Gentleman : పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో టాలీవుడ్ యాక్షన్ కింగ్ హీరో అర్జున్ సర్జ మంచి దిట్టని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హీరో అర్జున్ సర్జ స్వతహాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటుడు కాకపోయినప్పటికీ టాలీవుడ్లోనే ఎక్కువ చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అయితే నటుడు అర్జున్ ఈ మధ్య కాలంలో కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ ఓరియెంటెడ్ పాత్రలో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో అర్జున్ పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించడంతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు.
అయితే తెలుగులో 1985వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన మా పల్లెలో గోపాలుడు అనే చిత్రం ద్వారా నటుడు అర్జున్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేకుండా వరుస అవకాశాలతో కొంతకాలం పాటు బాగానే రాణించాడు. ఈ సమయంలో కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కొంతమేర ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా కొన్ని చిత్రాలకు సహనిర్మాతగా కూడా వ్యవహరించి ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన అర్జున్ ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అర్జున్ కి జెంటిల్మెన్ చిత్రం బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగేలా ప్రోత్సహించింది.
అయితే జెంటిల్ మెన్ చిత్రంలో నటించే అవకాశం హీరో అర్జున్ కి ఎలా వచ్చిందనే విషయం వెనుక పెద్ద కథే ఉంది. కాగా హీరో అర్జున్ జెంటిల్ మెన్ చిత్రంలో నటించక ముందు ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడేవాడట. ఈ క్రమంలో కొంతకాలంపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఒంటరిగా గడిపాడట. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు శంకర్ జెంటిల్ మెన్ చిత్ర కథని అర్జున్ కి చెప్పడానికి ఇంటికి వెళితే తాను ప్రస్తుతం సినిమాల్లో నటించే పరిస్థితిలో లేనని అలాగే కథలను కూడా వినబోవడం లేదని కాబట్టి వేరే ఇంకెవరైనా హీరోని చూసుకోమని శంకర్ ని తన ఇంటి గేటులో నుంచి బయటికి పంపించాడట. కానీ శంకర్ మాత్రం వినుకుండా రెండు, మూడుసార్లు హీరో అర్జున్ కి కథ చెప్పడం కోసం ఇంటి ముందే వెయిట్ చేశాడట. దాంతో అర్జున్ డైరెక్టర్ శంకర్ పట్టుదలను చూసి ఇంటికి పిలిచి మాట్లాడాడట. అయితే కథ వినే ముందు ముందుగా తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తానని లేకపోతే నటించనని మొహం మీదే చెప్పేశాడట.
అయినప్పటికీ శంకర్ ఏమాత్రం జంకకుండా ధైర్యంగా జెంటిల్ మెన్ కథ చెప్పడంతో పూర్తి కథ విన్న అర్జున్ వెంటనే ఓకే చేశాడట. దీంతో ఈ చిత్రాన్ని 1993వ సంవత్సరంలోని జూలై 30వ తారీఖున తెలుగు తమిళం కన్నడ తదితర భాషలలో విడుదల చేయగా సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్రంలో నటించడం ద్వారా వచ్చిన డబ్బులతో హీరో అర్జున్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయట. పేదరికంలో ఉన్నటువంటి ఓ యువకుడు చదువు ని కొనలేక దొంగగా మారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడనే అంశాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం కోసం పని చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ మరియు దర్శకుడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ తదితరులకు ఫిల్మ్ అవార్డ్స్ లభించాయి.