Yamaleela : మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని కమెడియన్ తో తెరకెక్కించి హిట్ కొట్టిన డైరెక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి…

701

Yamaleela : టాలీవుడ్ లో 1994వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా తెలుగు ప్రముఖ కమెడియన్ మరియు హీరో ఆలీ నటించగా హీరోయిన్ గా టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ ఇంద్రజ నటించింది. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, మంజు భార్గవి, స్వర్గీయ నటులు ఏవీఎస్, గుండు హనుమంతరావు, సాక్షి రంగారావు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రంలో సిరులొలికించె చిన్ని నవ్వులే అనే పాట ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సాంగ్స్ లిస్టు లో ఉంటుంది. కాగా ఈ చిత్రానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతాన్ని కూడా అందించగా తెలుగు ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు.

అప్పట్లో మంచి హిట్ అయినటువంటి ఈ యమలీల చిత్రాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మొదటిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడట. ఈ క్రమంలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ని కలసి యమలీల కథ ని కూడా చెప్పాడట. కానీ యమలీల సినిమా తీసిన సమయంలో మహేష్ బాబు చదువుకుంటున్నాడని అలాగే మహేష్ బాబు తో సినిమా తీయాలంటే మరో ఐదు సంవత్సరాలు పడుతుందని చెప్పాడట. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. దాంతో ఎస్వీ కృష్ణారెడ్డి ఈ యమలీల చిత్రాన్ని కమెడియన్ మరియు హీరో ఆలీతో తెరకెక్కించాలని నిర్ణయం తీసుకొని అనుకున్నదే తడవుగా సూపర్ స్టార్ కృష్ణ కి చెప్పడంతో వెంటనే ఒప్పుకున్నాడట.

దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కె.అచ్చిరెడ్డి కూడా ఒప్పుకోవడంతో ఆలీతో యమలీల చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే యమలీల చిత్రాన్ని తెరకెక్కించిన సమయంలో ఆలీకి పెద్దగా ఫేమ్ లేకపోవడంతో మొదట్లో కొంత మంది అభ్యంతరాలు తెలిపిన ప్పటికీ ఎస్వీ కృష్ణారెడ్డి మాత్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు తన కథపై పూర్తి నమ్మకం ఉందని చెప్పాడట. అయితే యమలీల చిత్రం తెరకెక్కించిన సమయంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అప్పటికే మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, తదితర చిత్రాల వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే కథ ను నమ్మి సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల చిత్రం ద్వారా నిరూపించాడు.

కాగా యమలీల చిత్రం కోసం అప్పట్లోనే దాదాపుగా 75 లక్షల రూపాయలు బడ్జెట్ వెచ్చించారు. కానీ ఈ చిత్రం దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. అంతేకాకుండా నైజాం, సీడెడ్, ఆంధ్ర తదితర ప్రాంతాలలోని పలు థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. అయితే యమలీల చిత్రాన్ని తెరకెక్కించిన 20 సంవత్సరాల తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ 2014వ సంవత్సరంలో యమలీల 2 చిత్రాన్ని తీశాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కొంతమేర సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

Previous articleSurekhavani : నటి సురేఖ వాణి జీవితంలో ఇంత విషాదం దాగుందా…?
Next articleSrihari : నటుడు శ్రీహరి ఆ కారణాల వల్లే మరణించాడా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here