Amrutha Pranay హత్య సమయంలో మారుతీరావు…

176

Amrutha Pranay ప్రణయ్ హత్య సమయంలో మారుతీరావు చాలా బాధ పడ్డాడట

Amrutha Pranay : 2018 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పరిసర ప్రాంతంలో జరిగిన ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అమృత అనే యువతి ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఈ విషయం అమృత ఇంట్లో కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం అలాగే వీరిద్దరి కులాలు వేరే కావడంతో అమృత తండ్రి డబ్బు కోసం హత్య చేసే వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకొని ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు. దీంతో అప్పట్లో ఈ విషయం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అమృత తండ్రి మారుతీరావు కూడా తీవ్ర పశ్చాత్తాపంతో హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా ప్రస్తుతం అమృత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన భర్త ప్రతిరూపాన్ని తన కొడుకులో చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. అంతేకాకుండా ప్రణయ్ పేరు మీదుగా అప్పుడప్పుడు పలు సహాయ కార్యక్రమాలు కూడా చేస్తోంది. అయితే ఈ విషయం జరిగి 3 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ అమృత కుటుంబ సభ్యులు మాత్రం మర్చిపోలేక పోతున్నారు. అయితే తాజాగా ఈ కేసు వివరాల గురించి అప్పట్లో నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రముఖ పోలీసు అధికారి రంగనాథ్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా ప్రణయ్ హత్య జరిగిన సమయంలో తాను కొత్తగా చార్జ్ తీసుకున్నానని అలాగే 2018 మార్చి నెలలో అమృత ప్రణయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారని తెలిపాడు. దీంతో పై అధికారుల నుంచి తనకు ఆదేశాలు రావడంతో తాను కూడా అమృత ప్రణయ్ ల ముప్పు గురించి ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో అమృత తండ్రి మారుతీరావు ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి మాట్లాడామని ఈ క్రమంలో మారుతీరావు తన కూతురిని తలుచుకుని చాలా ఎమోషనల్ అయ్యాడని తెలిపాడు. అలాగే తనకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్ళకి పుట్టిన బిడ్డ కావడంతో అమృత ని చాలా గారాబంగా పెంచామని కానీ తమ కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదని వెక్కి వెక్కి ఏడ్చాడని చెప్పుకొచ్చాడు.

Amrutha Pranay
Amrutha Pranay

Amrutha Pranay ల పెళ్లిని అంగీకరించాలని లేకపోతే

దాంతో తాము కూడా మారుతీరావు ని ఓదార్చి జరిగిందేదో జరిగిపోయిందని మీకు ఇష్టం ఉంటే అమృత ప్రణయ్ ల పెళ్లిని అంగీకరించాలని లేకపోతే వారి బ్రతుకు వారు ఎలాగో బ్రతుకుతారని కాబట్టి వాళ్ళకి ఎలాంటి హాని జరిగినా కూడా బాధ్యత తమదేనని మరియు తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి పంపించామని చెప్పుకొచ్చాడు. దీంతో మారుతీరావు కూడా తమకు తమ కూతురుపై ఎలాంటి కోపం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలిపాడు. దాంతో తాము కూడా వివాదం సర్దమణిగిందని అనుకున్నామని అయినప్పటికీ అమృత ప్రణయ్ ల కుటుంబ సభ్యులపై కన్నేసి ఉంచి గమనిస్తూనే ఉన్నామని తెలిపాడు.

ఆ తర్వాత ఏమైందో ఏమో మారుతీరావు డబ్బు కోసం హత్య చేసేటువంటి ఒప్పందం కుదుర్చుకుని ప్రణయ్ ని దారుణంగా హతమార్చారని తెలిపాడు. అలాగే ప్రణయ్ హత్య లో పాకిస్థాన్ దేశంలోని ఐ.ఎస్.ఐ తీవ్ర వాదులతో సంబంధాలు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పాల్గొన్నారని దాంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారని తెలిపాడు. అయితే ఈ హత్య జరిగిన తర్వాత మారుతీరావు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడని అలాగే పోలీసుల విచారణలో కూడా పొంతనలేని సమాధానాలు చెపుతూ తప్పించుకోవచ్చని ప్రవర్తించాడని ఎస్పీ రంగనాథ్ తెలిపాడు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లు ప్రణయ్ హత్యకి పన్నాగం పన్నిన అందరూ కూడా ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నారని తెలిపాడు.

If you like our article about Amrutha Pranay

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleMarriage with friend’s wife స్నేహితుడు మరణించాడని….
Next articleModi డబ్బులిచ్చాడనుకుని ఇల్లు కట్టుకున్నాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here