Rakesh Jhunjhunwala :
క్రికెట్ లో సచిన్ టెండుల్కర్, డ్యాన్స్ లో మైఖేల్ జాక్సన్, బాక్సింగ్ లో మైక్ టైసన్…షేర్ మార్కెట్ లో కింగ్…రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఈ ఝున్ ఝున్ పేరు విచిత్రంగా ఉంటుంది. ఈ రాకేష్ ను ఇండియన్ వారెన్ బఫెట్ అంటారు. వారెన్ కు కనీసం పెరుగుతున్న స్టాక్ మార్కెట్ లు, అభివ్రుద్ది జరిగిన దేశంలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. కానీ కేవలం 150 పాయింట్ లు మాత్రమే ఉండి, ముంబైలో స్టాక్ మార్కెట్ బిల్డింగ్ గురించి వెనుక వైపు కాలనీ వారికి కూడా తెలియని రోజుల్లోనే తన భవిష్యత్ స్టాక్ మార్కెట్ లో ఉందనుకున్నారాయన. అందుకు ఆయన కుటుంబ పరిస్థితులు కూడా కలిసివచ్చాయి. జులై 5, 1960 లో హైదరాబాద్ లో పుట్టారు రాకేష్. అతని తండ్రి ముంబైలో సెటిలయ్యారు. అయితే ఐటీ అధికారికగా పలు రాష్ట్రాలు బదిలీకావడంతో చాలా ప్రాంతాలు తిరగాల్సివచ్చేది. చివరకు ముంబై వెళ్లి 85లో సైడెన్ హ్యామ్ కాలేజీలో సీఏ పూర్తి చేశారు రాకేష్.
కానీ ఉద్యోగాలు ఇష్టం లేదు. తండ్రి మాత్రం సీఏ గా మంచి భవిష్యత్ ఉండే దారి చూపిస్తానని చెప్పేవారు. తనకు తెలిసిన కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను. చేయమనేవారు. కానీ కొత్తగా ఆలోచించిన వాడికే సక్సెస్ దక్కుతుంది. అది కూడా రీ సౌండ్ వచ్చేలా సక్సెస్ ఉండాలి అనుకున్నారు. అందుకే తాను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా కెరీర్ మొదలు పెడదామనుకుంటున్నానని చెప్పారు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. కానీ నీకు నేను రూపాయి ఇవ్వను. నా ఫ్రెండ్స్ ను కూడా అడుగొద్దని వార్నింగ్ ఇచ్చారు తండ్రి. సరేనని తండ్రి పై కోపంతో లేచి వెళ్లిపోయాడు రాకేష్. అయితే తన అన్న అప్పటికే లైఫ్ లో సెటిల్ కావడంతో నాకు ఐదు వేలు కావాలి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడంతో సరేనని 5వేలు ఇచ్చాడు. ఆ డబ్బులతో మొట్టమొదటి సారిగా టాటా టీ స్టాక్స్ ను కొన్నాడు. నెల రోజుల్లోనే 5వేలకు కాస్త 20వేలు వచ్చాయి.
రాకేష్ ఝున్ ఝున్ వాలా లైఫ్ చూస్తే భయంకరమైన సక్సెస్ స్టోరీలా కనిపిస్తుంది. కానీ అనారోగ్యం చూస్తే ఫెయిల్యూర్ స్టోరీ. ఇది మనం చెప్పుకుంటుంది కాదు. ఆయన చెప్పిందే. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఒక అవార్డ్ ఫంక్షన్ కు పిలిచిన సమయంలో యువతకు మీ సలహా ఏంటని అడిగితే ఓ గొప్ప జీవిత పరమార్ధం కథ చెప్పారాయన. నాది సక్సెస్ స్టోరీ అని మీరనుకుంటున్నారు. కానీ ఫెయిల్యూర్ స్టోరీ అని నాకు తెలియడానికి 55 ఏళ్లు పట్టింది. అదే సక్సెస్ అయ్యానని తెలియడానికి నాకు పాతికేళ్లు సరిపోయింది. అప్పటికే అమితాభచ్చన్ రెమ్యునరేషన్ ఒక సినిమాకు ఎంత తీసుకుంటున్నారో, నేను అంత ఒక నెలలోనే సంపాదించాను. అప్పటికి నేను కింగ్. స్టాక్ పట్టుకుంటే బంగారం అయింది. నేను స్టాక్ కొంటానని చూపు వెళ్తే మార్కెట్ లో అలజడి ఉండేది. లైఫ్ ఈజ్ లైక్ రన్నింగ్ చీతా. కానీ ఇప్పుడు నేను ఆగిపోయాను. ఆగిపోయాను అనే కంటే జీవితం నుంచి పడిపోయాను అని చెప్పొచ్చు. ఎక్కడో ఒక చేపలు పట్టే వ్యక్తి హాయిగా చెరువు పక్కన సంతోషంగా నాలుగు చేపలు పట్టుకుంటాడు. ఆకలేస్తే అక్కడి నీరే తాగి భోజనం చేస్తాడు. సాయంత్రానికి నవ్వుతూ వెళ్లి కుటుంబంతో గడుపుతాడు. మనసులో ఆలోచనలు ఉండవు. అలజడి అసలే ఉండదు. మనసుకు అంత ప్రశాంతత నాకు జీవితంలో దొరకలేదు. ఇప్పుడు కనీసం పిల్లల జీవితాలను చూసే సమయం కూడా నాకు లేదనుకుంటున్నాను.
ప్రతి రోజు నేను స్టాక్ మార్కెట్ లో టెన్షన్ ను తట్టుకునేందుకు ప్రతి పావు గంటకు ఒక సిగరెట్ తాగాను. ప్రతి అరగంటకు ఒక పెగ్ తాగాను. మందులోకి ఏది తింటున్నానో, ఎంత తింటున్నానో తెలియదు. నాకు భోజనం అంటే చాలా ఇష్టం. నా మనసుకు భాగా నచ్చినవి మూడే. స్టాక్ మార్కెట్, ఫుడ్, మద్యం. కోట్ల రూపాయలు అలా వస్తుంటే ఇలా మజా వచ్చేది. పాతికేళ్లకే పాతిక వేల కోట్లు సంపాదించాను
మరిన్ని పూర్తి వివరాలు Rakesh Jhunjhunwala స్టోరీ తప్పకుండా ఈ వీడియొ చూడండి.
Read Our Another Aricle About Sri Devi