Kalpalatha : చిన్నప్పుడే తల్లదండ్రులకి అనారోగ్యం, 14 ఏళ్లకే పెళ్లి… కల్పలత కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు…

232

Kalpalatha : ఎలాగైనా సరే ఒక్క అవకాశం దక్కించుకొని వెండితెరపై తమ నటనా ప్రతిభను నిరూపించుకోవాలని తరచూ చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి అవకాశాలు సులభంగానే లభించినప్పటికీ మరికొందరికి మాత్రం ఏళ్ల తరబడి సినిమా ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లభించక కెరియర్ పరంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో లేటు వయసులో గుర్తింపు దక్కించుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లు ఒడిసి పట్టుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నవాళ్ళు కూడా లేకపోలేదు.

అయితే ఇటీవలే తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పలత కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే నటి కల్పలత ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి రావడంతో అవకాశాల పరంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది. కానీ పుష్ప చిత్రంలో తన పాత్రకి ప్రాధాన్యత ఉండటంతోపాటు కల్పలత కూడా తన పాత్రకి తగిన న్యాయం చేయడంతో సినీ విమర్శకులు మంచి ప్రశంసలు అందుకుంటోంది. కాగా తాజాగా నటి కల్పలత పుష్ప చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా చిన్నప్పుడే తన తల్లిదండ్రులు పలు అనారోగ్య పరిస్థితుల కారణంగా శస్త్ర చికిత్సలు చేయించుకొని మంచాన పడ్డారని దాంతో తన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానని ఎమోషనల్ అయింది. ఆ సమయంలో తను చిన్నపిల్ల కావడంతో కనీసం తన పనులు కూడా తన చేసుకోలేని పరిస్థితులలో జీవితం గడపానని అలాగే తనకి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన బంధువుల ఇంటికి వెళ్లానని కొంతకాలం తర్వాత హైదరాబాద్ కి వచ్చామని తెలిపింది. అయితే అప్పటి వరకూ పల్లెటూరి వాతావరణంలో పెరిగిన తనకి హైదరాబాద్ కొత్త కావడంతో ఇక్కడికి వచ్చిన కొత్తలో మనుషులతో మాట్లాడాలంటే కొంతమేర భయం వేసేదని చెప్పుకొచ్చింది. కానీ క్రమక్రమంగా అలవాటు పడటంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకోసం ప్రయత్నించానని తెలిపింది. అయితే తాను సినిమా ఇండస్ట్రీలో మాత్రం వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను చూశానని ఈ క్రమంలో ఎక్కువ మంది మనసులో ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి మాట్లాడుతూ తమ వ్యక్తిత్వానికి ముసుగు ధరించి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని బాగా గమనించానని పేర్కొంది.

అలాగే తనకు ప్రముఖ స్వర్గీయ నటి శ్రీ దేవి అంటే అమితమైన అభిమానమని ఒకరకంగా చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ఇన్స్పిరేషన్ నటి శ్రీ దేవి అని తెలిపింది. కాగా తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ధారావాహికలో నటించే అవకాశం వచ్చిందని కానీ అప్పట్లో తనకి నటనపరంగా పెద్దగా అనుభవం లేకపోవడంతో కొందరు తన తోటి నటీనటులు తనని చూసి విసుక్కునేవాళ్లని అలాగే తన వెనుక హేళనగా మాట్లాడే వాళ్ళని చెప్పుకొచ్చింది. ఓసారి ఏకంగా సీరియల్ యూనిట్ సభ్యులు తనకు చెప్పకుండా తనని సీరియల్ లోనుంచి తీసేశారని తెలిపింది.

దాంతో ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అప్పుడే బలంగా నిర్ణయించుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ప్రయత్నించి ప్రస్తుతం మంచి గుర్తింపు దక్కించుకున్నానని తెలిపింది. ఇక తన వైవాహిక జీవితం గురించి స్పందిస్తూ తనకు 14 ఏళ్ళ వయస్సున్నప్పుడే పెళ్లయిందని ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. అప్పట్లో తనని చూసి నటన రాదని హేళన చేసిన వాళ్లకి తన విజయంతో సమాధానం చెప్పానని అందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది.

Previous articleRaveena Tandon : తమ్ముడితోనే అఫైర్ పెట్టుకుందంటూ హీరోయిన్ గురించి ప్రచారం.. కానీ నిజమేమిటంటే…
Next articleDivorce : విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్… కారణం అదేనట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here