Russia vs Ukraine : దాడికి మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా

139
Russia vs Ukraine
Russia vs Ukraine

ఉక్రెయిన్ పై దాడికి మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా

Russia vs Ukraine : రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్ మీద దాడి చేయొచ్చు. మూడు వైపుల నుంచి ముప్పేట దాడి చేసి ఆక్రమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్లాన్ వేశారు. అమెరికా ఒత్తిడితో, నాటో బెదిరింపులతో కాస్త మెత్తబడ్డారు పుతిన్. కేవలం కొన్ని డిమాండ్ లు పెట్టి వెనక్కి జరగాలని చూస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఉక్రెయిన్ ను రష్యాలో కలుపుకోవడం మాత్రం నిజమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు ఉక్రెయిన్ మీద పుతిన్ కు ఎందుకంత కసి. దాని వెనుకున్న చరిత్ర ఏంటి? అసలు ఉక్రెయిన్ నుంచి పుతిన్ ఏం కోరుకుంటున్నాడో ఈ స్టోరీలో చూద్దాం.

ఉక్రెయిన్ దేశం మొదటి నుంచి సోవియెట్ యూనియన్ లో ఉంది. ఈ విషయం మనకు తెలుసు. కానీ ఆ దేశం మొదటి నుంచి కమ్యూనిస్టుల పాలనను వ్యతిరేకించేది. అలా అని ఉక్రెయిన్ దేశస్తులంతా కాదు. ఎందుకంటే రష్యా సరిహద్దు ప్రాంతంలోని చాలా నగరాల్లో రష్యన్ లు ఉన్నారు. వారి భాష నుంచి సంస్క్రుతి వరకు రష్యానే. వారు మాత్రం తాము రష్యాతో నే ఉంటామని చెప్పేవారు. వారి శాతం చాలా తక్కువే కావడంతో క్రిమియా సహా చాలా ప్రాంతాల్లోని రష్యన్ ల మాటను ఉక్రెయిన్ వాసులు లెక్కపెట్టలేదు. తమ స్వేఛ్చకు అడ్డొస్తే వెళ్లిపొమ్మని చెప్పారు. కొన్ని సార్లు రష్యన్ లమీద దాడులు కూడా జరిగాయి. దీంతో ఉక్రెయిన్ లోని రష్యన్ లు కామ్ అయ్యారు. కానీ వాణిజ్య పరంగా వ్యూహాత్మకమైన క్రిమియాను స్వాధీనం చేసుకున్నాడు పుతిన్. అక్కడ 70 శాతానికి పైగా రష్యన్ లే ఉండటంతో సులభంగా ఎలాంటి ఎదురుదాడి లేకుండా సింపుల్ గా క్రిమియాను లాక్కున్నాడు. కానీ ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు.

"<yoastmark

మొదటి నుంచి తమకు ఈ సోవియట్ యూనియన్ వద్దు. చాందసవాద కమ్యూనిస్టుల పాలన అసలే వద్దని ఉక్రెయిన్ మొదటి నుంచి పోరాడుతుంది. కానీ సోవియట్ యూనియన్ లో ఉన్నప్పుడు ఆ దేశం నుంచి విడిపోవాలని పోరాటం చేసే దమ్ము లీడర్లకు లేదు. దీంతో పోలండ్ కు వెళ్లి అక్కడి నుంచి పోరాటం చేసేవారు. చివరకు ప్రజలంతా తాము రష్యా యూనియన్ నుంచి వచ్చి స్వంతంత్ర దేశంగా బతుకుతామని ధర్నాలు, ఆందోళనలు చేశారు. వారిని మొదట రష్యా ప్రభుత్వం అణచి వేసింది. కానీ సోవియట్ యూనియన్ లోని చాలా దేశాలు స్వంతంత్రాన్ని కోరుకుంటున్నాయని తేలడంతో అతిగా భయపెడితే నష్టం వస్తుందని అనుకున్నారు నాటి రష్యా అధ్యక్షుడు. ఈ లోపు తమకు తాముగా విడిపోయామని ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. గతంలో కూడా ఒక సారి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నా రష్యా తన బలంతో అణచివేసింది. నాయకులను దారుణంగా విషం తన వేగులతో చంపించింది. దీంతో నాయకులు ఉక్రెయిన్ కోసం పోరాడాలన్నా బయటి దేశాల్లో తలదాచుకుని ఉద్యమాలు చేసేవారు. అయినా చాలా దేశాలు స్వేఛ్చను కోరుకోవడంతో పాటు నాటి రష్యా పాలకుల తప్పిదాల వల్ల యూనియన్ ముక్కలైంది. అదే పుతిన్ కు నచ్చడం లేదు. సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడం వల్ల ఆర్దికంగా, ప్రపంచ ప్రాభల్య పరంగా వీక్ అయ్యామని ఆయన భావన. అందుకే కీలకమైన దేశాలను మళ్లీ ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సోవియట్ యూనియన్ ను తాను బతికి ఉండగానే బలోపేతం చేయాలనుకుంటున్నారు. లేదంటే యూనియన్ నుంచి విడిపోయిన దేశాలు స్వతంత్రంగా ఉన్నా పర్వాలేదు. కానీ రష్యా చెప్పినట్లు నడుచుకోవాలనేది ఆయన ప్లాన్. ఉక్రెయిన్ మాత్రం ససేమిరా అంటోంది.

Russia vs Ukraine : ఉక్రెయిన్ సరిహద్దులను గౌరవిస్తామని రష్యా ప్రామిస్

1994 లో బుడాపెస్ట్ లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ సరిహద్దులను గౌరవిస్తామని రష్యా ప్రామిస్ చేసింది. సాక్షిగా అమెరికా, యూకే ఉన్నాయి. అవి కూడా సంతకాలు చేశాయి. ఆ తర్వాత వెంటనే నాటో లో చేరాలని ఉక్రెయిన్ నాటి అధ్యక్షుడు లియోనాడ్ కుచ్ మా తహతహలాడాడు. కానీ ఎందుకో ఆలస్యమైంది. భవిష్యత్ పరిణామాలను నాటి అమెరికా, యూకే, యూరప్ దేశాలతో పాటు ఉక్రెయిన్ కూడా ఊహించలేదు. పైగా ఈ 1994 లోని ఉక్రెయిన్ అధ్యక్షుడు లియోనాడ్ స్వేఛ్చా వాణిజ్యానికి తెరలేపాడు. ఆయన నిర్ణయాల వల్ల కేవలం పెట్టుబడి దారులు మాత్రమే లాభపడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇంకా పేదరికంలోకి జారిపోయారు. అంతే కాదు అధ్యక్షుడికి వ్యతిరేకంగా, ఆయన నిర్ణయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆదేశ ఒక ఫేమస్ జర్నలిస్ట్ ప్రతి రోజు పేపర్లలో కథనాలు రాసేవాడు. వాటికి ప్రజల్లో మంచి డిమాండ్ఉండేది. ఆధారాలతో సహా ఆర్ధిక వ్యవస్తను వివరిస్తూ జర్నలిస్ట్ ప్రసిడెంట్ ను ఏకిపారేశాడు. ఇదే టైమ్ లో తన అనుచురలతో మాట్లాడుతూ సదరు జర్నలిస్ట్ ను చంపేయమని అధ్యక్షుడు ఆదేశించాడు. కాకపోతే సదరు జర్నలిస్ట్ హత్యకు ముందే ఆయన హత్యకు ఆదేశించిన మాటలు లీక్ అయ్యాయి. మీడియాలో ఆ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చేశారు. దీంతో లియోనాడ్ రాజీనామా చేశాడు. కానీ వెళ్తూ వెళ్తూ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన శిష్యుడు విక్టర్ యాన్కోవిచ్ ను అధ్యక్షుడిని చేశాడు.

ఈ విక్టర్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహితుడు. ఆయన చెప్పినట్లే చేస్తాడు. దీంతో విక్టర్ అధ్యక్షుడయ్యాక దేశం పై పెత్తనం పెరిగింది. మొత్తం పాలన పుతిన్ అడుగు జాడల్లో నడిచేది. చివరకు నాటోల జాయిన్ కావాలని ఇతర దేశాలు కోరినా తమకు అక్కర్లేదని విక్టర్ చెప్పాడు. దాంతో ప్రతిపక్ష నాయకుడు యశ్చంకో దుమ్మెత్తిపోశాడు. ఉక్రెయిన్ స్వతంత్రదేశమైనా మొత్తం పుతిన్ చెప్పినట్లు నడుస్తుందని ఆందోళనలు చేశాడు. అధ్యక్షుడు విక్టర్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏకిపారేశాడు. తదుపరి ఎన్నికల్లో అధ్యక్షుడు విక్టర్ కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యా షాడో లా ఉక్రెయిన్ అధ్యక్షుడు పనిచేస్తున్నాడని ఆదేశ ప్రజలంతా నమ్మారు. దీంతో ఎన్నికల్లో సాయం చేయాలని విక్టర్ తన స్నేహితుడు పుతిన్ ను కోరాడు. ఇంకేముంది రష్యా వేగులు ఉక్రెయిన్ లోకి దిగారు. రష్యా గూఢాచారులు దారునంగా ఉంటారు. ఒక రోజున ఉక్రెయిన్ ప్రతిపక్ష నాయకుడు యశ్చంకో భారీ సమావేశం తర్వాత హోటల్ విశ్రాంతి తీసుకున్నాడు. అదే హోటల్ లో పదుల సంఖ్యలో దిగిన రష్యా స్పైలు ప్రతిపక్ష నాయకుడి గదిలోకి వెళ్లిన భోజనంలో విషం కలిపారు. ఆ తర్వాత మెరుపు వేగంతో వెళ్లిపోయారు. కానీ వాంతులు చేసుకుని, చావు అంచుల్లోకి వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు యశ్చంకో. అంతే కాదు విష ప్రయోగం జరిగిందని తేలింది. రష్యా గూడాచారులే ఈ పని చేశారని పోలీసులు తేల్చారు. రిగ్గింగ్ చేసినా యశ్చెంకో సులభంగా అధ్యక్షుడయ్యారు.

ఇక 2008 లో ఉక్రియెన్ అధ్యక్షుడు నాటోలో చేరుతామని అమెరికా అధ్యక్షుడు బుష్ ను కోరాడు. ఆయన కూడా తొందరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఇతర సన్నిహిత నాటో దేశాలను కోరాడు. నాటో లేకుంటే రష్యా ఏ క్షణమైనా దాడి చేసి ఆక్రమించుకుంటుందని బుష్ నాడే ఊహించారు. పుతిన్ ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతే కాదు తమను అవమానిస్తున్నారని. తామెందుకు దాడి చేస్తామని చెప్పాడు. ఆ రోజుల్లో తన గ్యాస్ , పెట్రోల్ అవసరాల కోసం జర్మీనీ సైతం పుతిన్ కు మద్దతు పలికింది. ఫ్రాన్స్ కూడా రష్యా తమకు హామీ ఇచ్చిందని నమ్మి నాటో లో ఇప్పుడు ఉక్రెయిన్ చేరాల్సిన అవసరం లేదని చారిత్రక తప్పిదం చేశాయి. అలా పుతిన్ ఆ దేశాలను తెలివిగా బోల్తా కొట్టించారు. బుష్ మాత్రం ఆనాడే పుతిన్ ప్లాన్ ను ఊహించారు. ఆయన మాటలే నేడు నిజమవుతున్నాయి.

2010 లో మళ్లీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పుతిన్ స్నేహితుడు విక్టర్ యాన్కోవిచ్ బాధ్యతలు చేపట్టాడు. మొత్తం పుతిన్ చేతిలోకి దేశం వచ్చింది. ఆ సమయంలోనే నాటోలో చేరమని ప్రకటించాడు. నాటి ప్రధాని , అధ్యక్షులపై అవినీతి ఆరోపణలు చేసి జైల్లో వేయించాడు. ప్రతిపక్షాన్ని వీక్ చేశాడు విక్టర్. మరోసారి 2013 లో నాటోలో ఉక్రెయిన్ చేరేందుకు మొత్తం సిద్దమైంది. అమెరికా అన్ని ఏర్పాట్లు చేసింది. మీ భవిష్యత్ దారుణంగా ఉండబోతోంది. రష్యా ఆక్రమించుకునే ఛాన్స్ ఉంది. పుతిన్ ఉన్నన్నాళ్లు మీకు భద్రత ఉండదు. మీకు మిలటరీ సపోర్ట్ కావాలంటే నాటోలో చేరాలని బరాక్ ఒబాబా చిలకుకు చెప్పినట్లు చెప్పారు. అందుకు యూరప్ దేశాలు అమెరికా చెప్పినట్లుగానే సర్వం సిద్దం చేశాయి. ఇక మరుసటి రోజు నాటోలో చేరేందుకు సంతకాలు పెట్టడానికి సిద్దమైన క్షణంలో విక్టర్ వ్యూహం మార్చాడు. పుతిన్ చెప్పినట్లే సంతకం చేసేందుకు నిరాకరించాడు. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ఒప్పుకోలేదని వార్త రాగానే దేశంలో హింస చెలరేగింది. అధ్యక్షుడి అనుకూల, ప్రతికూల వర్గాలు వీధుల్లోకి వచ్చి కొట్టుకున్నాయి. ఈ హింసలో వందల మంది చనిపోయారు. 2014 ఫిబ్రవరి 22న అధ్యక్షుడు విక్టర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాణం పెట్టాయి. అయితే రష్యా ఇంటెలీజెన్స్ ముందే విక్టర్ ను అలెర్ట్ చేవాయి. ఎలాగైనా ఓడిపోతారు. అక్కడుంటే ప్రాణాలకు ప్రమాదమని చెప్పడంతో అధ్యక్షుడు విక్టర్ యాన్కోవిచ్ దేశం నుంచి పారిపోయి రష్యాలో తలదాచుకున్నాడు. దాంతో వివాదం ముగిసింది.

ఎప్పుడైతే అమెరికా, యూరప్ ల మద్దతుతో పెట్రో పోరషంకో అధ్యక్షుడయ్యాడో పుతిన్ వేగంగా పావులు కదిపి క్రిమియాను ఆక్రమించుకున్నాడు. యూరప్ తో వ్యాపారానికి క్రిమియా వ్యూహాత్మక ప్రాంతం. ఆ తర్వాత డాన్ బాసో ప్రాంతంలో 40వేల మంది సైనికులను మోహరించాడు పుతిన్. ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలనుకున్నారు. అయితే ఉక్రెయిన్ సైన్యం వ్యూహాత్మకంగా రష్యా దాడులను అడ్డుకుంది. ఆ దేశం సైతం ఇతర దేశాల మద్దతుతో పుతిన్ ను నిలువరించింది. కానీ పుతిన్ రష్యా తో కలవాలనే అనుకూలమైన వారికి శిక్షణతో పాటు డబ్బులు, ఆయుధాలిచ్చి ఒక గ్రూపును ఆ దేశానికి వ్యతిరేకంగా ఎగదోశాడు. వారంతా ప్రతి రోజు ఉక్రెయిన్ సైన్యంతో సరిహద్దుల్లో పోరాడుతుంటారు. ఈ పదేళ్లలో వారి కారణంగా 14వేల మంది చనిపోయారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో సైతం దూకుడుగా వ్యవహరించాడు. రష్యా నుంచి కరెంట్ కానీ, పెట్రోల్, గ్యాస్ లపై అతిగా ఆధారపడొద్దని నిర్ణయం తీసుకున్నాడు. మెల్లిగా వ్యాపారం తగ్గిస్తూ వచ్చాడు. ట్రంప్ సహకారంతో రష్యా ను దూరం పెడుతూ వచ్చాడు. ఉక్రెయిన్ నిర్ణయాలతో రగిలిపోయిన పుతిన్ ఏకంగా సైబర్ దాడులు మొదలు పెట్టాడు. బ్యాంక్ సర్వర్ లను హ్యాక్ చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. పవర్ గ్రిడ్ మీద దాడి చేసి కరెంట్ కు అంతరాయం కలిగించారు. అయినా ఉక్రెయిన్ భయపడలేదు. కొత్త అధ్యక్షుడు సినిమా నటుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు.

బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక ప్రతి రోజు నాటోలో చేరేందుకు తహతహలాడాడు. మమ్మల్ని కాపాడండి. రష్యా దాడి చేసి ఆక్రమించుకుంటుందని బైడెన్ సాయం కోరాడు. అమెరికా రంగంలోకి దిగే లోపే పుతిన్ మూడు వైపుల లక్ష మంది సైన్యాన్ని మోహరించాడు. రాకెట్ లను అడ్డుకునే ఎస్ 400లను రంగంలోకి దించాడు. ఏ క్షణమైనా యుద్దం జరుగొచ్చని అమెరికా సైతం ఊహించింది. ఉక్రెయిన్ మీద దాడి చేయొద్దని రష్యాను అమెరికా హెచ్చరించింది. నాటో మద్దతుగా ఉక్రెయిన్ ను కాపాడుతుందని తేల్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం నాటో ఆఫీస్ కు చేరుకుని సాయం చేయాలని కోరారు. అయినా పుతిన్ దూకుడు తగ్గించకపోవడంతో ఆయుధాలను సప్లై చేసింది అమెరికా. పుతిన్ ఏ క్షణమైనా యుద్దం చేస్తాడని సీఐఏ స్పష్టమైన ఆధారాలను సంపాదించింది. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. అయినా పుతిన్ తగ్గలేదు. ఆ తర్వాత యూకే, ఫ్రాన్స్ లు రష్యాను హెచ్చరించాయి. మరోవైపు మెతక వైకరితో ఉన్న జర్మనీ సైతం పుతిన్ ను దూకుడు తగ్గించాలని కోరింది.

చివరకు చర్చల దారికి వచ్చిన పుతిన్ కొన్ని డిమాండ్ లు పెట్టారు. ఉక్రెయిన్ సహా సోవియట్ యూనియన్ లోని దేశాలను నాటోలో చేర్చుకోవద్దు. అది మా భద్రతకు ప్రమాదం. మా సరిహద్దుల్లో నాటో దళాలు ఉండకూడదని పుతిన్ షరతు విధించారు. అంతే కాదు వేలాది మంది సైనికులను బేస్ కు రప్పించారు. అంటే ప్రస్తుతానికి యుద్దం లేదని పుతిన్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. కానీ అమెరికా సహా అన్ని దేశాలు వెనక్కి తగ్గిన తర్వాత వ్యూహాత్మకంగా మెరుపు దాడి చేస్తాడని అనుమానిస్తున్నారు. రష్యా తలుచుకుంటే మూడు రోజుల్లో ఉక్రెయిన్ ను ఆక్రమించుకుంటుందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ నాటో రంగంలో ఉంటే మాత్రం రష్యా కు యుద్దం చేసే దమ్మున్నా ఆర్ధికంగా అంత బలం లేదనేది వాస్తవం. అందుకే పుతిన్ వెనకడుగు వేశారు. మరి పుతిన్ డిమాండ్ లను అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటుందా లేదా అనేది తేలిపోనుంది. అయితే రష్యా లాంటి దేశాన్నే నాటో పేరుతో అమెరికా పుతిన్ మెడలు వంచింది. తేడా వస్తే తమ పని కూడా అంతేనని చైనా లెక్కలు వేసుకుంటుందట. అమెరికా రష్యాను భయపెట్టి చైనా దూకుడుకు కల్లెం వేయాలనుకుంటుందట. ఒక వేల తైవాన్ ను ఆక్రమించుకోవాలని చూస్తే అమెరికా డైరెక్ట్ గానే యుద్దంలోకి దిగుతుందని… ఇది చైనాకు పరోక్ష హెచ్చరిక అంటున్నారు నిపుణులు. అందుకే గోడ మీది పిల్లిలా రష్యా వివాదంలో ( Russia vs Ukraine ) మాట్లాడకుండా గమనిస్తోంది చైనా.

Previous articleAshwini Dutt : జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం అంతమంది పని చేశారా…?
Next articleనటుడు నరేష్‌ మాజీ భార్య పై పోలీసు కేసు నమోదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here