సెకండ్ హాండ్ షాప్ లో 1929 నాటి కెమరా కొంటే….షాకింగ్ ఫోటోలు బయటపడ్డాయి!

664
old camera photos
old camera photos

old camera photos : డచ్ ఫోటోగ్రాఫర్ మార్ట్‌జిన్‌ కు పాత కెమరాలు సేకరించడం హాబీ. నెదర్లాండ్స్ లోని ఒక పాత షాపులో క్లాసిక్ కెమరా ఒకటి దొరికింది. ఆ కెమరా పని చేయదని షాపు ఓనర్ చెప్పినా పర్వాలేదు నేను రిపేర్ చేసుకుంటానని కొన్నాడు. అయితే ఇంటికొచ్చి కెమరాను చూడగా అందులో 40ల నాటి కెమరా రోల్ కూడా ఉంది. జీఇస్‌ ఐకాన్ 520/2 మోడల్ కెమరా అది. కొడాక ఎక్స్‌పోజ్ రోల్ మాత్రం కొత్తగా ఉంది. దానిని జాగ్రత్తగా బయటకు తీసిన మార్ట్‌జిన్ ఫోటోలను కడగాలకున్నాడు. కానీ వాటిని కడిగే సదుపాయాలు ఇప్పుడు లేవు. నెదర్లాండ్ లోని ఫేమస్ ఓల్డ్ షాపులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని ప్రయత్నించాడు. తన ఫ్రెండ్స్ ని కనుక్కున్నాడు. నెగెటివ్ ని డెవలప్ చేయడానికి కొంత మంది పాత వస్తువులన్నీ సేకరించి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని తనే ఇంటికి తీసుకొచ్చి ఫ్రెండ్స్ సాయంతో నెగెటివ్ ని డెవలప్ చేశాడు. కానీ ఫోటోలు వస్తాయన్న గ్యారెంటీ లేదని అతని ఫ్రెండ్స్ ముందే చెప్పారు. ఫిల్మ్ పాడైపోయి ఉంటుంది, లైట్ కి కూడా రోల్ ఎక్స్‌పోజ్ అయి ఉంటుందని హెచ్చరించారు. అయినా పట్టువదలని మార్ట్‌జిన్ ఆ నెగెటివ్ ను కడిగించాడు. అందులో ఫోటోలను చూసి షాకయ్యాడు.

ఒకప్పుడు ఫ్రాన్స్ ఎలా ఉండేదో అందులో ఉన్నాయి. దానిని ఫోటోలు తీసిన వ్యక్తి వయసు పైబడిన వ్యక్తి అయి ఉంటాడని ఊహించాడు. దాదాపు 14 ఫోటోలకు పైగా బాగున్నాయి. అందులో ఇప్పుడు అద్భుతమైన సిటీగా చెప్పుకుంటున్న ఫ్రాన్స్ ఒకప్పుడు ఫిషింగ్ విలేజ్ అట. అందులో చిన్న చిన్న ఇళ్లు కాలువ ను చూసి షాక్ అయ్యారు. రోడ్లు, చిన్న ఇళ్ల ముందు ఒక మహిళ ఫోటో దిగడం కనిపించింది.

అప్పటి బట్టలు, వేష ధారణే కాదు పారిస్ట్ స్ట్రీట్ లు ఒక చిన్న గ్రామాన్ని తలపించడం అందులో ఫోటోగ్రాఫర్‌ ను షాక్ కు గురి చేసింది. అయితే అవి మరింత క్లారిటీ ఉంటే ….బాగుండేదని డచ్ ఫోటోగ్రాఫర్ అభిప్రాయపడ్డాడు. కొన్ని ఫోటోలు వచ్చినా కూడా క్లారిటీ లేకపోవడం కొద్దిగా నిరాశపర్చింది. అయితే ఈమాత్రం ఫోటోలైనా వస్తాయని మార్ట్‌జిన్ ఊహించలేదు. అయినా సరే లోకల్ మీడియా ఈ కెమారను, అందులోని ఫోటోలను ప్రచురించి ఆ 70 ఏళ్ల క్రితం నాటి కెమరాకు ప్రాచుర్యం కల్పించింది.

Previous articleరష్యా దూకుడుకి మూడో ప్రపంచ యుధ్దం వస్తుందా ?
Next articleEmoji లు ఎందుకు పాపులర్ అయ్యాయో, అవి ఎవరు తయారు చేశారో తెలుసా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here