మెగాస్టార్ చిరంజీవి పెళ్ళికి రాకపోతే ఆ నటి కొడుకు తాళి కట్టనని అన్నాడు… దాంతో…

1426
shiva-parvati-about-megastar-chiranjeevi-marriage-incident
shiva-parvati-about-megastar-chiranjeevi-marriage-incident

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 30కి పైగా సంవత్సరాలుగా పలు చిత్రాలలో మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివ పార్వతి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే మొదటిగా నటి శివ పార్వతి తెలుగు ప్రముఖ సినీ రచయిత మరియు దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన సర్ప యాగం అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో కనిపించింది. దీంతో అప్పటి నుంచి నటి శివ పార్వతి కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించే అవకాశాలు మాత్రమే వరించాయి.

కాగా నటి శివ పార్వతి దాదాపుగా 250 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది. అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి శివ పార్వతి పాల్గొని తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా తాను 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినిమాల్లో నటించడం ప్రారంభించానని తెలిపింది. ఈ క్రమంలో తనకు మొదటగా హీరోయిన్ గా నటించే అవకాశాలు వరించాయని కానీ పలు కారణాల వల్ల ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయానని చెప్పుకొచ్చింది.. అయితే తాను హీరోయిన్ గా నటించే అవకాశాలను మిస్ చేసుకున్నందుకు అస్సలు బాధ పడటంలేదని అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకున్నానని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఇప్పటి వరకూ తాను నటించిన పాత్రలతో ఎంతో సంతృప్తికరంగా ఉన్నానని పేర్కొంది.

చిరంజీవి
చిరంజీవి

అయితే తనకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం మరియు అభిమానమని తెలిపింది. అంతేకాకుండా తన ఇంట్లోవాళ్ళు కూడా మెగాస్టార్ చిరంజీవి కి పెద్ద ఫ్యాన్స్ అని దీంతో తన కొడుకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తన పెళ్ళికి రాకపోతే పెళ్లి మండపంలో వధువు మెడలో తాళి కట్టనని తెగేసి చెప్పాడని తెలిపింది. దాంతో తాను ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి తో చెప్పడంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు పెళ్లి కి రావడానికి ఒప్పుకున్నాడని అలాగే పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన సందర్భం నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుందని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

అయితే తన కెరియర్లో తాను చాలా మంది హీరో, హీరోయిన్ల కి తల్లిగా నటించానని కానీ మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా నటించాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందని తెలిపింది. దీంతో ఈ విషయం గురించి ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో చెప్పడంతో కచ్చితంగా తనతో నటించే అవకాశం వస్తే కబురు చేస్తానని చెప్పాడని స్పష్టం చేసింది. ఇక నటి శివ పార్వతి తెలుగులో ఆ మధ్య ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే మంగమ్మ గారి మనవరాలు అనే ధారావాహిక ద్వారా ప్రేక్షకులని బాగానే అలరించింది.

ప్రస్తుతం నటి శివ పార్వతి స్టార్ మా మరియు జీ తెలుగు తదితర ఛానెళ్లలో ప్రసారమయ్యే మరిన్ని ధారావాహికలలో మరియు పలు రకాల షోలు, ఈవెంట్లలో కూడా నటిస్తోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు పలు టాలీవుడ్ చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.

Previous articleRussia vs Ukraine – సంకనాకించిన బైడెన్ – 24 గంటల్లో ఏం జరగబోతుంది ?
Next articleKhaidi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం వెనుక ఇంత జరిగిందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here