శనిని తెచ్చిపెట్టే శరీర భాగాలు
ఎందుకంటే అది చిన్న అయినా, పెద్ద అయినా పాపం తగులుతుందని అంటుంటాం అది నిజం. గౌరవం మాత్రమే కాదు ఒంట్లో ఈగోతో చేస్తే దాని ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాం. అందుకే పొరపాటను ఎవరినైనా తొక్కినా కూడా మెక్కినట్లుగా కానీ చేతితో వారిని తాకి సారీ అంటుంటాం. ఇది మనకు పెద్దల నుండి అలవాటైన మంచి సంప్రదాయం. ఇవన్నీ ఊరికే పెట్టలేదు. పెద్దలను గౌరవించాలనే కాదు తెలిసి మరొకరికి కాలు తగిలించినా, తెలియక తగిలించినా కూడా పాపం చుట్టుకుంటుందని మన పెద్దలంటారు. అందుకే మన శరీరంలోని కాళ్లు మన ఒంట్లోని భాగమే అయినా కూడా వాటిని జాగ్రత్తగా వాడుతుంటాం. దేవుడి దగ్గర కానీ మరే ఇతర పూజా సమయాల్లో కానీ, పెద్దల దగ్గర కూర్చున్నా, నిలబడ్డా కూడా కాళ్లను మనం చాలా జాగ్రత్తగా , ఎవరినీ అగౌరపరిచేలా ఉండకుండా చూసుకుంటాం.
ఇలానే మన ఒంట్లో మనకు శనిని తెచ్చిపెట్టేవి కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వేలి గోర్లు. వాటిని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటాం. పిల్లలకైతే మనమే దగ్గరుండి కట్ చేస్తుంటాం. కానీ చేతి వేళ్ల గోర్లు కానీ, కాలి వేళ్ల గోర్లు కానీ కట్ చేసుకున్నాక యథాలాపంగా అటు ఇటు తెలియకుండానే పడుతున్నా…చూసి చూడనట్లు వదిలేస్తుంటాం. మరికొన్ని సార్లు జాగ్రత్తగా వాటిని తీసి బయట పడేస్తుంటాం. కానీ అలా చేయకూడదంటారు పండితులు. వేలి గోర్లే కదా అని పడేస్తే మనకు శనిని తీసుకొస్తుందంటారు. ఎలా అంటే కట్ చేసిన గోర్లను కింద పడేయొద్దు. కొన్ని సార్లు మనం పేపర్ కానీ మరేదైనా కానీ వేసుకుని కట్ చేసుకుంటున్నా కూడా ఎగిరి పడుతుంటాయి. మరీ నెయిల్ కట్టర్ తో చేస్తుంటే ఎక్కడికో ఎగిరిపడుతుంటాయి. కానీ వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. వాటిని తొక్కితే మన దరిద్రం మనకే చుట్టుకుంటుందంటారు పండితులు. అది కూడా శుక్రవారం రోజు గోర్లను అస్సలు కట్ చేసుకోకూడదు. చేసుకుంటే మనం శనిని పిలుచుకుంటున్నట్లే లెక్క. కాబట్టి శుక్రవారం ఎట్టిపరిస్థితులలో నెయిల్స్ ను కట్ చేసుకోవద్దు. అందులో ఆడవాళ్లు అస్సలు చేసుకోవద్దు. ఇలా చేస్తే మనకు శని పట్టుకుంటుంది, మనకు అనుకున్న కార్యక్రమాలు పద్దతిగా సాగవు.
గోర్లను ఎవరైనా తొక్కినా కూడా వారికి దరిద్రం
ఇక గోర్లను ఎవరైనా తొక్కినా కూడా వారికి దరిద్రం. నెయిల్స్ ని కట్ చేసుకున్న వారి కంటే కూడా వాటిని తొక్కినవాళ్లకు లేని శని చుట్టుకుంటుందని మనం ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటాం. కానీ అది నిజమంటారు పండితులు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇక నెయిల్స్ ఎగిరి పోకుండా బాగా నీటిలో నానబెట్టాలి, లేదంటే స్నానం తర్వాత కట్ చేసుకుంటే సులభంగా కట్ అవుతాయి. వాటిని ఒక పేపర్ లో చుట్టి కానీ, కవర్ లో కానీ వేసి పడేయాలి. అవి మన ఇళ్లు దాటిపోతే చాలు. అంతే కానీ మన ఇంట్లో వాళ్ల నెయిల్స్ ని మనమే తొక్కుకుంటే మన శని మనకే తాకుతుంది. కాబట్టి గోర్ల విషయంలో జాగ్రత్త, అది కాలివైనా, చేతివైనా కూడా ఈవిషయంలో కొద్దిపాటి శ్రద్ద తీసుకుంటే మంచిది. దీనికి సరైన కారణం కూడా చెబుతున్నారు పెద్దలు. నెయిల్స్ ని తొక్కితే ఎందుకు శని అంటే… ప్రాణం పోయినా కూడా మన శరీరం నుండి గోరు పెరుగుతూనే ఉంటుంది. ప్రాణం లేకున్నా, ఆత్మ బయట ఉన్నా కూడా పెరిగే లక్షణం ఉంటుంది. ఇక మన ప్రాణం నుండి కట్ అయ్యాక దానిని తాక కూడదు. మన ప్రాణంతో లెక్క లేకున్నా గోరు పెరుగుతుంది. కాబట్టి ఒక్క సారి శరీరం వేరయ్యాక దూరంగా పడేయాలి. మరోసారి ప్రాణం దానికి తాకకూడదు. అలా చేస్తే మనకు మంచిది. లేదంటే అష్ట దరిద్రం చుట్టుకుంటుందని పండితులు ఘంటాపథంగా చెబుతున్నారు.గోర్లే కదా అనుకోవద్దనేది వారి మంచి మాట.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites