షేన్ వార్న్ గ్రౌండ్ లోనే కాదు వివాదాలు, రతి క్రీడల్లో కూడా గొప్ప క్రీడాకారుడే

268
shane warne
shane warne

షేన్ వార్న్…స్పిన్ తో పిచ్ పై బాల్ ని భరతనాట్యం ఆడించిన లెజెండరీ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ కు షేన్ వార్న్ కాస్తా షేర్ అయ్యాడు. కానీ 52 ఏళ్లకే మనల్ని విడిచి వెళ్లాడంటే క్రికెట్ అభిమానుల మనస్సును చివుక్కుమని బాధపెడుతోంది. ఎందుకంటే స్పిన్ మన దగ్గర పుట్టినా దానికి సోకులు అద్దిన స్టార్ బౌలర్ వార్న్. రెండు అడుగుల దూరంలో నుంచి నాలుగు అడుగులు వేస్తూ…బౌలర్ వైపే చూస్తూ రెండు వేళ్ల కింద నుంచి బంతిని వదులుతాడు. అతను వేసే బాల్ ఎటు వేస్తాడో బ్యాట్స్ మన్ అంచనా వేస్తాడు. కానీ అది మెరుపు వేగంతో ఎటు దూసుకెళ్తుందో ఎవరూ ఊహించలేరు. అతని చేతి లో మ్యాజిక్, అడుగుల్లో రిథమ్ తో వార్న్ విసిరే బంతులను లైవ్ లో చూసిన వారు అద్రుష్టవంతులు. ఎందుకంటే షేన్ వార్న్ అంటే ఎంటర్ టెయినర్. షేన్ వార్న్ అంటే సూపర్ స్పిన్నర్. షేన్ వార్న్ బాల్ తీసుకుంటే ప్లేయర్స్ కి వణుకు…ఆడియెన్స్ కి సూపర్ ఎక్సైట్ మెంట్. నెక్ట్స్ బాల్ ఎక్కడ, ఎలా వేస్తాడోనని తెగ చూసేవారు. బాల్ ను గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్ మన్ కళ్లను కూడా బొంగరం లా మాయ చేసి వికెట్లను గిటారేసిన అన్ యూజువల్ బౌలర్. అసలు స్పిన్ అంటే ఇదిరా అని చూపించాడు. ఇంకా వెటకారంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా పిచ్ లపై మోకాల్లోతు గడ్డి ఉంటుంది. అన్నీ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లే. అలాంటి తడి ఉన్న పిచ్ పై బాల్ ను సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల్లా బ్యాట్సమన్ ను తిప్పేశాడు. తాను బాల్ వేస్తుంటే తన వికెట్ కీపర్, వికెట్ల వెనుకాల టోస్ మీద నిలబడి బ్రేక్ డ్యాన్స్ చేయాల్సి వచ్చేది. అంతలా ఆటాడుకున్న బౌలర్ షేన్ వార్న్. టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్లు తీసి ప్రపంచ క్రికెట్ ను స్పిన్ తో శాసించాడు. ఇక మన దేశానికి వచ్చాడంటే క్రీజ్ లో సచినో, ద్రవిడో, లక్ష్మణో ఉన్నాడంటే వార్న్ వేసే బంతులకు మన వాళ్లు ఆడుతుంటే చూసి తీరాలి. ఆ కిక్కే వేరు. వార్న్ వేసే ప్రతి బంతికి కోటి రూపాయలు ఇచ్చినా తక్కువే. ఆ మజా యే వేరు. పొడిబారిన మన పిచ్ లు స్పిన్ కు అనుకూలం. అంటే వార్న్ చేతికి బాల్ వచ్చిందంటే మనం వ్యూహం తెలిసిన మన శత్రువుతో 22 అడుగుల పిచ్ పై యుద్దం చేసినట్లే.

ఇంతటి ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ వార్న్ అసలు పేరు షేన్ కీత్ వార్న్. సెప్టెంబర్ 13, 1969 లో ఆస్ట్రేలియా లోని విక్టోరియా రాష్ట్రంలో పుట్టాడు. వార్న్ కు సహజంగానే ఆస్ట్రేలియాలో అందరిమాదిరిగానే క్రికెట్ పిచ్చి స్కూల్ డేస్ లోనే పట్టుకుంది. మొదట ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ స్లోగా వస్తూ బాల్ ను టర్న్ చేయడం చూసిన కోచ్…స్పిన్ ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. మొదట బాల్ ను విపరీతమై స్పిన్ తో బ్యాట్స్ మన్ ను తిప్పలు పెట్టేందుకు ప్రయత్నించేవాడు. కానీ అవి తడి ఉన్న పిచ్ లు, పాస్ట్ బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ లు కావడంతో బంతి కింద పడగానే మెల్లిగా లేసేది. ఆ టైమ్ లో కోచ్ చెప్పిన ఒకే ఒక మాట అతని దశను మార్చింది. పిచ్ ఏదైనా సరే…బాల్ మీద కంట్రోల్ ఉంటే…నిన్ను మించిన బౌలర్ పుట్టడు, నీ దగ్గర ఆటాలెంట్ ఉందని ఎంకరేజ్ చేశారు కోచ్. ఆ రోజుల్లో ఆస్ట్రేలియన్ టీమ్ లో స్పిన్నర్ కు పెద్ద విలువ ఉండేది కాదు. హేమా హేమీల్లాంటి ఫాస్ట్ బౌలర్ లు ప్రపంచాన్ని శాసించే టైమ్ లో స్పిన్ ను ప్రాక్టీస్ చేసేవాడు వార్న్. కానీ తన టాలెంట్ అమోఘమని అతనికి తెలుసు. కానీ సహకరించని పిచ్ లపై రెండు వందల శాతం శ్రమ పెట్టాల్సి వచ్చేది. ఎంత బాల్ ని చేతిలో తిప్పి వెళ్లినా సరే పిచ్ మీద పడగానే…చచ్చిన పాము మాదిరిగా మెల్లిగా పైకి లేచేది. పైగా బ్యాట్స్ మన్ కు టైమ్ దొరుకుతుండటంతో లాగి పెట్టి కొట్టేవారు. దాంతో బాల్ అరిగిన తర్వాత ఫాస్ట్ బౌలర్ లు వికెట్ ల దగ్గర పిచ్ ని రఫ్ గా చేసిన ప్లేస్ ను టార్గెట్ చేసుకుని పగుళ్లు ఉన్న చోట బంతిని సంధించడం మొదలు పెట్టారాయన. అలా బౌన్సీ పిచ్ లపై ఒక్కో బ్యాట్స్ మన్ కు తాము మంత్రశక్తి ఉన్న బౌలర్ ను ఎదుర్కొంటున్నామా అనేంతగా భయపెట్టాడు. విపరీతమైన ప్రాక్టీస్ బౌన్సీ పిచ్ ల మీద బాల్ ను ఎలా వేయాలో అతనికి నేర్పింది.

shane warne
shane warne

ఆస్ట్రేలియాలో గ్రాస్ బౌన్సీ పిచ్ ల కారణంగానే ఆ రోజుల్లో ఆలస్యంగా ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు వార్న్. 1992 లో సిడ్నీ గ్రౌండ్ లో మన దేశంపైన్నే అరంగేట్రం చేశాడు వార్న్. అప్పటికే అతనికి 23ఏళ్లు. ఇక మన వాళ్లకు స్పిన్ అంటే వెన్నతో పెట్టిన విద్య. కొత్తగా వచ్చిన వార్న్ విసిరిన స్పిన్ బంతులను ను ఉతికి ఆరేశారు. చివరకు ఒకే ఒక వికెట్ అది కూడా 206 పరుగులు చేసి అలసిపోయిన రవిశాస్త్రి ని ఔట్ చేసి… మొదటి వికెట్ పడగొట్టాడు. 150 పరుగులిచ్చి ఒకే వికెట్ పడగొట్టాడు వార్న్. దీంతో ఇక అతనికి భవిష్యత్ లేనట్లే అనుకున్నారు. స్పిన్నర్ స్థానలో మరో ఫాస్ట్ బౌలర్ ను తీసుకుంటే బెటరనుకుంది నాటి ఆస్ట్రేలియా టీమ్ మేనేజమెంట్. కానీ మరుసటి సిరీస్ నుంచి వార్న్ తన తఢాఖా చూపించాడు.

యాషెస్ లో అయితే ఉగ్రరూపం చూపించాడు. మామూలుగానే ఆ రోజుల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా ప్లేయర్ లకు స్పిన్ అంటే వెన్నుపాములో వణుకనే పేరుండేది. అలాంటి 93 యాషెస్ లో ఇంగ్లాండ్ ను ఊచకోత కోశాడు. స్పిన్ తో నాగుపాము బుసలతో బ్యాట్స్ మన్ ను బోల్తా కొట్టించాడు వార్న్. ఇంకా చెప్పాలంటే యాషెస్ యుద్దంలో వార్న్ ధాటికి రక్తం పిచ్ పై పారిందని కూడా అతిశయోక్తితో చెప్పారు. మైక్ గ్యాటింగ్ కు వార్న్ వేసిన బాల్ నేటికీ బాల్ ఆఫ్ ది సెంచరీగా రికార్డ్ కు ఎక్కింది. మెల్లిగా నాలుగు అడుగులు వేసి బాల్ ని లెగ్ సైడ్ వేశాడు వార్న్. బాల్ లెగ్ సైడ్ పడింది కాదా అని మైక్ ఎడమ వైపుకు తిరిగి ఆడబోయాడు. కానీ అనూహ్యంగా అతను జరిగిన కాసింత ప్లేస్ లోంచి ఆఫ్ సైడ్ కు బాణంలా దూసుకెళ్లి స్టంప్ ను పడేసింది. అసలు బ్యాట్స్ మన్ కు ఏం జరిగిందో అర్ధం కాలేదు. కామెంటెటర్లు సైతం మంచి బంతి అన్నారు కానీ రీప్లేలో చూసిన తర్వాత వారికి బాల్ ఆఫ్ ది సెంచరీ అని అర్ధమైంది. ఆ తర్వాత 2006 యాషెస్ వరకు ఎన్నో సార్లు ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాలను కట్టబెట్టాడీ లెజెండరీ బౌలర్.

బాల్ ఎక్కడ పడితే ఎక్కడ వికెట్ లను తాకిందనేది చూసి ఒక్కొక్కరికి మైండ్ కాసేపు బ్లాంక్ అయింది. బారత్ బ్యాట్స్ మన్ చేతిలో పరాభావం తర్వాత యాషెస్ లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టాడు. నాటి నుంచి 15 ఏళ్లు స్పిన్ బౌలింగ్ ను ఏలాడు. కేవలం ముత్తయ్య మరళీధరన్ మాత్రమే అతని రికార్డ్ ను చెరిపేయగలిగాడు. కాకపోతే మురళీధరన్ చేయి పుట్టకతో మెలి తిరిగి ఉండటం కలిసి వ చ్చిందంటారు పండితులు. అలా అని మురళీధరణ్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయకూడదు. అయితే వివాదాలు లేకుండానే వార్న్ …ప్రపంచ స్పిన్ బౌలింగ్ ను ఏలాడు.

1999 వరల్డ్ కప్ లో హ్యాన్సీ క్రానే ఆద్వర్యంలో సౌతాఫ్రికా జోరుమీదుంది. ఆ టీమ్ ను ఓడగొట్టే సత్తా ఉన్న జట్టు లేదనే వాదనలు వినిపించాయి. కప్ వాళ్లదే అనుకున్నారు. కానీ కర్నుడు చావు క్రిష్నుడికి తెలుసన్నట్లుగా సౌతాఫ్రికా జట్టును స్పీన్ మాయ ఉచ్చులో దించి చిత్తుగా ఓడించాడు. గ్రేటెస్ట్ ఎండింగ్ మ్యాచ్ గా చెప్పుకునే ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఆస్ట్రేలియా అవుటైనా స్పిన్ తో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు వార్న్. గొప్ప ప్లేయర్ లు గా పేరుండి, భీకర ఫామ్ లో ఉన్న కీర్ స్టన్, గిబ్స్, క్రానేలను వరుస ఓవర్లలో అవుట్ చేసి వాళ్లకు ప్యాకప్ చెప్పి వరల్డ్ కప్ ను ముద్దాడేలా చేశాడు షేన్.

షేన్ వార్న్ అంటే భారత క్రికెట్ అభిమానులకు స్పెషల్. ఇటు వార్న్ కు కూడా అంతే. పగుళ్లతో కనిపించే మన డ్రై పిచ్ లపై సచిన్ కు బౌలింగ్ చేయడమంటే ఆయనకు స్వర్గంలో అమ్రుతం తాగినంత హాయిగా ఉంటుందట. ఇటు మనకైతే వార్న్ బంతిని సచిన్ ఎలా బాదుతాడా అని కసిగా చూసేవాళ్లం. ఇంకా చెప్పాలంటే క్లాసిక్ క్రికెట్ ను చూస్తుంటే అది టెస్ట్ మ్యాచైనా సరేహోరా హోరిగా ఉండేది. టార్గెట్ లు, రన్స్ తో పని లేదు. వార్న్ వర్సెస్ సచిన్ మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులే కాదు గ్రౌండ్ లో ఉన్న జట్లు సైతం తెగ ఎంజాయ్ చేసేవి. అసలే మన వి డ్రై పిచ్ లు. అలాంటి పిచ్ పై వార్న్ బంతిని భూగోళం మాదిరిగా తిప్పేసేవాడు. ఒక్కో బంతి ఒక్కో చోట విసిరేవాడు. కొన్ని చోట్ల ఒకే చోట వేసి అనూహ్యమైన స్పిన్ ను రాబట్టేవాడు. సచిన్ సైతం క్రికెట్ మేస్త్రీ మాదిరిగా కొలతలు వేసి మరీ కొట్టేవాడు. ఇక ఎల్బీడబ్ల్యూ అప్పీల్ వచ్చిందంటే ఎంపైర్లకు వణుకు మొదలయ్యేది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. దీంతో బాల్ మీద ప్రాణం పెట్టి చూసేవారు ఎంపైర్ లు. ఎంతైనా ఆ రోజులే వేరు. వార్న్ బాల్ ఎక్కడ పడింది, ప్యాడ్ ను ఎలా తాకిందని చూడాలంటే ఎంపైర్ లకు పరీక్షే. అలా 15 ఏళ్లు క్రికెట్ ను ఏలాడు. ఇది మనకు తెలిసిన ఎంటర్టెయిన్ మెంట్.

పిచ్ లోనే కాదు బయట కూడా వివాదాలు తక్కువేమి కాదు. ఆ వార్తలు కూడా క్రికెట్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చేవి. వార్న్ మామూలుగానే పొగరుబోతు. యువకుడిగా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినేవాడు కాదు. దీంతో స్టీవ్ వా కెప్టెన్ అయిన తర్వాత వంగి వంగి దండాలు పెట్టడం లేదని పీకేశాడు. కానీ వార్న్ భయపడతాడా ఏకంగా మీడియా ముందు ఏకి పారేసేవాడు. వార్న్ నోరు మూయించేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ తెగ కష్టాలు పడాల్సి వచ్చేది. 1994 లో పిచ్ రిపోర్ట్ ను లంక పర్యటనలో ఉండగా ఇండియన్ బుకీకి మార్క్ వాతో కలిసి లీక్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. నాడు యంగ్ గా ఉన్న వార్న్ ను క్రికెట్ బోర్డ్ అదుపులో పెట్టగలిగింది. కానీ రెండువేల సంవత్సరం తర్వాత వార్న్ లెజెండరీ క్రికెటర్ అయ్యాడు.విపరీతంగా సంపాదించాడు. ఆ సమయంలో భార్య ఉండగానే లండన్ లోని ఒక పబ్ లో ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలొచ్చాయి.

2003 లో సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న సమయంలో అందరికీ డోప్ పరీక్షలు నిర్వహించింది ఐసీసీ. అందరూ పాస్ అయ్యారు కానీ వార్న్ ఫెయిలయ్యాడు. బాడీని కంట్రోల్ లో ఉంచేందుకు వాడాను కానీ అది నిషేధిత మందు అని తెలియదని చెప్పాడు. అయినా నమ్మని ఏసీబీ వైస్ కెప్టెన్సీని పీకేసింది. ఇదేమన్న పెద్ద కెప్టెన్ పదవా. తీసేసుకోండని సహచరులతో చులకనగా మాట్లాడినట్లు వార్తలొచ్చాయి.

2006 లో సెక్స్ స్కాండల్ లో షేన్ వార్న్ ఇరుక్కున్నాడు. న్యూఇయర్ పార్టీలో ఏకంగా ఆరుగురు భామలతో గ్రూప్ శ్రుంగారంలో పాల్గొన్నాడట. అంతెందుకు ఎంటీవీ యాంకర్స్ కొరెల్లో ఎకోల్ట్స్, ఎమ్మా లతో కలిసి నగ్నంగా ఫోటోలు దిగి శ్రుంగారాన్ని ఎంజాయ్ చేశాడు. ఆ ఫోటో సదరు యాంకర్ ద్వారా లీకైంది. దానిని బ్రిటీష్ టాబ్లాయిడ్ ప్రచురించడంతో నానా రచ్చ జరిగింది. ఇక క్రికెట్ ను ఎఫైర్ లను మెయింటెయిన్ చేయలేక 2007 లో రిటైర్ అయ్యాడు. కానీ వివాదాలు మాత్రం ఆగలేదు.

వార్న్ తన భార్య ఉండగానే బహిరంగంగానే ఇతర మహిళలతో గడిపి దొరికిపోయాడు. తన భార్యకు సారీ చెప్పి సైమన్ తో మళ్లీ కలిశాడు. అయినా వార్న్ బుద్ది మారలేదు. బ్రిటీష్ నటి లిజ్ హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఆమె తో కూడా నిజయాతీగా ఉండలేకపోయాడు. సుగర్ డాడీ వెబ్ సైట్ లో చాటింగ్ చేస్తూ ఒక పోర్న్ స్టార్ తో పరిచయం పెంచుకుని కొన్నాళ్లు ఎఫైర్ నడిపి ఆమెనూ వదిలేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ లోనే కాదు వివాదాల్లోనూ శ్రుంగారంలోనూ మంచి క్రీడాకారుడనిపించుకున్నాడు వార్న్. ఇంకా దారుణమైన వివాదం లండన్ నైట్ క్లబ్ లో జరిగింది. పోర్న్ స్టార్ వాలరీ ఫాక్స్ ను తన గదికి రమ్మంటే రానని చీకొట్టి, బూతులు తిట్టిందట. దీంతో మత్తులో మొహం మీద ఒక పంచ్ ఇచ్చాడు. వార్న్ చూడండి నన్ను ఎలా కొట్టాడోనని ఫాక్స్ ఒకఫోటోను కూడా రిలీజ్ చేసింది.

మరో ఘటనలో ఒక మహిళను గ్రూప్ శ్రుంగారం కోసం ఒత్తిడి చేశాడట. ఆ గ్రూప్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ కూడా ఉన్నాడట. నలుగురం కంబైన్డ్ గా ఎంజాయ్ చేద్దాం రమ్మని బూతు మెస్సేజ్ లు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక ఈ వివాదాలు అంతటితో ఆగలేదు. తన బుక్ లో ఆర్టికిల్స్ లో స్టీవ్ వాను ఏకిపారేశాడు. అతను మంచి వాడు కాదు స్వార్ధపరుడు. అలాంటి మనిషిని నేనెప్పుడూ చూడలేదన్నాడు. అంతే కాదుఒకప్పుడు మైకేల్ క్లార్క్ అంటే పాంటింగ్ కు అసూయ. పాంటింగ్ అంత గొప్ప కెప్టెన్ ఏమీ కాదంటూ విమర్శించాడు. బంతితో గొప్ప క్రికెటర్ గా ఎలా పేరు తెచ్చుకున్నాడో… షేన్ వార్న్ గ్రౌండ్ బయట కూడా అంతకంటే ఎక్కువే వివాదాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఏది ఏమైనా సరే వార్న్ మ్రుతి క్రికెట్ అభిమానులను బాధపెడుతోంది. అయితేనే యూట్యూబ్ లో వార్న్ బెస్ట్ వికెట్స్, బెస్ట్ బాల్స్ మనందరినీ అలరిస్తూనే ఉన్నాయి. వార్న్ ఎవర్ గ్రీన్ ఎంటర్ టెయినర్ అనడంలో ఆశ్చర్యం లేదు. రెస్ట్ ఇన్ పీస్ లెజెండ్.

Previous articleNato అంటే ఏమిటి ? రష్యాకు ఎందుకు నాటో అంటే కోపం?
Next articleMohan Babu : మంచు మోహన్ బాబు సీనియర్ హీరోలతోనే అలా ప్రవర్తించేవాడట… ఆడియో లీక్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here