రష్యా వేసిన బాంబు ఇండియాలో ఉన్న మన ఇంటి మీద ఎలా పడుతుందో తెలుసా ?

726
price hike
price hike

ఈ వార్ కొంత మంది వ్యాపారులకు లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. కానీ సామాన్యులకు మాత్రం కాదు. రష్యా వేసే బాంబు మన ఇంటిపై ధరల బాంబుగా ఎలా మారుతుందో చూద్దాం.

ఇన్నాళ్లు మనం సన్ ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకుని హాయిగా వండుకుని తింటున్నాం. ఇక ముందు కూడా తింటాం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే మతి పోవడం ఖాయం. మనం వంటలో వాడే సన్ ఫ్లవర్ నూనె 70 శాతం రష్యా నుంచి వస్తుందంటే నమ్మగలరా నిజం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 20 శాతం ఉక్రెయిన్ నుంచి వస్తోంది. మిగతా పది శాతం అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏకంగా 90 శాతం మన వంట నూనె అవసరాలు తీర్చే రష్యా. ఉక్రెయిన్ లు యుద్దంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పుడు రష్యా మీద ఆంక్షలతో అది కాస్తా ఇప్పుడు ఇబ్బంది ఏర్పడింది. రష్యా యుద్దం చేస్తున్నా మనకు మళ్లీ నార్మల్ గా సన్ ఫ్లవర్ ఆయిల్ రష్యా నుంచి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. పైగా గత రెండేళ్లలో సన్ ఫ్లవర్ వాడకం మన దేశంలో 12 శాతం అదనంగా పెరిగింది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ ల గ్యాప్ లను పూడ్చుదామనే లోపే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు మోతమోగనున్నాయి. మన దేశంలో వ్యాపారం చేసే దరిద్రులు ఆ యుద్ద ప్రభావం ఇంకా ఎపెక్ట్ కాకముందే పాత స్టాక్ మీద రేట్లు పెంచేశారు. మరో 20 రోజులైతే పాత స్టాక్ అయిపోతుంది. కొత్త ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. అందుకే అర్జెంటీనా సహా ఇతర దేశాల నుంచి సన్ ఫ్లవర్ తో పాటు పామ్ ఆయిల్ ను కూడా దిగుమతి చేసేందుకు కేంద్రం అపసోపాలు పడుతోంది. కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే రష్యా వ్యాపారాలు యుద్దం ఎఫెక్ట్ సన్ ఫ్లవర్ మీద పడకుండా మేం సప్లైం చేస్తాం. కానీ దయచేసి మా ఆయిల్ ను కొనమంటున్నారు రష్యా వ్యాపారులు. ఎందుకంటే ఇతర దేశాలు ఆన్ లైన్ మనీ లావాదేవీలు చేసే స్విఫ్ట్ ను రష్యా కు బ్లాక్ చేశాయి. కాకపోతే మనం సహకరిస్తే అమెరికా ఊరుకునే పరిస్తితి లేదు. ఈ నూనె గొడవ కూడా ఎటు వెళ్తుందో యుద్దం ముగిస్తే కానీ తెలియదు.

price hike
price hike

మన దేశంలో మరో దరిద్రం ఏంటంటే గోదుమలు ఉత్తరాదిన విపరీతంగా పండిస్తారు. కానీ తక్కువ ధర అని చెప్పి 50 శాతం రష్యా నుంచి, 18 శాతం ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ఎఫెక్ట్ పడితే దేశీయంగా గోదుమలు, గోదుమ పిండి ధర విపరీతంగా పెరగడం ఖాయం. కానీ మన గోదుమలను కొనేందుకు యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆ లాభం రైతులకు చేకూరుస్తారా అనేది ఇప్పుడు మనముందున్న ప్రశ్న. కానీ ఏది జరిగినా మన సామాన్య ప్రజలకు మాత్రం మరికొద్ది రోజుల్లోనే గోదుమలు, గోదుమ పిండి తో పాటు చిన్న పిల్లలకు వాడే పాల డబ్బాల నుంచి ప్రొటీన్ ఫుడ్ వరకు విపరీతంగా ధరలు పెరగున్నాయి. ఈ ప్రొటీన్ కూడా రష్యా నుంచే వస్తోంది. బేకరీ నుంచి గోదుమ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. కాకపోతే కొత్త పంట మనకు చేతికి వస్తోంది. దాని కారణంగా రేటు బ్యాలెన్స్ అవుతుందని చెబుతున్నారు. కానీ వ్యాపారులు ఎక్కువ ధరకు ఎగుమతి చేసి మనకు టోపీ పెట్టేందుకు చూస్తున్నారు. కేంద్రం వాటికి బ్రేక్ వేయకపోతే అంతే. నూనెల తర్వాత గోదుమల ద్రవ్యోల్బనం ఆకాశాన్నంటుతుందంటున్నారు ఆర్దిక నిపుణులు.

మన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించినప్పుడే మనకు పెట్రోల్, డీజిల్ వాతలు పెట్టింది. ఇక ఇప్పుడు బ్యారెల్ ధర 130 డాలర్ల కు చేరింది. ఆ యూపీ ఎన్నికల చివరి ఓటు బాక్స్ లో పడగానే మన మోడీ గారు వాత పెడతారు. మరో ఆరు నెలల్లో లీటర్ పెట్రోల్ 160 కి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే అన్ని ధరలు పెరుగుతాయి. మరి దేశంలోని ప్రజలు మనుషులనుకుంటున్నారో లేదంటే ఎంత పెంచినా మతం చాటున కవర్ చేసుకోవచ్చనుకుంటున్నారో కానీ జనాల రక్తం తాగుతోంది కేంద్రం. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా యుద్దం కొంప ముంచింది. ఇక మీరు పెట్రోల్ , డీజిల్ మీద వాయించుకునేందుకు సిద్దం కండి. ఆప్షనే లేదు. అయితే ఈ సారి ఝలక్ మోడీ గారు వంటింటి మహిళలకు కూడా ఇవ్వనున్నారు. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయి. రష్యా మీద ఆంక్షలు మన మెడకు చుట్టుకున్నాయి. అదనపు ఉత్పత్తిని నిలిపేసి ఓపెక్ దేశాలు ఉక్రెయిన్, రష్యా యుద్దం నుంచి డబ్బులు దండుకోవాలని చూస్తున్నాయి. దాంతో గ్యాస్ ధర బండ మండటం ఖాయం. ఇంకో విషయం ఏంటంటే నేచురల్ గ్యాస్ ధర కూడా పెరగనుంది. మన ఓన్జీసీ రష్యాలోని చాలా చోట్ల గ్యాస్ వెలికితీత కోసం వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. యుద్దం కారణంగా, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అది కూడా వాతే. సీఎన్జీ, ఎల్పీజీ అన్నీ పెరుగుతాయి. ప్రజలారా ఉక్రెయిన్, రష్యా యుద్దం వార్తలు చూస్తున్నారు కదా…ఇక ధరల పెరుగుతుంటే మన బాధను కూడా టీవీలే చూపిస్తాయి.

చికెన్, మటన్ తో పాటు నాన్ వెజ్ వండుతున్నామంటే గుర్తుకొచ్చేది…కొత్తిమీర. ఎండింగ్ లో కొత్తిమీర వేయకుంటే మన వంటింటి మహిళల ప్రాణం విలవిలలాడుతుంది. కానీ ఉక్రెయిన్ నుంచే 70శాతం కొత్తిమీర విత్తనాలు వస్తున్నాయి. ఇప్పుడు పోర్ట్ లు మూసి వేయడంతో ఆగిపోయాయి. ఆ పోర్ట్ లను రష్యా ఇప్పటికే ధ్వంసం చేసింది. ఇలానే మరో రెండు నెలలు యుద్దం జరిగితే ధనియాలు, కొత్తిమీర రెండింటికి ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది. అందుకే కొత్తి మీర కోసం కూడా మన వ్యాపారులు యూరప్ దేశాలను సంప్రదిస్తున్నారు.

ఆటోల నుంచి ట్రాక్టర్ లు, కార్లు సహా ఆటోమొబైల్ ధరల కు రెక్కలు రానున్నాయి. ఎందుకంటే కీలకమైన అల్యూమినియం, పెలాడియం కోసం మనం 70 శాతం రష్యా మీద ఆధారపడ్డాం. ఇంకో దారునం ఏంటంటే చిప్ మాన్యుఫక్ఛరింగ్ కు ఉపయోగించే నియాన్ గ్యాస్ మనకు 90 శాతం ఉక్రెయిన్ నుంచే వస్తోంది. దీంతో వేరే దారులు వెతుకుతున్నాయి దేశీయ కంపెనీలు. అర్జెంట్ గా నియాన్ గ్యాస్ కొరత ఏర్పడటంతో పరుగులు పెడుతున్నాయి కార్ల కంపెనీలు. అల్యూమినియం, పెలాడింయ సులభంగానే చైనా నుంచి దొరుకుతుంది. కానీ నియాన్ మాత్రం కష్టం. దీని కారణంగా ఆటోమొబైల్ ధరలు పెరగడంతో పాటు ఉత్పత్తి వేగం కూడా తగ్గనుంది.

ఇక ఎండాకాలంలో కరెంట్ ఉత్ప్తికి బొగ్గు కొరత రాకుండా వేరే మార్గాలు చూడాలని కేంద్రం ఎన్టీపీసీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ను ఆదేశించింది. పది శాతం బొగ్గు మనకు రష్యా నుంచి వస్తుంది. ఇది పెద్ద ప్రభావం చూపకపోయినా సమ్మర్ కావడంతో కేంద్రం ఆలోచనలో పడింది.

స్టీల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వస్తువుల తయారీలో వాడే స్మాల్ స్కేల్ బిజినెస్ ల కోసం రష్యా నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. వంటింటి పాత్రల ధరలు పెరగడం ఖాయం. కానీ ఇదే ఇండస్ట్రీ స్టీల్ ను మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్ పోటీ నుంచి తప్పుకోవడంతో యూరప్ కు, చైనాకు ధరలు పెంచి అమ్మేందుకు మన స్టీల్ ఇండస్ట్రీ ఉర్రూతలూగుతోంది. స్టీల్ మన దగ్గరే విపరీతంగా ఉన్నా వంటపాత్రల విషయంలో వాతలు పడుతుండటం విశేషం. ఈ మ్యాజిక్ అంతా వ్యాపారంలోనే ఉంది.

ఇక చివరగా మన రైతులకు ఈ సారి షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. డీఏపీ ని మనం అత్యదికంగా సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ తరువా స్థానాల్లో చైనా, ఉక్రెయిన్ , రష్యా ఉన్నాయి. ఇప్పుడు యుధ్దం కారణంగా ఎక్కువగా సౌదీ, చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. అంతర్జాతీయంగా షార్టే జ్ ఉంటే దరలు పెంచుతారు. ఇటు ఫాస్పరస్ కోసం మనం రష్యా మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు ఆ గ్యాప్ ను పూడ్చుకునేందుకు ఒమన్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఈ యుధ్దం చాలా నష్టాలు కలిగిస్తుందనడం లో సందేహం లేదు.

Previous articleపొరపాటునకూడ ఈ పదాలు గూగుల్ లో సెర్చ్ చేయకండి
Next articleChiranjeevi కోసం పవన్ కళ్యాణ్ అతడిని షూటింగ్ స్పాట్ లోనే కొట్టాడట…. హాస్పిటల్ కి వెళ్లి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here