Achyuth అంతటి ధీన పరిస్థితుల్లో మరణించాడా….?

519

Achyuth అంతటి ధీన పరిస్థితుల్లో మరణించాడా….?

Achyuth : కొంతమంది నటీనటులకు నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ఉపయోగించుకోకుండా అనవసరంగా ఇతర వ్యాపారాలను చేసి నష్టపోయి కెరీర్ తో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న నటీనటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ స్వర్గీయ నటుడు అచ్యుత్ చక్రి కూడా ఈ కోవకే చెందుతారు. నటుడు అచ్యుత్ తెలుగులో ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రంలో హీరో అన్నయ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో బాక్సింగ్ ప్లేయర్ గా కనిపించడంతోపాటు చక్రి పాత్రకి కూడా మంచి స్కోప్ ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆఫర్లు కూడా బాగానే వరించాయి.

ఇక అప్పటి నుంచి నటుడు అచ్యుత్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు నుంచి కూడా అవకాశాల విషయంలో సహాయ సహకారాలు అందించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వంటి స్టార్ హీరోలు కూడా అచ్యుత్ కి అవకాశాల విషయంలో బాగానే సహాయం చేసేవారు. అందువల్లనే మెగాస్టార్ చిరంజీవి తను హీరోగా నటించిన “డాడీ” చిత్రంలో దర్శకుడికి చెప్పి అచ్యుత్ ని తన చిత్రంలో నటింపజేయించాడు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా పలు చిత్రాలలో రికమెండ్ చేశాడు.

అంతా చక్కగా సాగిపోతున్న సమయంలో నటుడు అచ్యుత్ కి వ్యాపారంపై దృష్టి మళ్ళింది. దీంతో తన వద్ద పెద్దగా డబ్బు లేకపోయినప్పటికీ ఇతరుల నుంచి దాదాపుగా కోటి రూపాయలకు పైగా అప్పు చేసి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తనకి పార్ట్నర్స్ గా కొందరి స్నేహితులను నమ్మి తనకి పార్ట్నర్స్ గా నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా వ్యాపార బాధ్యతలను సైతం పూర్తిగా తన స్నేహితులపైనే గుడ్డిగా నమ్మి వదిలి పెట్టాడు. దీంతో అచ్యుత్ స్నేహితులు మాత్రం లాభాలు వచ్చిన సమయంలో జోబులో వేసుకొని నష్టాలు వచ్చినట్లు దొంగ లెక్కలు చూపించారు. దీంతో వ్యాపారం నిండా మునిగి పోయింది. ఈ క్రమంలోనే నటుడు అర్జున్ కి పలు ఆరోగ్య పరమైన సమస్యలు కూడా తలెత్తాయి.

Achyuth
Achyuth

దీంతో నమ్మిన స్నేహితులు పూర్తిగా చేతులెత్తేశారు. సరిగ్గా అదే సమయంలోనే నటుడు అచ్యుత్ తన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఒకపక్క మరియు అనారోగ్యకరమైన సమస్యలు మరోపక్క వెంటాడడంతో సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా దృష్టి సారించ లేకపోయాడు. ఈ క్రమంలో చేతిదాకా వచ్చిన అవకాశాలను కూడా వదిలేసుకున్నాడు. అలాగే ఒకానొక సమయంలో తన కుటుంబ సభ్యుల నుంచి కూడా అండదండలు లభించకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువై ఆసుపత్రిలో పడ్డాడు. ఈ క్రమంలో కుటుంభ సభ్యులు కూడా చూడటానికి రాక చివరి రోజుల్లో ఎంతగానో కుమిలిపోయాడు. అంతేగాక తన వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేక చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.

దీంతో 2002వ సంవత్సరంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. అయితే స్వర్గీయ నటుడు అచ్యుత్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులలో తెలుగు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఒకరు. ఆ మధ్య నటుడు కాదంబరి కిరణ్ కు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు కాదంబరి కిరణ్ అచ్యుత్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో నటుడు అచ్యుత్ కేవలం తన స్నేహితులు చేసిన మోసం వల్లే మరణించాడని ఎమోషనల్ అయ్యాడు. ఏది ఏమైనప్పటికీ నటుడు అచ్యుత్ మాత్రం నటుడిగా తనకు ఉన్నటువంటి ప్రతిభను వినియోగించకుండా లేనిపోని ఆశలతో వ్యాపారం వైపు వెళ్లి ప్రాణాలను పోగొట్టుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

If you like our article about Achyuth

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articlePellikuturu టాయిలెట్ కి వెళ్ళొస్తానని అటే జంప్
Next articleNimma aku ఉపయోగాలు తెలిస్తే అసలు వదలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here