SriDevi : నటి శ్రీదేవి కి ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లి జరగాల్సిందట… కానీ…

615

SriDevi : తెలుగు, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలలో హీరోయిన్ నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటి మరియు మాజీ “విశ్వసుందరి శ్రీదేవి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అయితే నటి శ్రీదేవి భౌతికంగా తెలుగు సినీ ప్రేక్షకుల మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె నటించిన చిత్రాలు ఇప్పటికీ బాగానే అలరిస్తున్నాయి. అయితే నటి శ్రీదేవి 1978వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ సీనియర్ దర్శకుడు “కె.రాఘవేంద్రరావు” దర్శకత్వం వహించిన “పదహారేళ్ళ వయసు” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత సీనియర్ హీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే నటి శ్రీదేవి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి దేశ వ్యాప్తంగా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

నటి శ్రీదేవి బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ ని 1996వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత నటి శ్రీదేవి సినిమాలపై పెద్దగా దృష్టి సారించలేదు. దీనికితోడు కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో పడటంతో అడపాదడపా చిత్రాలలో నటించినప్పటికీ పెళ్లయిన తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. అయితే అప్పట్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందని కానీ ఆ హీరో పెళ్లికి నిరాకరించడంతో నటి శ్రీదేవి బోనికపూర్ పెళ్లి చేసుకుందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. అయితే శ్రీ దేవి ని పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో ఎవరో కాదు తెలుగు ప్రముఖ స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్. కాగా నటుడు రాజశేఖర్ ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని శ్రీ దేవి తనను పెళ్లి చేసుకోవాలని వినిపించిన వార్తలపై స్పందించారు.

ఇందులో భాగంగా చిన్నప్పటి నుంచి నటి శ్రీ దేవి కుటుంబ సభ్యులతో తన కుటుంబ సభ్యులకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దాంతో శ్రీదేవి తల్లికి తనంటే చాలా అభిమానమని అందువల్లనే తన కూతురు శ్రీదేవి ని పెళ్లి చేసుకోమని పలుమార్లు అడిగిందని తెలిపాడు. కానీ తాను అప్పటికే ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్నానని అలాగే శ్రీదేవి కూడా అప్పటికే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉందని ఇలాంటి సమయంలో ఆమెను పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ కెరియర్ పరంగా సమస్యలు వస్తాయని ఆలోచించి శ్రీ దేవి ని తాను పెళ్లి చేసుకోలేనని చెప్పాడట. ఆ తర్వాత శ్రీ దేవి బోని కపూర్ ను పెళ్లి చేసుకుందని అలాగే తను కూడా దర్శకురాలు మరియు హీరోయిన్ నటి జీవితను పెళ్లి చేసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటుడు రాజశేఖర్ తెలుగులో “శేఖర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు “లలిత్” దర్శకత్వం వహించగా నూతన నటీనటులు ఆత్మీయ రాజన్, ముస్కాన్ చాందిని అభినవ్ గౌతమ్ కిషోర్ సర్ మీరు రవి వర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రం వచ్చే నెల 15వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Previous articleRamesh Babu : ఇక నేను సినిమాలు చేయను అనే కఠిన నిర్ణయం వెనుక ఇంత ఉందా
Next articleNandini Rai : ఈ తెలుగు బ్యూటీ కి అన్నీ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here