Rebal Star Acting Story:
క్రిష్ణంరాజుకు ఇండస్ట్రీలో ఒక పేరుంది. ఆయనతో పనిచేసినవారికి మాత్రమే తెలుసు. కానీ అది పెద్ద విషయం కాదని చాలా సింపుల్ గా వదిలేసి ఉంటారు. అదే కన్నీళ్లు. ఏదైనా ఎమోషనల్ సీన్ చేయాలంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ గ్లిజరిన్ ను కళ్లల్లో డ్రాప్స్ వేస్తారు. ఆ తర్వాత ఆ ఎమోషన్ ను చూపించడానికి కళ్లలోని వాటర్ డ్రాప్స్ తో సీన్ కు మరింత అందం వస్తుంది. ఆడియెన్స్ ను డైలాగ్స్ తో పాటు కళ్లతో కట్టిపడేస్తారు. ఇక హీరోయిన్స్ ఎక్కువ ఏడవాలి కాబట్టి…వారికి కళ్లళ్లో కాస్త ఎక్కువ డ్రాప్సే వేసేవారు. కానీ క్రిష్ణంరాజు కు గ్లిజరిన్ వేసేవారు కాదు. ఎందుకంటే కన్నీళ్లు కావాలంటే ఆయన ఆటోమేటిక్ గా ఎమోషనలై సీన్ ను ఊహించుకుని మరి ఆయన అప్పటికప్పుడు కన్నీళ్లు తెచ్చుకునేవారట.
మనిషి ఎంత గంభీరంగా ఉంటారో ఆయన అంత సెన్సిటివ్. ఎమోషనల్ సీన్ చేయాలంటే ముందే డైలాగ్ ను ఒకటికి పది సార్లు ఆ భాధను ఫీలై షాట్ కు వెళ్లేవారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆయనకు కన్నీళ్లు వచ్చేవట. దాంతో డైరెక్టర్లు కూడా షాక్ అయ్యేవారు. కానీ క్లోజప్ లు పెట్టినప్పుడు కన్నీళ్లు మరిన్ని కావాలంటే ఆయన కళ్లను పిండి మరీ కన్నీళ్లను చూపించేవారట. ఈ తరహా నటనను ఆయన పాతకాలంలో సావిత్రిని చూసి నేర్చుకున్నారట. కేరక్టర్ లోకి వెళ్లిపోయి మరీ ఆయన తన కన్నీళ్లను చూపించేవారు. మరోవైపు ఆయన కళ్లు చాలా చిన్నవిగా ఉండేవి. ఎప్పుడు ఎర్రగానే ఉండేవి. దీంతో ఆయన కళ్లల్లో ఎమోషన్ ను చూపించలేమేమోనని భయపడేవారట దర్శకులు. కానీ ఆయన తన ముఖకవలికలతో కళ్లు కదిలించి కన్నీళ్లను చూపించేవారట. అలా నూటికి 90శాతం గ్లిజరిన్ లేకుండా సినిమాల్లో సహజంగా ఏడ్చిన ఏకైక నటుడు క్రిష్ణంరాజు మాత్రమే.
తన సీన్ తాను చూసుకుని కూడా ఏడ్చేస్తారు క్రిష్ణంరాజు. సౌందర్య లహరిలో బొబ్బిలి బ్రహ్మన్నలోని కూతురు సెంటిమెంట్ చూసి రాఘవేంద్రరావు ముందే ఆయన మరోసారి కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. ఆటోమేటిక్ గా ఆయనకు కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి. కేరక్టర్ లోకి అంత సహజంగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టే రెబల్ స్టార్ అయ్యారు క్రిష్ణంరాజు.
Read our Another Article Ram Gangadhar Rathnamani