Nithiin : నితిన్ సినిమా కి పవన్ కళ్యాణ్ అలా హెల్ప్ చేసాడట… అందుకే….?

417

Nithiin : తెలుగులో 2002వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన జయం అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవగా వెటరన్ హీరోయిన్ సదా హీరోయిన్ పాత్రలో నటించి తన ముద్దు ముద్దు డైలాగులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నటించిన గోపీచంద్ కూడా బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే పేదింటి కుర్రాడు డబ్బున్న యువతిని ప్రేమించడంతోపాటూ ఆమె ప్రేమని గెలిపించుకోవడానికి ఎలాంటి అవస్థలు పడ్డాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మరో వైపు ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ అందించిన పాటలు కూడా మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యాయి. దీంతో కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 32 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో మొదటి చిత్రంతోనే 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించిన మొదటి హీరోగా హీరో నితిన్ రికార్డులకెక్కాడు. కానీ ఈ జయం చిత్రం నిర్మాణం వెనుక పెద్ద స్టోరీ ఉందని చాలా మందికి తెలియదు.

అయితే హీరో నితిన్ ఒకప్పటి సినిమా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తనయుడు కావడంతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశం కొంతమేర సులభంగానే జరిగిందని చెప్పవచ్చు. కాగా పని నిమిత్తమై దర్శకుడు తేజ ఓసారి డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఇంటికి వెళ్లగా సుధాకర్ రెడ్డి తన కొడుకు నితిన్ ను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటని చెప్పాడట. దీంతో అప్పటికే దర్శకుడు తేజ కూడా జయం చిత్రం కోసం యంగ్ హీరోని వెతుకుతుండడంతో నితిన్ ని ఆడిషన్ చేసి హీరో గా సెలెక్ట్ చేశాడట. ఆ తర్వాత సినిమా పనులు ప్రారంభించి దాదాపుగా అరవై శాతం పైగా షూటింగ్ పనులు పూర్తయిన సమయంలో కొంతమేర ఆర్థిక సమస్యలు తలెత్తాయట.

దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఆర్థికంగా సహాయం చేసినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. కానీ ఈ చిత్రం మంచి హిట్ అవడంతో దర్శకనిర్మాతలు మళ్ళీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆర్థికంగా సహాయం చేసిన డబ్బుని తిరిగి ఇచ్చేశారట. అయితే అప్పటికే డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 2, 3 చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. దాంతో ఆ పరిచయంతోనే పవన్ కళ్యాణ్ నితిన్ సినిమాకి సహాయం చేశాడని ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి నితిన్ భక్తుడిగా మారిపోయాడట.

అయితే తెలుగులో మంచి హిట్ అయిన జయం చిత్రాన్ని తమిళ భాషలో ప్రముఖ దర్శకుడు ఎమ్.రాజ జయం పేరుతో రీమేక్ చేసి మళ్ళీ 2003వ సంవత్సరంలో విడుదల చేయగా తమిళ భాషలో కూడా మంచి హిట్ అయ్యింది. దీంతో ఈ చిత్రంలో హీరోగా నటించిన హీరో రవి జయం చిత్ర పేరుని తన పేరుకి ముందు తగిలించుకుని జయం రవిగా స్రీన్ నేమ్ మార్చుకున్నాడు.

Previous articlezoya lobo : ఒకప్పుడు ఈ ట్రాన్స్ జెండర్ రైళ్లలో బిచ్చమెత్తునేది.. కానీ ప్రస్తుతం….
Next articleJayalalitha : వాళ్ళు నటి జయలలిత ని అలా మోసం చేసారట… దాంతో ఎక్కడికెళ్లినా…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here