Number 13 Mystery in Telugu
13వ నెంబర్ అంటేనే మనలో చాలా మందికి భయం. ఇక మనం ఎంతో మంచి వారంగా, లక్ష్మీ వారంగా పిలుచుకునే శుక్రవారం రోజున పదమూడవ తేదీ వస్తే. 13ను అపశకునంగా భావించే వారికి టెన్షనే. ఎందుకంటే పదమూడు-శుక్రవారం అనేది చాలా ఏళ్లుగా అపశకునంగా భావిస్తారు. ఆ రోజు ఏదైనా మంచి పని చేస్తే అపశకునం ఎదురవుతుందని కీడుగా గుర్తించి ఏమీ చేయకుండా ఉంటారు. వీలైనన్ని కొత్త పనులు చేయకుండా నార్మలగా ఉండేలా చూసుకుంటారు. 13 మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అసలు పదమూడో నెంబర్ అంటేనే హార్రర్ అనే పేరు పడిపోయింది. మామూలగా మనకు శకునం, అపశకునం, దుర్మూహర్తం లాంటివి చూసుకోవడానికి కేలండర్ లు, పంచాంగాలు ఉన్నాయి. మనం ప్రతి రోజు ఏ పని మొదలు పెట్టినా కూడా మంచి టైమ్ చూసుకుని, మంచి రోజు చూసుకుని వెళ్తాం. ఎందుకంటే మనకు అష్టమి, నవమి అనేవి దుర్ముహూర్తపు రోజులు కాబట్టి. కానీ అమెరికన్ లకు మాత్రం పదమూడో నెంబర్ అంటే కంగారు. ఇదేదో దురదృష్టపు సంఖ్యగా భావిస్తారు. దానికి ఫ్రై డే కలిస్తే అంతే సంగతులు. ఇంట్లో నుండి వెళ్లడానికి కూడా భయపడతారు. ఎంతో ముందుందని భావించే అమెరికాలోనే ఎక్కువగా మూడనమ్మకాలు ఉన్నాయి. వాళ్లకు దెయ్యాలంటే చాలా మందికి నమ్మకం ఉంది. (Keep Reading Number 13 Mystery in Telegu )
ఇలానే ఈ శుక్రవారం 13వతేదీ కూడా రక్తంలో కలిసిపోయింది. ఎందుకంటే శుక్రవారం కాకపోయినా కూడా పదమూడవ తేదీని బ్యాడ్ డే గా భావిస్తారు. అది అన్ లక్కీ నెంబర్ అని చాలా మంది భావిస్తారు. అమెరికాలో ఈ భయాన్నే ప్రిగ్రాత్రిస్కైడెకాఫోబియా అంటారు. ఇదో మూడనమ్మక అని సైంటిస్టులు కూడా చెప్పారు. కాకపోతే 13వ నెంబర్ ను చెడుగా చూపిస్తు ఎన్నో హార్రరస్ స్టోరీలు, నవలలు, సినిమాలు వచ్చాయి. దీంతో నిజంగానే ఇదేదో భీకరమైన, జీవితాలను నాశనం చేసే బ్యాడ్ నెంబర్ గా మనసుల్లో నాటుకుపోయింది. ఇది ఇప్పటి నుండి కాదు వందల ఏళ్ల నుండి ఈ పదమూడో నెంబర్ ను తప్పుగా చూడటం మొదలైంది. దీనికి గ్రీకులో ఒక చరిత్ర కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏ నెలను కూడా ఆదివారంతో మొదలవ్వాలని కోరుకోరు. ఎందుకంటే గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఆదివారంతో నెల మొదలైతే శుక్రవారం పదమూడు అవుతుంది. దీంతో ఆ రోజున పుట్టినా, చనిపోయినా కూడా నరకానికే పోతామనే భయం కూడా ఉంది. క్రీస్తు కూడా శిలువ వేయబడ్డ రోజు కాబట్టి కూడా ఆరోజును అన్ లక్కీగా చూడటం మొదలైంది. అంతే కాదు అమెరికాలో ఏ క్రిస్టియన్ కూడా పదమూడున పెళ్లిళ్లు కూడా చేసుకోరు. తమ పిల్లల డెలివరీని కూడా 12ననే చేయించుకుంటారు. అంతలా వాళ్లలో ఈ ఫోబియా పాకిపోయింది. ఇంతే కాదు అమెరికాలో చాలా తుఫానులు వచ్చాయి. కానీ పదమూడున వచ్చిన వాటినే గుర్తుపెట్టున్నారు. 2004లో ఫ్లోరిడాలో ఆగష్టు 13 వచ్చిన పెను విలయం సృష్టించిన హరికేన్ కానీ, టోర్నిడోలు కానీ చాలా ఉన్నాయి. కానీ ఇది ఒక మూడ నమ్మకం మాత్రమే. ఈఫోబియా కారణంగా పదమూడు శుక్రవారం రోజున రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. జనం బయటకు రారు. పని చేయరు. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో కూడా కదలకుండా ఉండటానికే ఇష్టపడతారు. దీంతో ఆరోజు వంద కోట్ల డాలర్లపైన్నే నష్టం జరుగుతుందని ఓ సర్వేలో తేలింది. ఇది మూడనమ్మకమని ఎంత మంది చెప్పినా కూడా కోట్లాది మంది యూఎస్ లో ఈఫోబియా నుండి మాత్రం భయపడటం లేదు.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites