ఎవరు ఈ 7 రాజ్ … ఏమిటి ఇతని స్పెషల్ … తెలుగు-ఎరుపులోనే ఎందుకు కనిపిస్తాడు

647

మీకు సెవన్ రాజ్ తెలుసా? అతనెవరని మాత్రం అనొద్దు. ఇందుకంటే ప్రపంచంలోనే యూనిక్ లైఫ్ స్టైల్ తోజీవించే వ్యక్తిగా సెవన్ రాజ్ గుర్తించబడ్డాడు. ఇతని పేరు గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. ఈ సెవన్ రాజ్ ఎవరో తెలియాలంటే బెంగళూరు వెళ్లాల్సిందే. బెంగళూరు లోని ఒక ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఇంట్లో నివాసం ఉంటాడీ సెవన్ రాజ్. ఇతని తండ్రి కేరళకు చెందిన వ్యక్తి. ఏడవ సంతానంగా పుట్టడంతో తన కొడుకుకు సెవన్ రాజ్ అని పేరుపెట్టాడు. ఇతనికి టీనేజ్ వయసు వచ్చిన తర్వాత సెవన్ నెంబర్ అంటే ఒక సెంటిమెంట్ గా మారింది. బెంగళూరుకు షిఫ్ట్ అయిన తర్వాత సెవన్ నెంబర్ మీద రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టి భాగా సంపాదించాడు. ఇప్పటికీ రియల్టర్ గా వ్యాపారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారాయన.

ఇతనికి ఏడు సంఖ్య మాత్రమే కాదు ప్రత్యేకమైన రంగుల పిచ్చి ఉంది. అది కూడా రెండు రంగులంటేనే ఇష్టం. తెలుపు, ఎరుపు అంటే ప్రాణం..ఇతర రంగులను చూస్తే అతనికి చిరాకు. ఏ వస్తువు వాడినా, కొన్నా సరే ఎరుపు లేదా తెలుపు రంగు ఉండాలి. లేదంటే వారిఇంట్లోకి వస్తువులు కూడా రావు. తాను వేసుకునే అండర్ వేర్ నుంచి వాచ్ డయల్ వరకు అన్నీ ఎరుపు లేదా తెలుపు లోనే ఉంటాయంటాడు సెవన్ రాజ్. అంతెందుకు షర్ట్ కు ఏడు బటన్ లు ఉంటాయి. తన షర్ట్ లేదా బ్లేజర్ మీద ఏడవ నెంబర్ స్టిచ్ చేసి ఉంటుంది. దాని మీద రాజు కిరీటం కూడా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం అంటే  1994 లో సెవన్ రాజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అతని భార్య పుష్ప ఈ రంగుల పిచ్చి ఏంటా అని ఆశ్చర్యపడింది. కానీ అతనికి అది సెంటిమెంట్ గా మారింది. అంతే కాదు ఎంజీఆర్ కళ్ల జోడుతో పాపులర్. నాకిష్టమైన గాంధీ కి కళ్ల జోడు పంచె ఉంటుంది. ఎప్పుడు, ఎక్కడ చూసినా గాంధీ ఒకే లా కనిపిస్తారు. అందుకే నాకూ వారిలా ప్రత్యేకంగా బతకాలని ఉందని భార్యకు చెప్పాడు సెవన్ రాజ్. ఆ నాటి నుంచి భార్య పుష్ప కూడా అతని బాటలోనే నడిచింది. ఆమె కూడా తెలుపు, ఎరుపు ఉన్న, చీరలే ధరిస్తారు.

సెవన్ రాజ్ ఇంట్లో ఏ వస్తువైనా వైట్ లేదా రెడ్ రంగులో ఉంటుంది. వాచ్ లు, ఫోన్ లు అన్నీ ఒకే రంగు. అంతే కాదు స్కార్పియో తనకు రెడ్ అండ్ వైట్ లో దొరకకపోతే అదదనంగా ఖర్చుపెట్టి మరీ నచ్చిన రంగు వాహనం తెప్పించుకున్నాడు. అది అంబులెన్స్ లా కానిపిస్తుంది. చివరకు తన పిల్లలను రెడ్ అండ్ వైట్ యూనిఫామ్ ఉన్న స్కూల్ లోనే చేర్పించాడు. ఇంట్లో చైర్ లు, ఫ్యాన్ లు, ల్యాప్ టాప్ లు, గొడుగుకులు అన్నీ రెండు రంగుల్లోనే ఉంటాయి. కొడుకు భరత్ రాజ్, కూతురు మనీషా సైతం తెలుపు, ఎరుపు రంగుల బట్టల్లోనే ఉంటారు. వారి షూస్ సైతం ఆ రంగుల్లోనే ఉంటాయి. వారి స్నేహితులు మొదట కామెంట్ చేసినా తర్వాత అలవాటు పడ్డారు. అంతెందుకు 20 ఏళ్ల క్రితం తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తనను తన ఎరుపు, తెలుపు రంగు ఇష్టాన్ని చూసి పిచ్చివాడనుకున్నారు. ఆ తర్వాత నా ఇష్టాన్ని అర్దం చేసుకున్నారని చెబుతాడు సెవన్ రాజ్. కాలనీలో ప్రత్యేకంగా ఎరుపు , తెలుపు రంగులో బిల్డింగ్ ప్రత్యేకంగా మెరుస్తుంటుంది. గేటు కూడా అంతే రెడ్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. వారి ఇంట్లోని బైక్ ల నుంచి బాత్ రూమ్ లో వాడే మగ్ లు, బకెట్ ల వరకు అంతా ఎరుపు తెలుపు మయమే.

సెవన్ రాజ్ లో మరో ప్రత్యేక కూడా ఉంది. కింది వీడియోలో పూర్తి సమాచారం ఉంది.

Previous articleవిమానంలో ప్రయాణించేటప్పుడు పొరపాటున కూడా ఈ పని చేయకూడదు
Next articleఈ చిన్న చిట్కాతో చర్మ సంబంధిత సమస్యలు దూరం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here