Ashwini Dutt : జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం అంతమంది పని చేశారా…?

119

Ashwini Dutt : టాలీవుడ్ లో 1990వ సంవత్సరంలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “గదేకవీరుడు అతిలోకసుందరి” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ నటి మరియు మాజీ విశ్వసుందరి శ్రీ దేవి దేవకన్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, బేబీ షామిలి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా దాదాపుగా 14 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించే దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది. కాగా తాజాగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన తెలుగు ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను సినిమా ఇండస్ట్రీకి కేవలం చిత్రాలను నిర్మించడానికి మాత్రమే రాలేదని అప్పటికి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయినటువంటి ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, మరియు ఇతర సినీ నిర్మాతలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తనకంటూ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నానని అలాగే అందుకోసం చాలా శ్రమించానని చెప్పుకొచ్చాడు. అలాగే తను ఆఖరి పోరాటం చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన తరువాత మళ్లీ అలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ని తెరకెక్కించాలని అనుకున్నానని ఈ క్రమంలో తన స్నేహితుడైన జంధ్యాల జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్ర కథను చెప్పాడని దాంతో తనకు కూడా స్టొరీ నచ్చడంతో వెంటనే ఓకే చేశానని తెలిపాడు.

అయితే ఈ చిత్ర స్క్రిప్ట్ ని కొంతమేర చందమామ కథలు ట్యాగ్ లైన్ ఇన్సిపిరేషన్ ద్వారా డెవలప్ చేశామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఈ చిత్ర కథ కోసం యండమూరి వీరేంద్ర నాథ్, కె.రాఘవేంద్రరావు, అనంత శ్రీరామ్, విజయేంద్ర ప్రసాద్,క్రేజీ మోహన్ తదితరులు కలసి కథ విషయంలో పని చేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపాడు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా దాదాపుగా నెల రోజుల పాటు ప్రతిరోజు ఈ చిత్ర కథాంశంపై చర్చించడానికి సమయం కేటాయించాడని అందువల్లనే అంత మంచి సినిమాని తీశామని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవికి తన సినీ కెరీర్లో ఎన్నో హిట్లు ప్లాపులు ఉన్నప్పటికీ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మాత్రం చెరిగిపోని మైలు రాయిగా నిలిచిపోయిందని అలాగే తమకి కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ సక్సెస్ కావడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు.

ఇక ఈ చిత్రం అప్పట్లోనే దాదాపుగా 12 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా దాదాపుగా 45కు పైగా థియేటర్లలో 100 రోజులు ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. అలాగే అప్పట్లో 12 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని బాలీవుడ్, కోలీవుడ్ తదితర భాషలలో రీమేక్ చేసి విడుదల చేశారు. దీంతో అనుకున్న విధంగానే ఇతర భాషలలో కూడా ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Previous articleచిత్రా రామక్రిష్ణ : స్టాక్ మార్కెట్ గుట్టు ఆ హిమాలయాలలో ఉన్న రహస్య యోగి చేతిలోకి ఎలా వెళ్ళింది.
Next articleRussia vs Ukraine : దాడికి మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here