సమ్మర్ లో హెల్దీ ఫన్ గేమ్స్ ఇలా ఉండాలి!

147
Summer enjoyment
Summer enjoyment

Summer enjoyment : సమ్మర్ వచ్చిందంటే చాలు…పిల్లలకు ఎక్కడా లేని ఆనందంగా ఉంటుంది. కానీ ఆఆనందం ఎక్కువ సేపు ఉండటం లేదు. మనసుకు ఆనందం కలిగించే ఆటలు ఆడుతున్నారు. కానీ శారీరక ఆటలు ఆడటం లేదు. దీనికి కారణం పెరిగిన టెక్నాలజీ. అందరికీ అందుబాటులో ఫోన్ లు, కంప్యూటర్లు, ట్యాబ్ లు ఉండటంతో వాటితోనే ఎక్కువ సమయం గుడుపుతున్నారు. దీంతో కంటి చూపు సమస్యలతో పాటు, తలనొప్పి, ఊబకాయం వస్తున్నాయి. కొద్దిదూరం నడిచినా ఆయాసం వచ్చి నీరసించి పోతారు. మరికొంత మంది ఇంట్లో బాగానే ఎగురుతారు. కానీ ఫోన్ ల కారణంగా ఆయా గేమ్స్ ను చూసి పిచ్చి పిచ్చిగా తమలో తామే మాట్లాడుకుని అరుస్తుంటారు. ఇవన్నీ పోవాలంటే సింపుల్. ఎండాకాలంలో నైనా దొరికిన కాస్త సమయాన్ని వారి శారీరక, మానసిక ఆనందం కలిగే గేమ్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న పనులను, అది కూడా ఆసక్తి కలిగించే పనులను సరదాగా ఆట ఆడినట్లుగా నేర్పించాలి. దీంతో వారు చాలా ఇష్టంగా చెప్పిన మాట వింటారు. అంతే కానీ అది చెయ్, ఇది చెయ్యమంటే మాత్రం వినరు. కాబట్టి హాయిగొలిపే అలాంటి ఫన్నీ హెల్దీ గేమ్స్ కి ఈ సెలవులను వాడుకోవాలి. అది కూడా పైసా ఖర్చు కాకుండానే పిల్లలకు పసందైన సంతోషాన్ని కలిగించొచ్చు.

ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని లేకుండా ఉన్నప్పుడు ఒక్క సారి ఫోన్ లను, ఇతరత్రా గాడ్జెట్స్ ని పూర్తిగా పక్కన పడేసి ఏదైనా పార్క్ కి తీసుకెళ్లాలి. అక్కడే వారితో పాటు ఆహ్లాదంగా చెట్లు బాగా ఉన్నచోటిలో వారితో ఆడుతూ, పాడుతూ చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. రన్నింగ్ అంటే ఎవరైనా ఇష్టపడతారు. వారిని పరిగెత్తించి, అలసిపోయేలా చేయాలి. పచ్చని చెట్ల మధ్య, గడ్డి మీద కింద పడి దొర్లినా వారికి ఆనందంగానే ఉంటుంది.

Summer enjoyment
Summer enjoyment

ఏదైనా గ్రీనరీ బాగా ఉన్న టూరిజం ప్లేస్ లకు తీసుకెళ్లాలి. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు అనారోగ్యానికి గురికారు. అక్కడ రకరకాల చెట్లు, పూల గురించి, ఆయా ప్రాంతాల్లో దొరికే వాటిని చూపించాలి. అవి పండ్లైనా, ఇతర వస్తువులైనా పిల్లలకు అర్దమయ్యేలా చెబితే మంచి జ్ఞానం కూడా వస్తుంది.

అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం….రైతు బజార్ కు తీసుకెళ్లడం. అక్కడ రైతులు పండించే కూరగాయలు గురించి చెప్పడంతో పాటు అవి ఎలా పండుతాయో కూడా చెప్పాలి. లేదంటే పండ్లు తినడమే కానీ అవి ఎలా పండుతాయో తెలియకుండానే బతికేస్తున్నారు. ఇక ఏదైనా పంటలు పండే ఫీల్డ్ కు తీసుకెళ్తే ఇంకా చాలా మంచిది. కూరగాయల సాగు, పండ్ల సాగు ఎలా చేస్తున్నారో చెబితే ఆసక్తికరంగా వింటారు.

ఇక స్విమ్మింగ్ అన్నింటికంటే చాలా హెల్దీ యాక్టివిటీ. మంచి వాటర్ ఉన్న పూల్ కి తీసుకెళ్లి స్విమ్మింగ్ నేర్పించడం ప్రతి ఒక్కరు చేయాలి. ఎప్పుడైనా సరే ఈత అవసరం రావొచ్చు. దీనిని ఒక సరదా ఆటలా కాకుండా సీరియెస్ గా పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడు ఎలా నీటితో మనకు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే చిన్నప్పుడే సరదాగా ఈత నేర్పితే…ఇటు ఆటగాను, అటు అత్యవసర సమయాల్లో తన ప్రాణాలతో పాటు ఇతరులను రక్షించే అవకాశం ఉంటుంది.

వంట చేసే సమయాల్లో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. దాని కారణంగా చిన్నప్పటి నుండే వారికి వంట పట్ల ఆసక్తి కలుగుతుంది. చేసి పెడితే తినడం మాత్రమే తెలిస్తే అవసర సమయాల్లో కూడా బయట తినాల్సి వస్తుంది. ఇటు అమ్మకు సాయం చేసినట్లుగాను, కిచెన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేర్పించాలి. గ్యాస్ దగ్గర్నుండి మంట, షార్ప్ గా ఉండే నైవ్స్ వరకు అన్నింటిపై అవగాహన కల్పించాలి. ఎప్పుడైనా చాకు తెగినా, కాలినా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేర్పించాలి. దానితో పాటు ఆరోగ్యానికి ఏవి మంచివి, ఏడు చెడును చేస్తాయనేది కిచెన్ లో కూర్చొబెట్టి చెబుతూ వారికి చిన్న చిన్న పనులను చెబుతుండాలి.

పిల్లలను అప్పుడప్పుడు జిమ్ కి తీసుకెళ్లాలి. అక్కడ ఉండే వాటితో ఏం చేస్తారు. ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో చెప్పాలి. బాడీకి శారీరక శ్రమ లేకుండా అనారోగ్యం పాలవుతారో చెప్పి, జాగింగ్ కి తీసుకెళ్లాలి. ఇది కూడా ఒక హెల్దీ ఆట మాదిరిగా అలవాటు చేస్తే తరువాత మరింత ఆరోగ్యవంతులవుతారు.

కొంత మంది పిల్లలకు కొన్నింటి మీద ఆసక్తి ఉంటుంది. వారి ఇంట్రెస్ట్ ని గమనించి వాళ్లను డ్యాన్స్, స్పోర్ట్స్, డ్రాయింగ్ వంటి వాటిని నేర్పించాలి. సమ్మర్ లో చిన్నగా మొదలైనా వాళ్లు పెద్దయ్యాక వాటినే ప్రొఫెషన్ గా ఎంచుకుని పేరు ప్రఖ్యాతలు గడించొచ్చు. ఇవి కాకుండా పిక్ నిక్ టూర్స్, వాటర్ బాల్ గేమ్స్, జంపింగ్ రోప్స్ లాంటివి పార్కుల్లో ఆడించొచ్చు. ఇక జంతువులను కూడా దగ్గర్నుండి చూస్తే పిల్లలు ఎంతో సంతోషపడతారు. జూలో వాటి పుట్టుక, పెరుగుదల గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే క్లీనింగ్ పోటీ కూడా పెట్టొచ్చు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి. ఎంత శుబ్రంగా ఉండాలో కూడా నేర్పించొచ్చు. దగ్గర్లోని లైబ్రరీకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలతో పాటు కిడ్స్ స్టోరీ బుక్స్ ని కూడా చదివించాలి. చదవడం, చదివించడం అలవాటు చేస్తే వారి జీవితాన్నే మార్చొచ్చు. మామూలుగా స్కూల్లో చదివే కాకుండా ఇతరత్రా పుస్తకాలు చదివితె ఎలాంటి లాభం కలుగుతుందో చెప్పొచ్చు. ఇలా పెద్దగా దూరం వెళ్లకుండా చిన్న చిన్న పనులతో వారికి మానసిక, శారీరక ఆనందాన్ని కలిగించొచ్చు. అయితే ఆయా పనులను చేసేటప్పుడు మాత్రం గాడ్జెట్స్ ని పూర్తిగా పక్కన పెట్టాలి. లేదంటే ఏపని కూడా పూర్తిగా చేసినట్లుగా ఉండదు.

Previous articleNuvvu naku nachhav చిత్రంలో హీరో ఛాన్స్ మిస్ అయిన తెలుగు హీరో… ప్రస్తుతం అవకాశాల్లేక…
Next articleటాయిలెట్స్ లో ఏది మంచిది? ఇండియాన? వెస్టర్నా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here