Old Sculpture : అందరిని ఆశ్చర్యపరుస్తూ సైకిల్ మీద కనిపించిన శివుడు

506

రెండు వేల సంవత్సరాల క్రితం మన భారత దేశ పౌరులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు అనడానికి అనేక రకాలైన సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటిదే ఈ శిల్పం ( Old Sculpture ). పన్నెండు వందల సంవత్సరాల క్రితం చోళులు కట్టించిన తమిళనాడు గుడిలో సైకిల్ ని పోలిన శిల్పం ఉంది ( Old Sculpture ). ఈ ఆలయం పేరు పంచవర్ణ స్వామి ఆలయం. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో ఆధునిక పరికరాలను ఆ కాలంలోనే ఉపయోగించారు అనడానికి ఎన్నో రకాలైన ఆధారాలు ఉన్నాయి. ఇంత అత్యంత ఉన్నతమైన పరికరాలు ఉన్నా పంచవర్ణ ఈశ్వర దేవాలయం రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
పంచవర్ణ ఈశ్వర ఆలయం తిరుచినాపల్లి జిల్లా అనే ఒక చిన్న పల్లెలు ఉంది. ఈ ఆలయంలో పరమశివుడు వేరు వేరు సమయాలలో ఐదు వర్ణాలలో కనిపించారట. అందుకే ఈ ఆలయానికి పంచవర్ణ స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడ ఈశ్వరుని పంచవర్ణ స్వామి గా కొలుస్తారు. 7వ శతాబ్దంలో శైవులకు సంబంధించిన తిరు జ్ఞాన రచించిన దేవారం అనే గ్రంథంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. అక్కడ పరమశివుడిని తిరుగు కేశ్వరం గా కీర్తించడం జరిగింది. ఇవి కాకుండా ఎన్నో తమిళ వాంగ్మయ లలో ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయానికి పన్నెండు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఆలయ ప్రాకారాలు ప్రదక్షిణ మండపాలు గుడి లోపల చెక్కిన శిల్పాలు చాలా అద్భుతం. చరిత్రలో ఎన్నో విషయాలను దాచారు అందుకే మనకు చాలా విషయాలు తెలియదు. కొన్ని కనిపించే నిజాలు కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది. రెండు వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశ పౌరులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అని చెప్పడానికి ఇక్కడ అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటిదే ఈ శిల్పం ( Old Sculpture ).

పన్నెండు వందల సంవత్సరాల క్రితం తమిళనాడులో చోళులు కట్టించిన గుడి లో ఆధునిక సైకిల్ ని పోలిన శిల్పం ఉంది (Old Sculpture). పంచవర్ణ స్వామి ఆలయం శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. పంచవర్ణ స్వామి ఏడవ శతాబ్దములో నాయనారులు అని పిలువబడే శైవ భక్తుల చేత స్వామిని ప్రస్తుతించడం జరుగుతుంది. అందువలన 5 వ పాదల్ పెట్ర స్థలై అని ఈ స్థలాన్ని వర్గీకరించడం జరిగింది. ఈ స్థలం తొలి చోళుల పురాతన రాజధాని. ఇది ఇసుక తుఫాను తో నాశనం అయ్యింది అని నమ్ముతారు. తిరుప ఆల్వార్ వర్ణై ,పొంగల్ చోర్ణా , నాయనార్ మరియు ఖోచ్చంగట చోడై, జన్మించడం జరిగింది. ముకేశ్ వరం అని పిలువబడే ఈ మందిరం కావేరీ నదికి దక్షిణంగా ఉన్న చోళ రాజ్యమును దైవ స్థానాలలో అయిదవది గా పరిగణించబడుతుంది. దీనికి చోళుల కాలం నాటి అనేక శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఐదు గంటల 30 నిమిషాల నుండి 8:00 వరకు వివిధ సమయాలలో ఆరు రోజు వారి పూజలు లేదా ఆచారాలు సంవత్సరానికి మూడు సార్లు ఉత్సవాలు ఉంటాయి. వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాలు నికి దూర ప్రాంతాల నుండి కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని తమిళనాడు హిందూ మతం మరియు ఎండోమెంట్ బోర్డు నిర్వహించడం జరిగింది. చూడ రాజవంశం యొక్క ప్రసిద్ధ రాజు కళింగ  చోళన్ కవరింప న్ పట్టిన్ నుంచి ప్రయాణించేటప్పుడు ఈ ప్రదేశం ద్వారా వెళ్లడం జరిగింది. అతని ఏనుగు నుదిటిపై ఒక కోడిపుంజు తన్నుతుంది. ఏనుగు వెనక్కి తగ్గడం ప్రారంభిస్తుంది. రాజు ఈ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని గ్రహించి నగరాన్ని నిర్మించి ఇక్కడే ఉండి ప్రధాన కార్యాలయంగా మార్చారు. ఈ స్థలాన్ని వరయురికొలి అని కూడా పిలుస్తారు. తమిళంలో కోళి అంటే కోడిపుంజు అని అర్థం. ఈ స్థలం కోడలు యొక్క రాజధాని అని గ్రీకు యాత్రికుడు ఒకరు గుర్తించినట్లు చెబుతున్నారు. తిరుజ్ఞాన్న సంబంధం రాసిన 7వ శతాబ్దపు దైవ సంబంధ తేవారంలో ఈ స్థలాన్ని తిరుముకేశ్వరంగా సంబోధించడం జరిగింది. ఈ ఆలయంలో ప్రధానదైవం కి పంచవర్ణ స్వామి అనే పేరు ఉంది. పంచ వర్ణములను అంటే ఐదు రంగులు అని అర్థము. శివుడు 5 వేరువేరు భాగాలలో ఐదు రంగులలో ఉతంగ బుుషికి కనిపించాడు అని నమ్ముతారు. ఉదయం రత్న లింగం మధ్యాహ్నం స్పటిక లింగం సాయంత్రం బంగారు లింగం రాత్రి వజ్రపు లింగం అర్ధరాత్రి సమయంలో చిత్ర లింగంగా ఈ లింగం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని గరుడా ఆల్వార్ కర్కోదల్ రాజు బ్రహ్మ విష్ణు కశ్యపుని భార్య పూజించినట్లు భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ ఆలయంలో అయినా శివపూజలు జరిగితే ఆ ఆలయం యొక్క పూజలు కీర్తి ఈ ఆలయానికి చేరుకుంటాయి. అందుకే ఈ అర్థాన్ని కలిగి ఉన్నది ఉరయూరు అనే పేరు. ఒక నాస్తికుడు ఈ ఆలయంలో తనకిచ్చిన పవిత్రమైన విభూతి ప్రసాదాన్ని వదిలేశాడు. ఆ తరువాతి జన్మలో అతని బందీగా జన్మించి వికారం అయినటువంటి బురద కూపంలో జీవించ వలసి వచ్చింది. మునుపటి జన్మలో చేసిన పాపం వల్ల అతనికి ఆ పరిస్థితి వచ్చింది అని గ్రహిస్తాడు. ఈ ఆలయంలోని శివ తీర్థంలో స్నానం చేసి మునుపటి జన్మలోని పాపాన్ని పరిహారం చేసుకుంటాడు. కాంచీపురం ఏకాంబరేశ్వర భూమికి తిరువన్నామలై అగ్ని కాళహస్తి వాయువు చిదంబరం నుండి అంతరిక్ష ఆకాశానికి ప్రసిద్ధి. ఈ ఆలయంలోని శివుడిని ఆరాధిస్తే ఐదు మందిరాలలోనున్న స్వాములను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. ఆలయ ప్రాకారము మరియు ఐదు అంచెల రాజగోపురము ఉన్నాయి. ఇక్కడ ఉన్న అమ్మవారిని కాంతివతి అమ్మై అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న తీర్థం శివ తీర్థం మరియు నాగ తీర్థం. కల వృక్షం బిల్వం చెట్టు. ప్రవేశద్వారం వద్ద అందమైన మరియు గొప్పగా అలంకరించబడిన మంది భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో మహా మండపం అర్థ మండపం గర్భగుడి ఉన్నాయి. ముఖ్య సన్నిధి తూర్పు ముఖంగా ఉండి పంచవర్ణ స్వామి గ్రానైట్ తో చేసిన లింగ రూపంలో దర్శనమిస్తారు. ఆలయంలోని శివుడు స్వయంభు మూర్తి. ఇక్కడ పూజలు చేసే శివలింగం చాలా చిన్నది. గర్భ గుడి యొక్క ముఖ ద్వారం దక్షిణ దిశగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు అయిన కాంతి వతి అమ్మై తన రెండు చేతులలో అంకుశం పద్మాన్ని ధరించి తిరుముగం అంటే ఉత్తరం వైపు గా ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరగానే మహాదేవుడు సూర్యుడు శనీశ్వర మరియు కాలభైరవ విగ్రహాలు ఉన్నాయి. అర్ధ మండపంలో గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద ఎనిమిదవ శతాబ్దపు విలక్షణ లక్షణాలతో ఆరు అడుగుల పొడవైన అద్భుతమైన ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. రెండు విగ్రహాలు కూడా అద్భుతంగా అలంకరిస్తారు. ఉత్తరం వైపు ఉన్న ఆలయాలలో చెన్నకేశ్వర ఆలయం లో ఆరు అడుగుల పొడవైన గ్రానైట్ విగ్రహం ఆలయంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి. అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకు ఇక్కడ సన్నిధులు ఉన్నాయి. అద్భుతమైన శిల్పాలు స్తంభాల మండపం లో వకుళ ముఖాల గణపతి తాండవ శివుడు మరియు కాళి వంటి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే అకస్మాత్తుగా కోడి పుంజు ఒక రోజు ఆలయం లోపలికి వచ్చింది. అప్పటి నుంచి కూడా అక్కడే ఉండి ఆలయ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఉండిపోయింది. ఈ ఆలయానికి సంబంధించిన ఇతిహాసాలను వర్ణించే శిల్పకళతో ఈ ఆలయం నిండి ఉంటుంది. ఆలయ స్తంభాలపై కొన్ని అద్భుతమైన శిల్ప కళలు ఉన్నాయి. ఇది ఒక కోణం నుంచి చూస్తే నలుగురు స్త్రీలు గా మరొక కోణం నుంచి చూస్తే గుర్రం గా కనిపిస్తాయి. ఏనుగుపై మన్మధుడు సవారీ చేస్తున్న ఏనుగు విగ్రహం కూడా 11 మంది స్త్రీల సమూహం గుర్రంపై ఉన్నాం నా దారి గుర్రం గూడా 4 స్త్రీల సమూహం ఈ ఆలయంలో ఒక ఆంగ్ల లేడిస్ సైకిల్ పై ప్రయాణిస్తున్న శిల్పం ఉంది ( Old Sculpture ). ఈ ఆలయం కట్టినప్పుడు ఒక వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాల కాలం అని పురాణాలు చెబుతున్నాయి. కానీ సైకిల్ ని కనిపెట్టి రెండు వందల సంవత్సరాలు అయింది. మరి ఈ శిల్పం ( Old Sculpture ) చెక్కిన శిల్పి యొక్క ఊహాజనిత శిల్పమా లేక తరువాతి కాలంలో ఆలయ పునరుద్ధరణ సమయంలో మరో శిల్పి ఎవరైనా “చికారా ” అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకమే. శిల్పి యొక్క ఊహాజనితమే అయితే రెండు వందల సంవత్సరాల క్రితం ఆంగ్లేయ వ్యక్తి ధరించిన ఆ వ్యక్తి ముందుగానే ఎలా ఊహించారు అనేది అంతుచిక్కని విషయం. ఈ ఆలయంలో పూజలు చేస్తే భక్తులపై పడే ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పారు. ఇక్కడ భక్తులు స్వామిని దర్శనం చేసుకున్న అంత మాత్రాన వారి అన్ని పనులలో విజయం ఖాయమని తెలుస్తోంది.

 

Previous articleశివలింగం ఇంటిలో ఉండొచ్చా ?
Next articleఈ ఆలయాన్ని ఒక్కసారి చూస్తే ఎంతటి పాపమైన పోతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here