హిందూ పురాణాల ప్రకారం మన సృష్టిని బ్రహ్మ సృష్టించాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషులను సృష్టించారు. బ్రహ్మ భార్య సరస్వతి దేవి ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ సరస్వతి దేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచానికి విద్యని అనుగ్రహిస్తున్నాడు బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతి స్వయంగా ఆ విధాతకు కుమార్తె అని చాలా మందికి తెలియదు. బ్రహ్మ పురాణం మత్స్యపురాణం లలో బ్రహ్మ దేవుడు తన కూతురు అయిన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. సరస్వతి పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ తన శక్తినంతా కూడగట్టి సరస్వతిని తయారు చేశాడు. అలా సరస్వతి కి తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నారు ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తను ఒంటరిగా ఉన్నారు తన దగ్గర ఉన్న శక్తితో సరస్వతి ,బ్రాహ్మీ, సంధ్య లను తయారు చేశారు.
ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మ తన ఆలోచనలు మొత్తాన్ని సరస్వతి పైనే ఉంచేవారు. సరస్వతి బ్రహ్మ నుంచి తప్పించుకోవడానికి నాలుగు దిక్కులలో దాక్కునేది. ఆమెను చూడడం కోసం ఆయన నాలుగు తలని ఏర్పాటు చేసుకున్నారు. బ్రహ్మ కనుచూపుమేర నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేది సరస్వతి. ఆయన నుంచి తప్పించుకోవడం కోసం ఆకాశంలో దాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. అప్పుడు తన అయిదు తలలతో సరస్వతిని చూసేవారు. అలా బ్రహ్మ చూపు నుంచి సరస్వతి తప్పించుకోలేక పోయింది. ఆపైన బ్రహ్మ సరస్వతి ని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి మానవజాతిని సృష్టించాలి అని నిర్ణయించుకున్నారు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లి వంద సంవత్సరాలపాటు వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉండి మను అనే ఒక పిల్లవాడికి జన్మనిచ్చారు. ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు మనువు అని చెప్తారు. వేదాలు సంస్కృత భాష సాంప్రదాయాలు ఇలా ఎన్నో విషయాలకు మనువే తండ్రి అని చెప్పారు. అలా బ్రహ్మ తనే సృష్టించిన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు.
5 తలలతో ఉన్న బ్రహ్మ నాలుగు కలలతో ఉండడానికి గల కారణాన్ని కూడా మరో కథలు చెప్తారు. ఇలా తననే తదేకంగా బ్రహ్మ చూస్తున్నాడని తెలిసిన సరస్వతి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్లి తన బాధ చెప్పుకుందట. దానితో పరమేశ్వరుడు బ్రహ్మ మీద ఆగ్రహించి తన ఐదు తలలో ఒక తల నరికేశాడు. అలా బ్రహ్మ నాలుగు తలలతో మిగిలిపోయాడు. అయినా తన ఇష్టాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు బ్రహ్మ సరస్వతి ని వివాహం చేసుకోడానికి అంగీకరించాడు మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి.