Saba azad : ఆ సీనియర్ హీరోని ప్రేమిస్తోందని ఈ యంగ్ బ్యూటీ ని వాటికి దూరం పెట్టారట….

682

Saba azad : బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా “Saba azad” అనే యంగ్ హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది. అయితే నటి సబా ఆజాద్ పెద్ద పేరున్న సెలబ్రిటీ కాకపోయినప్పటికీ తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇప్పటికే సబా ఆజాద్ పలు బాలీవుడ్ చిత్రాలలో హీరోగా నటించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందుతున్న ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తో ప్రేమలో పడిందని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు ఈ రూమర్ల కారణంగా బాగానే ఫేమస్ అవుతోంది. అలాగే కెరియర్ పరంగా కొంతమేర చిక్కులు కూడా ఎదుర్కుంటోంది.

రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ :

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో నిఖిల్ అద్వాని తెరకెక్కించిన రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. దీంతో ఈ వెబ్ సిరీస్ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ షురూ చేశారు. కానీ ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా Saba azad మాత్రం కనిపించడం లేదు. దీంతో సబా ఆజాద్ కి ఏమైందని కొందరు ఆమె అభిమానులు సోషల్ మీడియాలో తెగ గోల చేస్తున్నారు. కాగా తాజాగా ఈ వెబ్ సిరీస్ చిత్రయూనిట్ సభ్యులు ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా సబా ఆజాద్ ఎందుకు ప్రమోషన్లలో పాల్గొనడం లేదనే విషయం పై వివరణ ఇచ్చారు.

Saba azad
Saba azad

Saba azad ప్రమోషన్స్ కి దూరం :

ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా సబా ఆజాద్ ఎక్కడ కనిపించినా ఆమెకి బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తో ఉన్నటువంటి రిలేషన్ షిప్ గురించి మాత్రమే ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నారని పేర్కొన్నారు. అందువల్లనే కొన్ని రోజుల పాటు Saba azad ని చిత్ర ప్రమోషన్స్ కి దూరంగా ఉంచినట్లు తెలిపారు. అలాగే ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ ఎక్కువైందని శాంతో సినీ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా వారి వ్యక్తిగత ప్రశ్నలను అడిగి ఇబ్బంది పెడుతున్నారని ఈ కారణంగానే సినీ సెలబ్రిటీలు ప్రెస్ మీట్ లో పాల్గొనాలంటే కొంతమేర జంకుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ విడుదల మరియు నటీనటుల వివరాలు :

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అయినా సోనీ లివ్ లో ఈ నెల నాలుగో తారీఖు నుంచి ప్రసారం కానుంది. కాగా ఈ వెబ్ సిరీస్ లో సభా ఆజాద్ తో పాటు రెజీనా కాసాండ్రా, ఇష్వక్ సింగ్, జిమ్ సర్భ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఇక హృతిక్ రోషన్ విషయానికొస్తే ప్రస్తుతం హిందీలో ప్రముఖ దర్శకుడు పుష్కర గాయత్రీ దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ వేద చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు అలాగే వార్ 2 చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

 

If you like our article Saba azad

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

 

Previous articleRajasekhar : ఆ స్టార్ హీరో కి తన భార్య వల్లే ఆ అవకాశం పోయిందంటూ ప్రచారం… కానీ…
Next articlelizard man ఈ కుర్రాడికి బల్లులే జీవితం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here