Pedarayudu : పెదరాయుడు చిత్రం కోసం రజినీకాంత్ అంత తీసుకున్నాడా..?

698

Pedarayudu : తెలుగులో ప్రముఖ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో వెటరన్ హీరోయిన్ భానుప్రియ, సౌందర్య, రాజా రవీంద్ర, బ్రహ్మానందం సీనియర్ నటి జయంతి, బాబు మోహన్, ఆనంద్ రాజ్, సీనియర్ హీరోయిన్ శుభ శ్రీ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు “రవి రాజా పినిశెట్టి” దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీత స్వరాలు సమకూర్చాడు. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన మంచు మోహన్ బాబు నిర్మాతగా కూడా మారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ చిత్రం విడుదలయి దాదాపుగా 26 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఈ టీవీలో పెదరాయుడు చిత్రం ప్రసారమయినప్పుడు మాత్రం మంచి టిఆర్పి రేటింగులు నమోదు చేస్తోంది.

అయితే ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించిన నాట్టమై చిత్రం అనువాదంగా తెలుగులో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం తెరకెక్కించిన సమయంలో నటుడు మంచు మోహన్ బాబు పూర్తిగా ఆర్థిక కష్టాలలో కొడుకుపోయాడట. దీంతో అప్పులు చేసి మరీ పెదరాయుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రంలో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి బాగానే అలరించాడు. అయితే ఈ చిత్రంలో కేవలం 20 నిమిషాల నిడివి ఉన్నటువంటి పాత్ర కోసం రజనీకాంత్ దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.

కానీ ఈ రెమ్యునరేషన్ మాత్రం సినిమా పూర్తయి విడుదలై హిట్ కొట్టిన తర్వాత తీసుకున్నాడట. అలాగే మంచు మోహన్ బాబు నాట్టమై చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కులను కొనేటప్పుడు కూడా రజనీకాంత్ చాలా ధైర్యం చెప్పాడని అంతేకాకుండా ప్లాష్ బ్యాక్ సన్నివేశాలలో తానే నటిస్తానని దీంతో సినిమా హిట్ అయితేనే రెమ్యునరేషన్ ఇవ్వమని లేకపోతే వద్దని కూడా చెప్పాడట. కానీ పెదరాయుడు చిత్రం విడుదలైన తర్వాత మాత్రం తెలుగు బాక్సాఫీస్ రికార్డులను పూర్తిగా బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఇప్పటికీ వసూళ్ళ పరంగా పెదరాయుడు చిత్రం సృష్టించిన రికార్డులు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారానే మంచు మోహన్ బాబు కి కలెక్షన్ కింగ్ గా గుర్తింపు కూడా లభించింది.

అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 40కిపైగా సెంటర్లలో 100 రోజులు ఆడింది. దీంతో ఎక్కువ థియేటర్లలో 100 రోజులు ఆడిన చిత్రాల పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటగా 15 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన మొట్ట మొదటి చిత్రంగా పెదరాయుడు చిత్రం రికార్డులకెక్కింది. కాగా ఇందులో నైజాం ఏరియాలో 4 కోట్ల రూపాయలు, సీడెడ్ ఏరియాలో 2 కోట్ల రూపాయలు మరియు బీ, సీ సెంటర్లలో దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో మంచు మోహన్ బాబు ఆర్థిక కష్టాలు పూర్తిగా తీరిపోయాయట. ఏదేమైనప్పటికీ ఒకప్పుటి మాదిరిగా మంచు మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

Previous articleDasari Narayana rao : అందుకే ఒకప్పటి ఈ లెజెండరీ దర్శకుడి కొడుకులు సక్సెస్ కాలేకపోయారా..?
Next articleMohan Babu : మోహన్ బాబు కుటుంబానికి ఆ స్టార్ హీరో ఫ్యామిలీతో విబేధాలు స్టార్ట్ అయ్యాయా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here