పరశురాముడు ఎవరు పరశురాముని ఆయుధాన్ని ఎవరు ఇచ్చారు ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆశక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన దగ్గర ఉండి ఆయుధం ఇప్పటికీ ఉంది అని అది నరమానవుడు కూడా అంతుచిక్కని రహస్యం గా ఉంది అంటారు. పరశురాముడి గురించి ఆయన ఆయుధం గురించి అది ఇప్పుడు ఎక్కడ ఉంది అది విషయాల గురించి ఈ విషయాలు తెలుసుకుందాం. మన అఖండ భారతావని గురించి మనం వివరంగా తీసుకోవాల్సి వస్తే విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు. ఈయన మహర్షి జమదగ్ని ఆయన భార్య రేణుకకు జన్మించాడు. త్రేతా యుగంలో జన్మించిన ఈయన హిందూమతం లో ప్రసిద్ధి చెందిన ఏడుగురు అమరవీరుల లో ఒక్కడు. ఈయన పుట్టుకతోనే బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా క్షత్రీయ దూకుడు ధైర్యం కలిగినవాడు. అందుకే ఈయనకు బ్రాహ్మణ క్షత్రియ అనే పేరు వచ్చింది. ఈయన యుద్ధతంత్రం లో అద్భుతమైన నైపుణ్యం కలిగిన వాడు. ఈయన 21సార్లు భూమి మీద ఉన్న అవినీతి యోధులను ఒంటరిగా మట్టికరిపించాడు. పరసు అంటే గొడ్డలి అని అర్థం. ఈ విధంగా గొడ్డలి మోసిన రాముడిగా పరశురాముడి పేరుని అనువదించారు.
పరశురాముడు ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తన దారికి అడ్డునిలిచిన క్షత్రియులను చంపడానికి సిద్ధమయ్యే వాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణం వల్ల మిగిలిన బ్రాహ్మణులు అతనిని త్యజించారు. పురుషుల కోసం నిబంధనలను అతిక్రమించి హత్యలు చేసినందుకు అపకీర్తిని పొందాడు. పరశురాముడి గురించి మనకు తెలియని ఎన్నో నిజాలు ఇప్పటికీ కూడా హిందూ పురాణాలలో దాగున్నాయి. రేణుక తీర్థం పరశురాముడు జన్మస్థలంగా చెప్పబడింది. ఇది కూడా ఆధునిక కాల మహేశ్వర వంశ పరంపర లో జరిగింది అని అంటారు .ఇతని తండ్రి అయిన రిషి జమదగ్ని ఇతను పుట్టకముందు ఇతని తల్లిదండ్రులు శివుని ఆశీర్వాదం కోసం ప్రార్థనలు చేశారు. దీని ఫలితమే వీరికి కలిగిన ఐదవ సంతానం విష్ణుమూర్తి ఆరవ అవతారం గా జన్మించడానికి దారితీసింది. అతనికి పుట్టుకతోనే రామభద్రుడు అని పేరు పెట్టారు. అతి చిన్న వయసులోనే పరశురాముడికి ఆయుధాలను ఆసక్తి ఎక్కువగా ఉండేది. అతడు శివుని మెప్పించడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. చివరికి గొడ్డలిని వరంగా పొందుతాడు. తన ఆధ్యాత్మిక గురువు శివుడి అని తెలుసుకొని ఎంతో శక్తివంతుడు అని నిరూపించుకున్న తరువాత ఈ ఆయుధం ఇవ్వడం జరిగింది. అతను పరుశురాముడు అని పిలువబడ్డాడు. శివుడు పరశురాముడు యొక్క యుద్ధం నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఒక సవాల్ చేశాడు. గురువుకి శిష్యుడు కి మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం 21 రోజుల పాటు కొనసాగింది. యుద్ధసమయంలో పరశురాముడు శివుని త్రిశూలం నుంచి తప్పించుకుంటూ శివుడి నుదుటి పై తన గొడ్డలిని తాకించాడు. ఇది చూసి ఆ పరమేశ్వరుడు శిష్యుడు యుద్ధకళ లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు అని సంతోషించాడు. తన గాయాన్ని స్వీకరించి తన క్రమశిక్షణ కీర్తి శాశ్వతమైనది అని నిరూపించుకున్నాడు. అప్పటినుంచి అతను ఖండ పరశు గా పిలువబడ్డాడు. పరశురాముని తల్లి రేణుక ఎంతో అంకిత భావం కలిగిన భార్య. మట్టి యొక్క మూలం నుంచి నీటిని సేకరించడం ఆమె నమ్మకానికి తార్కాణం. ఒకరోజు కుండతో నీళ్లు నింపుతున్న పొడవు ఆకాశమార్గాన గాంధర్వ రథం ప్రయాణించడం చూసి ఒక్క క్షణం కోరికలకు లోనవుతుంది. దాని ఫలితంగా కుండా నీటిలో కరిగిపోతుంది. తన యోగశక్తి ద్వారా ఆమె భర్త ఈ విషయాలు అన్నిటినీ తెలుసుకొని ఎంతో ఆవేశంతో ఆమెను గొడ్డలితో చంపమని తన కుమారుడికి ఆదేశిస్తాడు. పరశురాముడు మినహా మిగిలిన కుమారుడు ఎవ్వరూ కూడా ఈ పని చేయడానికి ఇష్టపడరు అతను తన తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి తల్లిని నలుగురు అన్నలనీ కూడా నరికేస్తాడు. ఆ తరువాత తండ్రి అతన్ని రెండు వరాలు కోరుకోమంటాడు. అప్పుడు అతను తన తల్లిని అన్నలను బ్రతికించమని కోరతాడు. వెంటనే తండ్రి పరశురాముడికి వరాలను ప్రసాదిస్తాడు. కొన్ని లక్షల సంవత్సరాల తరువాత పరశురాముడు ఆయుధం ఈ ప్రదేశంలో లభించింది. పరశురాముని యొక్క పెద్ద గొడ్డలి ఇప్పటికీ మన భూమండలం మీద ఉంది అని అంటారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రం రాజధాని రాంచీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో కుమ్లా జిల్లాలో ఒక కొండ పైన ఉన్న ఆలయంలో ఉంది. దీన్ని తంగినాద్ ధర్మ అని అంటారు. ఈ ఆలయంలోని పరశురాముని గొడ్డలి ఉంది. ఈ గొడ్డలి బహిరంగ ప్రదేశం లోనే ఉన్నప్పటికీ ఈ రోజు వరకు అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన విశేషం. వేలాది సంవత్సరాల తర్వాత కూడా ఇది ఎలా సురక్షితం అన్నది అంతుచిక్కని ప్రశ్న. పరశురాముడు సంగీతదామ్ వద్దకు వచ్చి తన గొడ్డలిని భూమిలో పెట్టడం వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏమిటంటే త్రేతాయుగంలో జనక్ పూర్ లో సీతామాత స్వయంవరం సందర్భంగా రాముడు శివుని విల్లు విరిచిన అప్పుడు పరశురాముడు ఆ భయంకరమైన శబ్దానికి కోపంతో జనక్ పూర్ చేరుకుంటాడు. అయితే అతను రాముని గుర్తించకుండా చాలా మాటలు అంటాడు. యముడు విష్ణుమూర్తి యొక్క అంశాన్ని తెలుసుకున్న తరువాత సిగ్గుపడి తన చర్యలకు ప్రాయశ్చిత్తంగా దట్టమైన అడవుల మధ్య ఒక పర్వత ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఉన్నప్పుడు అతను తన గొడ్డలనీ పాతిపెట్టి తపస్సు చేయడం ప్రారంభించాడు. అదే స్థలాన్ని ఇప్పుడు తంగినాధ్ దామ్ అని పిలుస్తారు. పరశు రాముని పాద ముద్రలు కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ వందలాది శివలింగాలు పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా బహిరంగ ప్రదేశం లోనే ఉన్నాయి. 1989లో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపినట్లు గా చెబుతారు. వజ్రాల తో నిండిన కిరీటాలు బంగారు వెండి ఆభరణాలతో సహా అనేక విలువైన వస్తువులు దొరికాయని ఆ తర్వాత తవ్వకాల అకస్మాత్తుగా ఆగిపోయాయి అని అంటారు. దీని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఒక రహస్యం. అదే సమయంలో తవ్వకాలలో దొరికిన వస్తువులను ఇప్పటికీ డుమ్రీ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. ఇది పరశురాముడి చరిత్ర.