Russia vs Ukraine – సంకనాకించిన బైడెన్ – 24 గంటల్లో ఏం జరగబోతుంది ?

560
Russia vs Ukraine
Russia vs Ukraine

Russia vs Ukraine సంకనాకించిన బైడెన్ – 24 గంటల్లో ఏం జరగబోతుంది ?

Russia vs Ukraine : అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మరోసారి రుజువైంది. మరీ బైడెన్ అధ్యక్షుడైనా రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి గజ గజ వణుకుతున్నారు. ఆయన స్తానంలో ట్రంప్ ఉండి ఉంటే…ఏదో ఒక నిర్ణయం బలంగా తీసుకుని ఉండేవారు. కానీ బైడెన్ మాత్రం సొల్లు కబుర్లు చెప్పారు. మమ్మల్ని నాటోలోకి తీసుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్క్ కాళ్లు అరిగేలా తిరిగాడు. రష్యా అడ్డుకోవడంతో ఏమీ తేల్చలేదు. ఇక యుద్దానికి ముందు తుపాకీ రాముడిలా అంతు చూస్తామన్నారు. ఆ తర్వాత మేము డైరెక్ట్ గా యుద్దంలోకి దిగమని బైడెన్ చేతగాని మాటలు మాట్లాడాడు. ఇంకేముంది. మా జోలికి రావద్దు. మా యుద్దంలో వేలు పెడితే జాగ్రత్త అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు మూడు వైపులా యుద్దం మొదలు పెట్టారు. ఒక వైపు సరిహద్దుల్లోని రెండు ప్రాంతాలకు ఇప్పటికే ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి గుర్తిస్తున్నామని ప్రకటించారు. వాయు మార్గం నుంచి బాంబుల మోత మోగిస్తున్నారు. జలమార్గం మొత్తం దిగ్బంధం చేశారు. దీనికి కారణం అమెరికాతో పాటు యూరప్ దేశాలు.

అమెరికా మొదటి నుంచి ఆంక్షలు విధిస్తోంది. కానీ రష్యా వాటికి భయపడేది కాదు. నాటోతో యుద్దానికి వస్తామని చెప్పినా లెక్క చేయలేదు. ఎందుకంటే యూరప్ దేశాలు పిరికివంటారు నిపుణులు. ఉక్రెయిన్ ను నిండా ముంచింది యూరప్, అమెరికా, బ్రిటన్ దేశాలే. ఎందుకంటే రష్యా నుంచి విడిపోయినప్పుడు వేల కొద్ది అణ్యాయుధాలు, జెట్ విమానాలు వారసత్వంగా వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైనికులు ఉండేవారు. కానీ శాంతి వచనాల పేరుతో యూరప్ మొత్తం ప్రశాంతంగా ఉండాలని బలవంతంగా ఉక్రెయిన్ ను అణ్వాయుధాలను వదులుకునేలా చేశారు. ఇక విచ్చలవిడి అవినీతి. దాంతో యూరప్ లోనే అతి పెద్ద దేశం. రష్యా తర్వాత అత్యధిక సారవంతమైన నేలలున్న దేశం ఉక్రెయిన్. సముద్ర మార్గంతో పాటు వ్యాపారానికి చుట్టూ యూరప్ దేశాలు. అద్భుతమైన దేశాన్ని నాయకులే నాశనం చేసుకున్నారు. ఇక పుతిన్ వచ్చిన తర్వాత తనవాళ్లనే అధ్యక్షులను చేసి ఆడించారు.

ఇప్పుడు రష్యా కోరుకునేది ఏమిటి? సింపుల్ మాకు ఉక్రెయిన్ కావాలి. మీరుగానే బతకండి కానీ రష్యా లో భాగంగా ఉండమని చెబుతున్నాడు. మీరు మా కిందే ఉన్నారు. పాశ్యాత్య దేశాలు రష్యానుఎదుర్కోలేక ఉక్రెయిన్ ను స్రుష్టించారు. మనం మనం ఒకటి. అలా కాదని నాయకులు విర్రవీగితే భీకర యుద్దానికి దిగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము చూపించేది శాంపిలే అన్నాడు. వ్యూహాత్మకంగా నగరాలు, కీలక పట్టణాలను భయపెట్టేలా చిన్న బాంబులు వేస్తున్నారు పుతిన్. ఎందుకంటే రేపు యుద్దం ముగిసినా, లొంగిపోయినా పునర్మిణాం ఇబ్బందిగా మారుతుంది. అందుకే లొంగిపొమ్మని స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. వందల మంది సరిహద్దు గ్రామ ప్రజలు చనిపోయారు. సిటీల్లోనూ బాంబుల దాడికి కీలకమైన పవర్ ప్రాజెక్ట్ లు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సైనికులు 50 మంది చనిపోయారని సమాచారం. యుద్దం కోరల్లోకి ఉక్రెయిన్ జారిపోయింది. ప్రపంచం వైపు బేలగా ఆదేశ ప్రజలు కాపాడమని చెబుతున్నారు.

ఇప్పటికే జనం ఉక్రెయిన్ రాజధాని కీవ్, మరో బిగ్ సిటీ ల్వీవ్ లో శాంపిల్ బాంబులను వేసింది. జనం వేరే నగరాలకు పారిపోతున్నారు. బెలారస్ సరిహద్దు నుంచి భారీగా యుద్ద ట్యాంక్ లు, సైనికులు వేలాదిగా చేరుకున్నారు. వారికి తోడుగా ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఉన్న రెబల్స్ తోడయ్యారు. ఉక్రెయిన్ సైనికులకు అనుభవం లేదు. ఆయుధాలు అంతకన్నా లేవు. లొంగిపోవడానికి పుతిన్ ఇప్పుడు సమయం ఇచ్చాడు. అంతే కాదు నాటో తో కలిసి యూరప్ దేశాలు ఉక్రెయిన్ ను కాపాడుతాయని బైడెన్ చెబుతున్నా అంత సినిమా లేదంటున్నారు. కేవలం ఆంక్షలు విధించారు. వాటి వల్ల రష్యాకు పెద్దగా పోయేదేమి లేదు. రష్యా ఆయిల్ మీద యూరప్ మొత్తం ఆధారపడింది. పైగా రష్యా డాలర్ ను కరెన్సీగా వాడటం వదిలేసి చాన్నాళ్లైంది. చైనా కరెన్సీతోనే అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నారు. బ్యాంక్ ల మీద ఆంక్షలు పట్టించుకోడు పుతిన్. కాబట్టి ఉక్రెయిన్ నిండా మునిగింది. జనాలు కుప్పలుగా చావకముందే లొంగిపోతే జనమైనా బతుకుతారు. కానీ పోరాడుతామంటే మాత్రం రష్యా శక్తి ముందు ఉక్రెయిన్ చిట్టెలుక. నలిపేస్తుంది. బైడెన్ ఇప్పటికే చేతులెత్తేసి భార్యతో కలిసి ఉక్రెయిన్ కోసం చర్చిలో ప్రార్ధనలు చేస్తానన్నాడు. సూపర్ పవర్ దేశానికి అధ్యక్షుడు చెప్పాల్సిన మాటలు కావివి. అణ్వాయుధాలు ఉండి ఉంటే రష్యా ఖచ్చితంగా భయపడేది. అవినీతి నాయకులుంటే దేశం ఎలా నాశనం అవుతుందనడానికి ఉదాహరణ ఉక్రెయిన్. ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా అమెరికా వైపు చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు మాత్రం చర్చిలోని జీసస్ వైపు కళ్లు మూసుకున్నాడు. మరి వచ్చే మూడు రోజుల్లో ఏదో ఒకటి తేలిపోవడం ఖాయం. ఎందుకంటే నిత్యావసర సరుకులు లేక జనం విలవిలలాడుతారు. అన్ని వైపులా ఉక్రెయిన్ ను దిగ్భంధించింది రష్యా. ప్రపంచమే ఆదుకోవాలి. యూఎన్ పనికిమాలిని పాకిస్తాన్ విషయంలో భారత్ కు సొల్లు కబుర్లు చెబుతుంది. కానీ మూడో ప్రపంచ యుద్దం జరిగే భయం ఉందని నిపుణులు చెబుతున్నా…గోళ్లు గిల్లుకుంటోంది. మొత్తం మీద అమెరికా తన స్వార్దం తప్పితే ఎవరి గురించి పట్టించుకోదని తేలిపోయింది. అమెరికా ఇలానే ఉంటే మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్ కనుమరుగైపోతుంది. రష్యాలో అంతర్భాగమై పుతిన్ కాలికందకు చేరుతుంది. అదే జరిగితే యూరప్ కు వ్యాపారం విచ్చలవిడిగా చేస్తాడు. ఆర్ధికంగానూ రష్యా బలపడుతుంది. ఇదే పుతిన్ కు కావాలి. ఆ తర్వాత మరో మాజీ సోవియట్ దేశం మీద పడతాడు పుతిన్.

Please Follow : srimedianews.com with bell icon below

Previous articleVijayashanti అందుకే పిల్లల్ని కనలేదా..?
Next articleమెగాస్టార్ చిరంజీవి పెళ్ళికి రాకపోతే ఆ నటి కొడుకు తాళి కట్టనని అన్నాడు… దాంతో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here