Mahesh babu : మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చాలా పెద్దదే…!

191

Mahesh babu : సినిమా పరిశ్రమలో ఒక్కోసారి కొంతమంది నటీనటులు తమ వ్యక్తిగత కారణాల వల్లగాని లేదా ఇతర కారణాల వల్ల గానీ హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలను మిస్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో చివరికి ఈ అవకాశాలు ఇంకొకరికి లభించడంతో సినీ కెరీర్ మలుపు తిరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రి మాదిరిగానే సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి దాదాపుగా సౌత్ ఇండియాలోనే తెలియని వారుండరు.

అయితే నటుడు ప్రిన్స్ మహేష్ బాబు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన కుటుంబ పరపతిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో పలు హిట్లు, ప్లాపులు అందుకున్నప్పటికీ ఏ మాత్రం చలించకుండా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే గతంలో ప్రిన్స్ మహేష్ బాబు పలు అనివార్య కారణాలవల్ల కొన్ని హిట్ చిత్రాల లో నటించే అవకాశాలను కోల్పోయాడు. ఇప్పుడు ఆ చిత్రాల లిస్ట్ ఏంటో చూద్దాం.

మనసంతా నువ్వే : తెలుగులో ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ మరియు ప్రముఖ సీనియర్ దర్శకుడు వి. ఎన్ ఆదిత్య తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కిన మనసంతా నువ్వే చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు ని మొదటగా అనుకున్నారట ఈ చిత్ర కథ అని రాసిన ప్రముఖ దర్శకుడు మరియు సినీ నిర్మాత ఎమ్మెస్ రాజు. కానీ మహేష్ బాబు కి క్లైమాక్స్ సన్నివేశాలు నచ్చకపోవడంతో ఈ చిత్ర కథని రిజెక్ట్ చేశాడట.

రుద్రమదేవి : ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకి మొదటి ఛాయిస్ మహేష్ బాబెనట. అంతేకాకుండా గుణ శేఖర్ కూడా మహేష్ బాబుతో ఉన్నటువంటి చనవుతో రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో నటించమని రిక్వెస్ట్ చేశాడట. కానీ అప్పటికే మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంతో కమిట్ అయి ఉండటంతో డేట్లు కుదరలేదట. దీంతో చివరికి ఈ అవకాశం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని వరించింది.

వర్షం : అప్పట్లో ప్రభాస్ హీరోగా నటించిన వర్షం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర కథ కూడా మొదటిగా ప్రిన్స్ మహేష్ బాబు దగ్గరికి వెళ్లిందట. కానీ మహేష్ బాబు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రంలో హీరోగా నటించిన లేక పోయాడట. దీంతో చివరికి ప్రభాస్ వర్షం కథని యాక్సెప్ట్ చేయగా మంచి రిజల్ట్ వచ్చింది.

ఫిదా : ఇక ఆ మధ్య తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. దీంతో ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఇద్దరూ ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటగా ఫిదా చిత్ర కథను మహేష్ బాబు కి వినిపించాడట. కానీ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా ఉండటం మరియు హీరోయిన్ డామినేషన్ ప్రభావం కథపై ఎక్కువగా ఉండటంతో మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడట.

లీడర్ : 2010 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన లీడర్ చిత్రం కుడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ చిత్రంలో మొదటిగా ప్రిన్స్ మహేష్ బాబును హీరోగా నటింపజేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారట. కానీ పలు అనివార్య కారణాల వల్ల మహేష్ బాబు ఈ చిత్ర కథను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

గజిని : తెలుగులో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించిన గజిని చిత్రం మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ చిత్రం హిందీ భాషలో కూడా రీమేక్ చేయగా హిట్ అవ్వడంతో పాటు దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది. అయితే ఈ చిత్ర కథ కూడా మొదటగా మహేష్ బాబు దగ్గరికి వచ్చిందట. కానీ ఈ చిత్రంలో కనిపించే హీరో లుక్ లో మహేష్ బాబు పెద్దగా సూటవ్వక పోవడంతో చివరికి ఈ అవకాశం హీరో సూర్య ని వరించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే హీరో మహేష్ బాబు సినీ కెరియర్ లో రిజెక్ట్ చేసిన చిత్రాల లిస్టు కొంచెం పెద్దగానే ఉంటుంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నటిస్తున్న సర్కారు వారి పాట అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు వివాదం ఉండటంతో వివాదం సద్దుమణిగిన తరువాత సర్కారు వారి పాట చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది మే 12వ తారీకున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Previous articleKalyan chakravarthy : అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకి దూరమయ్యాడా…?
Next articleరష్యన్ సైనికులను హతమార్చేందుకు తెలివిగా బాంబులను తయారచేసున్న ఉక్రైన్ ప్రజలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here