Samantha : అప్పట్లో ఆ హీరో ని పెళ్లి చేసుకుని ఉంటే సమంత జీవితం కూడా ఆ హీరోయిన్ లా….

451

Samantha : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలియనివారుండరు. అయితే నటి సమంత స్వతహాగా మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ ఈ అమ్మడు తెలుగులోనే ఎక్కువ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే నటి సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల విషయంలో కొంతమేర చతికిలపడినప్పటికీ క్రమక్రమంగా వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు తగ్గించుకొని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్నటువంటి ఐదుగురు టాప్ హీరోయిన్ల లిస్టులో కొనసాగుతోంది.

సినీ జీవితం పరంగా నటి సమంత రూత్ ప్రభు చాలా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కానీ తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా పెద్దగా సంతృప్తి పొందలేకపోతుంది. కాగా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. దాంతో అప్పటి నుంచి సమంత సోషల్ మీడియా మరియు మీడియాకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తుంది కూడా.

అయితే కొంతమంది సమంత నెగిటివ్ అభిమానులు ఈ మధ్యకాలంలో గతంలో సమంత ప్రేమాయణాల విషయం గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అప్పట్లో నటి సమంత కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో లవ్ ఎఫైర్ పెట్టుకుందని దీంతో తొందరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో పలు కథనాలు బలంగా వినిపించాయి. కానీ అనుకోకుండా బ్రేకప్ జరగడంతో ఈ పెళ్లి కాస్తా పెటాకులయింది. దీంతో ఈ విషయం గురించి ఆమధ్య సమంత కూడా ఇంటర్వ్యూలో స్పందిస్తూ తాను తన ప్రేమ జీవితంలో మొదటిసారి ఫెయిల్ అవ్వడమే మంచిదయిందని లేకపోతే తన జీవితం కూడా ప్రముఖ స్వర్గీయ నటి సావిత్రి జీవితం మాదిరిగానే ముగిసిపోయేదని పరోక్షంగా కామెంట్లు చేసింది.

ఈ విషయం ఎప్పుడో జరిగిపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో కొందరు సమంత వ్యక్తిగత విషయాలను తవ్వుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మహానటి సావిత్రి సినీ జీవితంలో మంచి విజయం సాధించిందని కానీ తన వైవాహిక జీవితంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని కానీ సమంత విషయంలో మాత్రం అలా జరగలేదని చర్చించుకుంటున్నారు. దీనికితోడు ఇప్పటివరకు సమంత తన భర్త అక్కినేని నాగచైతన్యతో ఎందుకు విడాకులు తీసుకున్నదనే విషయంపై సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది కాగా ఆ మధ్య గోవాలో బీచ్ లో బికినీ దుస్తులు ధరించిన సమయంలో తీసినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా సమంత అభిమానులు అవాక్కయ్యారు. కాగా ఈ హాలిడే ట్రిప్ పూర్తయిన తర్వాత సమంత తన తదుపరి చిత్రం షూటింగులో పాల్గొన్నట్లు సమాచారం.

Previous articleMahesh Achanta : అందుకే అన్నిసార్లు పిలిచినా బిగ్ బాస్ షో కి వెళ్ళలేదు…
Next articleRaveena Tandon : తమ్ముడితోనే అఫైర్ పెట్టుకుందంటూ హీరోయిన్ గురించి ప్రచారం.. కానీ నిజమేమిటంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here