCR
NTR vs Jayalalitha vs KCR : ఏపీ ఉద్యోగుల సమ్మె ఇప్పుడు ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా చిరాకు తెప్పిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడే విచ్చలవిడిగా జీతాలు పెంచిన ప్రభుత్వాలు ఖజానాకు చిల్లు పెట్లాయి. ఇప్పుడు మళ్లీ వారి హక్కు ప్రకారం పీఆర్సీ అడుగుతున్నారు. కానీ వైఎస్ జగన్ ప్రకటించిన పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గుతాయి కానీ పెరగవంటున్నారు ఉద్యోగులు. అంతే కాదు విచిత్రంగా పాత జీతాలే ఇవ్వమని పోరాటం చేసే స్తాయికి వచ్చారు. అంటే తమకు ఈ పీఆర్సీ వద్దని ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను ఎవరూ కాదనలేనిది. ఇంత పట్టుదల ప్రజా సేవలో కూడా వారు చూపించి ఉంటే జనం కూడా జేజేలు పలికేవారే. ప్రజా సమస్యలు తీర్చాకే ఆఫీస్ నుంచి కదలమని పని చేస్తే ఈ రాష్ట్రం ఎప్పుడో భాగుపడేది. నాయకులు అలానే ఉన్నారు. ఉద్యోగులూ అంతే ఉన్నారని రోజూ జరుగుతున్న బ్రేకింగ్ ప్రెస్ మీట్ల సినిమా చూసి జనం అవాక్కవుతున్నారు. అయితే ఆక్కడక్కడా మంచి అధికారులున్నా నూటికి 90 శాతం మంది లో అవినీతి లేదా అలసత్వం ఉందనేది కాదనలేని నిజం. అది మందులు లేని రోగంలా పాకింది. సామాన్యుడు సమస్య తీర్చమని వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు చెప్పే సాకులు ఎవరూ చెప్పరు. ఎందుకంటే వారికి బద్దకం. ఈ మాట సాక్షాత్తు 1986 లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు. ఎందుకంటే ఆయన స్వయంగా పథకాల అమలు నుంచి ఇతర కార్యక్రమాల వరకు అధికారుల్లో అలసత్వాన్ని చూశారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది బద్దకస్తులు, అవినీతి పరులన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 48 శాతం జీతాలకే ఇస్తున్నాం. అయినా పని చేయడానికేం ఏమవుతుంది. ఏంటీ బద్దకమని ఆయన అసహనం వ్యక్తం చేసేవారట. ఇక కింది స్తాయి ఉద్యోగస్తుల్లోని అవినీతి పై ఆయనకు లెక్కలేనన్ని నివేదికలు వచ్చేవట. అందుకే పదే పదే మీరు మాకు ప్రజలకు వారధిలాంటి వారు. క్రమశిక్షణతో పనిచేయండని బెదిరింపు ధోరణితో బతిమిలాడుకునేవారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు భయపడే రకం కాదని ఆయనకు తొందరల్లోనే తెలిసి వచ్చింది.
నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఎన్జీవో, సెక్రటేరియెట్ ఎన్జీవో, తెలంగాణ ఎన్జీవో సంఘాలు పీఆర్సీతో పాటు ఉద్యోగస్తుల డిమాండ్ లను ప్రభుత్వం ముందుంచారు. కానీ వాటిని చదివిని ముఖ్యమంత్రికి మతి పోయింది. ఇప్పటికే 48 శాతం జీతాలకు పంచుతున్నాం. ఈ డిమాండ్ లను ఒప్పుకుంటే తాము పాలన ఎలా చేసేదని ఫైర్ అయ్యారు. అలా అని ఉద్యోగస్తుల మాట తీసి పారేయలేనిది. వారికి ఉద్యోగమే జీవితం కాబట్టి వారి డిమాండ్ లను పరిశీలిస్తామన్నారు. కానీ వెంటనే తీర్చాలని ఉద్యోగస్తులు సమ్మెకు దిగారు. పాలన మొత్తం స్థంబించింది. స్కూళ్ల నుంచి ప్రభుత్వ ఆఫీస్ ల వరకు, హాస్పిటల్స్ నుంచి మున్సిపల్ ఉద్యోగుల వరకు అందరూ సమ్మెకు దిగారు. అయినా సరే ఎన్టీఆర్ కూడా భీష్మించారు. చివరకు చేసేది లేక ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంతో పాటు ఉద్యోగ సంఘ నాయకులను కలిపి పీఆర్సీ కమిషిన్ వేశారు. అన్ని సంప్రదింపుల తర్వాత కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. అన్నింటికి ఒప్పుకున్న ఎన్టీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై అదనపు బారం పడుతుందని మూడు డిమాండ్ లకు ఒప్పుకోలేదు. బేసిక్ సాలరీ కొంత పెంచాలని అడిగారు. అంతే కాదు జూన్ నుంచి కాకుండా జనవరి నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. వాటితో పాటు మరికొన్ని తరువాత చూద్దామని చెప్పారు. మొదట సమ్మె విరమించిన ఏపీ ఉద్యోగస్తులు కొంత కాలం తర్వాత మళ్లీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చారు. ఎందుకంటే వారి డిమాండ్ లను ఒప్పుకున్న ఎన్టీఆర్ మరికొన్నింటిలో కోత పెట్టారు. వయసు మీద పడిన తర్వాత సరిగ్గా పనిచేయడం లేదని 58 నుంచి 55 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ నేటి పాలకులు ఓట్ల కోసం ఏకంగా 62 ఏళ్లకు పెంచారు. ఇంత చేసిన ఏపీ ఉద్యోగస్తులు తమ పట్టు వీడటం లేదు. ఎన్టీఆర్ ముందు మళ్లీ పాత డిమాండ్ లను ముందు పెట్టారు. మేటర్నరీ లీవ్ ల నుంచి పదవీ విరమణ తో పాటు ఇతర బోనస్ లను కూడా ఇవ్వాలని కోరారు. పదే పదే ఎన్ని సార్లు మీరు సమ్మె చేస్తారని ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. అంతే కాదు ఉద్యోగస్తుల గొంతెమ్మ కోరికలు చూడమని మీడియాకు ఒక ప్రకటన ఇచ్చారు. ఒక పేజీ నిండా ప్రభుత్వం ఉద్యోగస్తులు అడిగిన డిమాండ్ లకు ఒప్పుకుంటే బడ్జెట్ మీద గుదిబండ పడుతుందని లెక్కలతో సహా వివరిస్తూ ప్రజలకు చెప్పారు సీఎం. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాకు రావాల్సిన వాటినే అడుగుతున్నామని సమ్మె బాట పట్టాయి. అయినా ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నారని ఏకంగా ఆర్టికిల్ 312 ప్రకారం కేసులు పెట్టారు. మరో నలుగురు ఉద్యోగులను బర్త్ రఫ్ చేశారు. దీంతో ఉద్యోగులు భగ్గుమన్నారు. ఇలా ఉద్యోగస్తులు, ఎన్టీఆర్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఎక్కడిక్కడ పాలన స్థంబించించిపోయింది. ఎన్టీఆర్ భయపడలేదు సరికదా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చూడండని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. అందరినీ ఉద్యోగంలోంచి తీసేస్తామని హెచ్చరించారు. అయితే అప్పటికే 50 రోజులకు సమ్మె చేరడంతో చిన్న ఉద్యోగస్తులే కాదు, మరో ఆధారం లేని, నిజాయితీ ప్రభుత్వ అధికారులు భయపడ్డారు. తమ ఉద్యోగం పోతుందేమోనని కలత చెందారు. అంతే కాదు రెండో నెల కూడా దగ్గరకు రావడంతో మరో నెల జీతం రాకపోతే పస్తులుండాల్సిందే. పిల్లల ఫీజులు, అద్దెలు ఎలా అని భయపడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో జీతాలు తక్కువగానే ఉండేవి. దీంతో ఒక వర్గం కాస్త మెతకబడింది. ఈ లోపు వామపక్ష నాయకులు ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వం కు మధ్య చర్చలు జరిపారు. చివరకు తాము విధుల్లో చేరుతామని సంకేతాలు పంపారు. కొన్ని డిమాండ్ లకు ఒప్పుకున్న ఎన్టీఆర్ మరికొన్నింటికి మాత్రం ససేమిరా అన్నారు. చివరకు ఉద్యోగస్తులు ఒక మెట్టు దిగారు, ఎన్టీఆర్ సైతం ఒక మెట్టు దిగి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చారు. అయితే దాదాపు గా రెండు నెలలు పని చేయలేదు కాబట్టి జీతం ఇవ్వడం కుదరదని చెప్పింది ప్రభుత్వం. దానిపై మళ్లీ కథ మొదటికివచ్చింది. దానిని సెలవు దినాలుగా పరిగణించాలని కోరారు. అయితే సర్వీస్ కాలం నుంచి సమ్మె సమయం తీసేస్తామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మాధ్యే మార్గంగా ప్రభుత్వం, వామ పక్ష నాయకులు, ఉద్యోగసంఘాల నాయకులు సమస్య జటిలం కాకుండా పరిష్కరించుకున్నారు. అందరూ ఉద్యోగస్తులే ఎన్టీఆర్ మెడలు వంచారని చెబుతున్నారని సంకలు గుద్దుకుంటున్నారు. అలా జరిగి ఉంటే సమ్మె 56 రోజులు జరిగేది కాదు.
Continue reading NTR vs Jayalalitha vs KCR : ప్రజా శ్రేయస్సును ద్రుష్టిలో పెట్టుకుని పనిచేయాలని మాత్రమే ఆయన కోరారు. నాడు ఎన్టీఆర్ మెడలు ఎవరూ వంచలేదు సరికదా…ఉద్యోగాలు తీసేస్తానని ఆయనే బెదిరించారు. కాకపోతే తరువాతి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటమికి క్రుషి చేసి ఉద్యోగస్తులు పగతీర్చుకున్నారు. అదొక్కటే ఆయన ఓటమికి కారణం కాకపోయినా మూకుమ్మడిగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎంప్లాయిస్ పనిచేశారనేది వాస్తవం.
ఇలాంటి సమ్మె గురించే నాటి తమిళనాడు జయలలిత ఏకంగా లక్షా 70వేల మంది ఉద్యోగస్తులను తొలగించింది. మీకు జీతం పెంచమని అడిగే హక్కు ఉంది. కానీ సమ్మె చేసే హక్కు లేదని జయ ఎంప్లాయిస్ కు వార్నింగ్ ఇచ్చింది. మీరు మమ్మల్ని శాసించలేరు. మా డిమాండ్ లకు ఒప్పుకోవాల్సిందేనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అమ్మకు కోపం వస్తే ఎలా ఉంటోందో చూపించింది. ఒకే సారి ఒకే సంతకం పోటుతో అందరినీ తొలగించింది. దీంతో ఉద్యోగస్తులు హాహాకారాలు పెట్టారు. అంతే కాదు కొత్త రిక్రూట్ మెంట్ కు ఏర్పాట్లు చేయాలని కూడా జయలలిత ప్రయత్నిస్తున్నారనే వార్తలతో ఉద్యోగస్తులంతా కాపాడండి మహా ప్రభో అంటూ సుప్రీం కోర్టు కు వెళ్లారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు సమ్మె చేసే అధికారం లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు ఉద్యోగస్తులు నిబంధనలను ఉల్లంఘిస్తే తొలగించే అధికారం ఉందని తేల్చింది. ఈ మాట విని అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఒకే సారి అంత మందిని తొలగించకుండా మానవతా ద్రుక్పథంతో ఆలోచించి సర్వీసుల్లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు జయలలిత సర్కారును కోరింది. దీంతో సరేనన్నారు. కానీ అందరూ డిక్లరేషన్ ఫామ్ లు ఇస్తేనే తీసుకుంటామని జయలలిత ప్రకటించారు. తాము మరోసారి సమ్మె చేయమని చెబితేనే తీసుకుంటామని చెప్పడంతో మాకు ఉద్యోగం కావాలి అంటూ అందరూ వ్యక్తిగతంగా తాము సమ్మెం చేయం. చేస్తే ఉద్యోగంలోంచి తొలగించమని వ్యక్తిగతంగా లేఖలు రాసిచ్చారు. ఆ తర్వాత అందరూ విధుల్లో చేరారు సమ్మె ముగిసింది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆర్టీసీ ఉద్యోగస్తుల డిమాండ్ లవిషయంలో ఇంతే కఠినంగా ఉన్నారు.
ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మెకు వెళ్లినప్పుడు ఏకంగా ప్రైవేట్ పరం చేస్తామని హెచ్చరించారు. అంతే కాదు అందరినీ సర్వీసుల్లోంచి తీసేస్తామని హెచ్చరించారు కేసీఆర్. 24 గంటల్లో విధుల్లో చేరిన వారికే ఉద్యోగం ఉంటుంది. లేదంటే తీసేస్తామన్నారు. రెండు నెలలు సమ్మె చేసినా కేసీఆర్ భయపడలేదు. అంతే కాదు ఇతర డ్రైవర్ లు, కండక్టర్ లను పెట్టి బస్సులను నడిపించారు. సమ్మె చేస్తున్నవారిని డిపోల్లోకి కూడా రానివ్వలేదు. కొంత మంది హై కోర్టుకు వెళ్లినా సరే వారికి అనుకూలంగా తీర్పు రాలేదు. లేబర్ కమిషన్ మాత్రమే మీ జీతాలు, డిమాండ్ లు, సమ్మె సంగతి తేలుస్తుందని చెప్పింది. మీరు లేబర్ కమిషన్ ను కలవాలని సూచించడంతో బంతి మళ్లీ ప్రభుత్వం కోర్టులోకి వచ్చింది. సమ్మె అనేది ఉద్యోగస్తులు హక్కు కాదని పరోక్షంగా సూచించింది. దీంతో ఇక తమ వల్ల కాదని ఎవరికి వాళ్లు డిక్లరేషన్ లు ఇచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కూడా సమ్మె కాలానికి జీతాలిచ్చి సమస్యను పరిష్కరించారు. ఇక ఇప్పుడు జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఉద్యోగుల డిమాండ్ లను పరిష్కరిస్తారా లేదంటే సమ్మెకు వెళ్లినా భయపడరా? ఇప్పటికే కరోనా తో పాటు రాష్ట్ర విభజన కారణంగా ఆదాయం కుంటుబడిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొత్త పీఆర్సీ ప్రకారం ఉన్న జీతం తగ్గుతోందని ఉద్యోగస్తులు భయపడుతున్నారు. మరి సమ్మె కంటే ముందే సమస్య పరిష్కారమైతే అందరికీ మంచిది. ఎవరు మొండిగా వ్యవహరించినా సమస్య జఠిలమవుతుంది. కానీ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారని అందరూ చూసుకుంటే మంచిది. ప్రజలకు కోపం వస్తే సమస్య మరోలా ఉంటుందంటున్నారు సామాన్యులు.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites