మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో షాకింగ్ నిజాలు

120
srinivas goud
srinivas goud

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కోణం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. నిందితుల భయానికి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ వెళ్ళి ఒక సెక్యూర్డ్ ప్రాంతంలో ఉన్నారు. నిందితులందరినీ అరెస్ట్ చేసిన తర్వాతే ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఎదురైంది. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటన పై సీఎం కేసీఆర్ సీరియెస్ అయ్యారు. దీంతో అత్యవసరంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ అరడజను మంది పోలీసుల భద్రత మధ్య ఉండే మంత్రి హత్యకు కుట్ర పన్నారంటే పెద్ద విషయమని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. పోలీసులు వ్యూహాత్మకంగా ఈ మర్డర్ స్కెచ్ ను భగ్నం చేయడంతో పెను ముప్పు తప్పిందని పోలీసు వర్గాలంటున్నాయి. అసలు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన వారి గురించి స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు.

ఫిబ్రవరి 23, 2022న పేట్ బషీర్ బాద్ లోని సుచిత్ర లాడ్జ్ లో ఫరూక్, హైదర్ ఆలీ అనే వ్యక్తులు దిగారు. వీళ్లిద్దరూ పలు కేసుల్లో నిందితులని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ హోటల్ లో దిగిన తర్వాత కొంత మంది వారిని చంపడానికి కాపుకాశారు. సాయంత్రం టీ తాగుదామని కిందకు వచ్చిన సమక్షంలో గుంపుగా తమవైపు వస్తున్న వారిని చూసి తమనే చంపడానికి వస్తున్నారని గుర్తించి పరుగులు పెట్టారు. వారిని మారణాయుధాలతో వెంబడించినా ఫరూక్, హైదరాలీలు తప్పించుకున్నారు. అదే రోజు తమను కాపాడాలని పేట్ బషీర్ బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి నాగరాజు అనే కీలక నిందితుడితో పాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

srinivas goud
srinivas goud

నాగరాజు అనే వ్యక్తి తాము మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపేందుకు కుట్రపన్నామని పోలీసులకు తెలపడంతో డొంకంతా కదిలింది. మహబూబ్ నగర్ కు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, ఆయన సోదరుడు రాఘవేంద్రరాజు, మధుసూదన్ రాజు, నాగాజు, మున్నూరు రవిలు మంత్రిని చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఎప్పుడైతే నాగరాజు తో పాటు తమ అనుచరులు అరెస్ట్ అయ్యారో అమరేందర్ రాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్ రాజు, నాగరాజులు మొదట విశాఖపట్నం పారిపోయారు. అటు నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపా, పీఏ రాజుల క్వార్టర్స్ లో తలదాచుకున్నారు. ఫోన్ డేటాతో పాటు సిగ్నల్స్ ఆధారంగా నిందితులంతా ఢిల్లీలోని జితేందర్ రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ తాపా ఇంట్లో ఉన్నారని గుర్తించారు. వెంటనే రాత్రి సమయంలో హైదరాబాద్ పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. అయితే జితేందర్ రెడ్డి అనుచరులను ఎవరో కిడ్నాప్ చేశారనే వార్త ఢిల్లీలో సంచలనం స్రుష్టించి. సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ వార్త మీడియాలో వచ్చిన తర్వాత సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికే అక్కడ కేసు నమోదై, విచారణ కూడా మొదలు పెట్టారు పోలీసులు.

ఇక నిందితుల నుంచి రెండు తుపాకులు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమరేందర్ రాజు, నాగరాజు, రాఘవేంద్ర రాజు, మదుసూదన్ రాజు తో పాటు మున్నూరు రవి కూడా మంత్రిని చంపేందుకు కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ నేత మున్నూరు రవి అసలు మంత్రిని ఎందుకు చంపాలనుకున్నాడనేది పోలీసులను కూడా వేదిస్తున్న ప్రశ్న. ఎందుకంటే అతను ఉద్యమకారుడిగా మహబూబ్ నగర్ లో చాలా ఫేమస్. అలాంటిది మంత్రికి అతనికి ఎలాంటి శత్రుత్వం ఉందనేది పోలీసులు విచారిస్తున్నారు.

ఇక ఈ మంత్రి హత్య కేసుకు ట్విస్ట్ ఇచ్చింది హైదరాలి. ఇతను జంట హత్యల కేసులో నిందితుడు. అసలీ వ్యవహారం బయటకు రావడానికి కారణమైన వ్యక్తి ఫరూక్. ఇతనికే నిందితులంతా మంత్రిని చంపితే 15 కోట్ల డబ్బు కానీ అంతే విలువైన భూమి కాని ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. అతను కూడా మంత్రిని చంపేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, పని అయ్యే వరకు చాలా రహస్యంగా ఉంచాలని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ ఫరూక్ మాత్రం తన క్లోజ్ ఫ్రెండ్ హైదరాలికి విషయం చెప్పాడు. అంతే కాదు ఈ హైదరాలికి మంత్రితో పాటు ఇతర నాయకులతో పరిచయాలున్నాయి. దీంతో మన విషయం బయటపడుతుందని నాగరాజు భయపడ్డాడు. అసలు మంత్రిని చంపాలనే ప్లాన్ బయటకు తెలియొద్దంటే ఫరూక్ ను, హైదరాబాలిని చంపాలని నాగరాజు తన అనుచరులను పంపాడు. ఇద్దరినీ చంపేందుకు పక్కా ప్లాన్ వేసి సుచిత్ర లోని లాడ్జ్ లో దిగినట్లు గుర్తించారు. కానీ గుంపుగా వచ్చి వారి కంటపడడటంతో ఇద్దరూ పారిపోయారు. తమను చంపేందుకు కుట్ర చేశారని పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నాగరాజు చిక్కాడు. అలా ఒకదానికొకటి లింక్ లు ఉన్నాయని సీపీ మీడియాకు చెప్పారు.

అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎందుకు చంపాలనుకున్నారనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అంతే కాదు ఫరూక్, హైదరాలీలపై పలు కేసులున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మంత్రి హత్య కుట్ర వెనుక భూ తగాదాలున్నాయా లేదంటే రాజకీయ కుట్రలు ఉన్నాయా అనేది పోలీసులు విచారిస్తున్నారు. అందుకోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపా, పీఏ రాజులకు నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక తమపై కుట్రలో రాజకీయ కోణం ఉందని డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ను ట్యాంపర్ చేశారని కొంత మంది యువకులు కోర్టులో కేసు వేశారు. అది రుజువైతే శ్రీనివాస్ గౌడ్ ఎమ్ఎల్ఏ పదవితో పాటు మంత్రి పోస్టు కూడా పోతుంది. తన మీద ఫిర్యాదు చేశారనే కక్ష్యతో ఇప్పుడు హత్యాయత్నం కేసు బయటకు తెచ్చారని జితేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ ద్వారా శ్రీనివాస్ రెడ్డి తప్పులను బయటకు తెచ్చారనే కుట్ర చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు జితేందర్ రెడ్డి. పోలీసులు చట్టాన్ని కాపాడుతారా? లేదంటే శ్రీనివాస్ రెడ్డి అరాచకాలకు వంత పాడతారా అంటూ ప్రశ్నించారాయన. మరి ఈ కేసు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ కేసు కాకపుట్టిస్తోంది.

 

Previous articleGentleman : కథ చెబుదామని ఇంటికి వెళితే డైరెక్టర్ ని తిట్టిన హీరో… చివరికి…
Next articleNato అంటే ఏమిటి ? రష్యాకు ఎందుకు నాటో అంటే కోపం?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here