చర్మంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి అయితే మీకు డయాబెటిస్ ఉండవచ్చు. ఈ దీర్ఘకాలిక వ్యాధి అయినా ఒక్కసారిగా వచ్చేయదు అది వచ్చే ముందు కొన్ని వ్యాధి లక్షణాలను చూపిస్తుంది. అలా డయాబెటిస్ విషయంలో మన చర్మంలో కనిపించే కొన్ని లక్షణాల గురించి గుర్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే డయాబెటిస్ కి చర్మానికి సంబంధం ఏమిటి అని అనుమానం రావచ్చు. రక్తంలో కొంత గ్లూకోజ్ లు ఎక్కువగా ఉంటే సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. డయాబెటిస్ ఉన్న వారిలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సూక్ష్మ క్రిములతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే మధుమేహం ఎక్కువగా ఉన్న వారిలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి.
డయాబెటిస్ వచ్చిందో లేదో తెలుసుకోడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిందే. అలా అని అందరూ వెళ్లాల్సిన పనిలేదు కొంతమందికి చర్మం లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులు వచ్చిన వారు వెళ్లి డాక్టర్ని కలిస్తే షుగర్ సమస్య రాకుండా చేసే అవకాశం ఉంది. ఒక్కసారి కంట్రోల్ తప్పితే మాత్రం డయాబెటిస్ సమస్య జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ముందుగానే గుర్తించి అది రాకుండా చేసుకుంటే మంచిది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం పొడిబారిపోవడం తరుచూ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా. చర్మం పొడిబారడం మొద్దుబారడం డ్రై స్కిన్ అనిపిస్తున్నా దురద ఉంటున్న స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం బొబ్బలు రావడం ఇలాంటి రొటీన్ గా కనిపిస్తూ ఉంటే ఒకసారి డాక్టర్ని కలవాలి. అంటే డయాబెటిస్ ఉండే ప్రమాదం ఉంది . చక్కెర స్థాయిని బట్టి ఇలాంటి చర్మవ్యాధులు వస్తాయి. ముందుగా షుగర్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. చర్మం మందం గా మారిన రంగుమారిన శరీరంపై అక్కడక్కడ బొబ్బలు వీటిని బ్రిస్టల్స్ అంటారు ఇలాంటివి వస్తూ ఉన్నా మీరు ఫ్రీ డయాబెటిక్ దశలో ఉండొచ్చు. ఈ దశలో మీ చర్మం సున్నితత్వాన్ని కోల్పోయి మందంగా తయారవుతుంది. అంతేకాకుండా ఎఱ్ఱని లేదా నల్లని మందపాటి ప్యాచ్లు నల్ల మచ్చలు లాగా కూడా కనిపించవచ్చు. మీ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే మోకాలు వెనక పిడికిలి బిగించే చోట మోచేతి వైపు మెడ మీద కూడా చర్మం కళావిహీనంగా మారి అనారోగ్యంగా కనిపిస్తుంది. ఈ సమయంలో కూడా డాక్టర్ని సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటిస్ రావడానికి కారణాలు ఏమిటి అంటే నిద్ర సరిగా లేకపోవడం శారీరకంగా అతిగా అలసిపోవడం కదలకుండా ఒకే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పని చేసి ఉద్యోగం చేసేవారు ఒబిసిటీ వంశపారంపర్యం పోషకాహారలోపం మీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం ఇలా ఎన్నో కారణాలతో డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. ప్యాకెట్ లో ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటున్న ఇన్స్టెంట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు షుగర్ వ్యాధి ని ఏరికోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. డాక్టర్లు సైతం చెబుతున్నారు. శరీరంలోకి ఒక్కసారి డయాబెటిస్ వస్తే చాలు సైలెంట్ కిల్లర్ శరీరంలోకి ప్రవేశించి నట్లే. అంతే సైలెంట్గా మనల్ని మృత్యువు అంచుల్లోకి తీసుకువెళుతుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వారికి మధుమేహ లక్షణాలు ఎన్నో రకాలుగా హింట్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో మన చర్మం కూడా ఒకటి. మన చర్మంలో జీవకళ తప్పితే మనకి ఏదో ఒక వ్యాధి ముంచుకొస్తున్నట్లే లెక్క. తెలిసిన వారికి ఎవరికైనా మధుమేహం వస్తే వారి ఎప్పుడైనా గతంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నా రేమో తెలుసుకోవాలి. అప్పుడు మీ అనుమానాలు అన్నీ కూడా తీరుతాయి. గాయాలు త్వరగా తగ్గకపోవడం చర్మం కోసుకున్న చోట సాధారణ స్థితికి రాకపోవడం మీ ఒంట్లో గ్లూకోజ్ నిల్వలు ఎక్కువగా ఉన్నట్లే అర్థం. చర్మం కమలాపండు తొక్కలను గరుకు గా మారితే ఏదో ఒక మాయిశ్చరైజర్ రాసి ఊరుకోవద్దు. ప్రీ డయాబెటిక్ టైప్-2 డయాబెటిక్ అండ్ డయాబెటిక్ ఉన్నవారికి ఈ చర్మ సంబంధిత సమస్యలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఉంది గాని ఈ లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ని కలిసి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.