Ramesh Babu Family : రమేష్ బాబు భార్య – కొడుకుని చూసారా

783

ramesh babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట్లో విషాదం నెల‌కొంది. మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు మ్రుతి చెందారు. ఊపిరి తీసుకోవ‌డం లో ఆయ‌న‌కు ఇబ్బంది నెల‌కొన‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ఆయ‌న చ‌నిపోయారు. ఏఐజీ ఆసుప‌త్రికి త‌ర‌లించే లోపు ర‌మేష్ బాబు చ‌నిపోయారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న లివ‌ర్ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. దాదాపుగా ర‌మేష్ బాబు అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌నుకున్నారు. కానీ హ‌ఠాత్తుగా శ‌నివారం రాత్రి ఎనిమిది గంట‌ల ప్రాంతంలో ఊపిరి ఆడ‌టం లేద‌ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌డంతో వేగంగా హాస్పిట‌ల్ కు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. ఆయన వయస్సు కేవలం 56 ఏళ్లు. వ్యాపారంలో రాణించినా సినిమా ఏనాడు తన బిడ్డకు కలిసి రాలేదని క్రిష్ణ ఆవేదన చెందేవారు. క్రిష్ణ తన కెరీర్ లో పట్టుకుందల్లా బంగారమయ్యేది. కానీ రమేష్ బాబు ఎంత కష్టపడ్డా విజయం దక్కలేదు. చివరకు హిందీలో సూర్యవంశ్ తో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. తాను నిర్మాతగా తెలుగులో ఆ రేంజ్ సక్సెస్ రాలేదని క్రిష్ణ చెప్పుకుని బాధపడేవారు. అయినా ఇతర వ్యాపారాల్లో రాణించి హాయిగానే బతుకుతున్నారు. తన కుటుంబాన్ని ఏనాడు ా ఆయన మీడియా ముందుకు రానివ్వలేదు. తన లైఫ్ ని చాలా ప్రైవేట్ గా ఉంచేవారు రమేష్ బాబు.

మ‌హేష్ బాబు ఫ్యామిలీ గ‌త ప‌ది హేను రోజుల నుంచి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. కాలికి గాయం కావ‌డంతో మ‌హేష్ బాబు స‌ర్జ‌రీ చేయించుకున్నారు. ఇంత‌లో ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో క్వారంటైన్ లో ఉన్నారు. మ‌హేష్ బాబుకు పాజిటివ్ రావ‌డంతో కుటుంబ‌మంతా క్వారంటైన్ లోనే ఉంది. మ‌రోవైపు మ‌హేష్ బాబు సోద‌రికి కూడా పాజిటివ్ రావ‌డంతో అంతా కంగారు ప‌డ్డారు. కానీ ఆమె బ‌య‌ట‌ప‌డ్డారు. ఇంత‌లో మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు మ‌ర‌ణం సూప‌ర్ స్టార్ అభిమానుల‌ను, సినిమా ఫ్యాన్స్ ని ఆవేద‌న‌కు గురిచేస్తోంది.

ర‌మేష్ బాబు దాదాపు 15 సినిమాల్లో న‌టించారు. ప‌ది సినిమాల్లో హీరోగా న‌టించారు. పెద్ద కుమారుడు ర‌మేష్ బాబును స్టార్ ను చేయాల‌నుకున్నారు క్రిష్ణ‌. త‌న‌కున్న మాస్ ఫాలోయింగ్ తో సుల‌భంగా హీరో గా నిల‌బడ‌తాడ‌నుకున్నాడు. కానీ ర‌మేష్ బాబు వ‌రుస ప్లాపుల‌తో తానే స్వ‌యంగా సినిమాల నుంచి త‌ప్పుకున్నారు. 1994 నుంచి ఆయ‌న సినిమాల్లో క‌నిపించ‌లేదు.

 

క్రిష్ణ న‌ట‌వారసుడిగా భారీ అంచ‌నాల మ‌ధ్య ర‌మేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు ర‌మేష్ బాబు. మాస్ , సెంటిమెంట్ సినిమాల‌తో ప్ర‌యోగాలు చేశారు. చివ‌ర‌కు కొడుకును హీరోగా నిల‌బెట్టేందుకు తన స్టార్డ్ డ‌మ్ ని ప‌క్క‌న పెట్టి మ‌రీ క్రిష్ణ ఆ రోజుల్లో ర‌మేష్ బాబు కోసం న‌టించారు. ముగ్గురు కొడుకులు, బ‌జార్ రౌడీ, క్రిష్ణ గార‌బ్బాయి, క‌లియుగ క‌ర్ణుడు, క‌లియుగ అభిమ‌న్యుడు, కొడుకు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో న‌టించారు. క్రిష్న తో క‌లిసి న‌టించిన మూవీస్ హిట్ అయ్యాయి. కానీ సొంతంగా సోలో హీరోగా సక్సెస్ కాలేకపోయారు. అయినా తన జీవితాన్ని హూందాగా గడిపారు. వివాదాలకు దూరంగా, చెడ్డ పేరు రాకుండా అద్భుతమైన లైఫ్ ని లీడ్ చేసినా అకాల మరణం మహేష్ బాబు కుటుంబాన్ని, ఫ్యాన్స్ ని కుంగదీసింది.

Previous articleNadhiya : అప్పట్లో పవన్ కళ్యాణ్ అత్త ఆ హీరోని పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం… కానీ చివరికి…
Next articleRamesh Babu : ఇక నేను సినిమాలు చేయను అనే కఠిన నిర్ణయం వెనుక ఇంత ఉందా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here