పిచ్చి మొక్కలా కనిపించే ఇది ప్రాణాలను రక్షించే ఔషధం

210

ఈరోజు మనం అనేక రోగాలను చాలా తేలికగా నివారించి అతిబల మొక్క యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. దీని పేరు లోనే ఉంది కదా అతిబల. అధికంగా బలాన్నిచ్చే మోక్కే అతిబల. దీనిని సంస్కృతంలో అతిబల అంటారు తెలుగులో అయితే చాలా మంది ముద్ర బెండ అంటారు. ఎక్కువగా పల్లెటూర్లలో రోడ్ల పక్కన ఈ మొక్క ని చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టు సుమారు 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు చాలా బలంగా పైకి పెరుగుతుంది. దీనికి పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి. నీళ్లు ఎక్కువగా పారే కాలువల పక్కన పంట చేల పక్కన బాగా పెరుగుతుంది. చూడడానికి ఏదో పిచ్చి మొక్క అని చాలామంది అనుకుంటారు కానీ ఈ మొక్కలు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క ఆకులని కాయలని పువ్వులని అనేక రోగాల నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు.

వీటి ఆకులు విషయానికి వస్తే అవి హృదయాకారంలోను వాటి పువ్వులు పసుపు రంగులోను ఇక కాయలు మామూలు వస్తే ఒక చిన్న గిన్నె ఆకారంలో ఉండి పైభాగంలో ఒక చక్రం లాగా కనిపిస్తుంది. చాలా మంది పిల్లలు వీటితో ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే దీనికి కాయలు కనుక చూస్తే దువ్వేన ఆకారం లో ఉంటాయి. అందుకే వీటిని దువ్వెన బెండ అని పిలుస్తారు . పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఈ మొక్క యొక్క ఉపయోగాలు గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ మొక్క ఆకులు అనేవి చూడటానికి జిగటగా ఉంటాయి కానీ ఇది మన శరీరంలో వేడిని తగ్గించి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు తోసి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. అలాగే మన శరీరంలో గాయాలకి కానీ వ్రణాలకి కానీ ఈ ఆకులని పసరు లాగా రాసి పెడితే ఆ గడ్డలు తొందరగా మానిపోతాయి. ఎవరికైనా మూత్రంలో మంట గా ఉంటే ఈ ఆకులను బాగా వేడి చేసి మెత్తగా చేసుకుని ఆ రసాన్ని ఆ తరువాత వడగట్టి వేడి నీటిలో కలుపుకొని కొద్దిగా కండ చక్కెర కలిపి మూడు పూటలా తీసుకుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. కిడ్నీ లో ఉన్న రాళ్ళు కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు పడిపోతాయి. కంటి చూపు సరిగా లేనివారు కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఇప్పుడు చెప్పిన ఆకులను కషాయం లాగా చేసుకుని ఆ నీటిని కళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తే కంటి లో ఉన్న దుమ్ము ధూళి పూర్తిగా పోయి కంటి చూపు పెరుగుతుంది. ఈ మొక్క ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని వడకట్టి దానిలో కొద్దిగా కండచక్కెర కలిపి ఆ నీటిని కొద్దికొద్దిగా తాగుతూ ఉంటే వేడి చేసి వచ్చిన జ్వరం కూడా తగ్గిపోతుంది. ఈ నీటిని మూడు పూటలా తాగుతూ ఉంటే మూత్రంలో మంట దురద మూత్రాశయంలో వాపులు కూడా తగ్గుతాయి. జలుబు దగ్గుతో బాధపడేవారు కూడా ఆ నీటిని తాగుతూ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. అంతే కాకుండా పిచ్చికుక్క కరిచినప్పుడు దానికి విరుగుడుగా ఈ అతిబల ను ఉపయోగిస్తారు. పిచ్చి కుక్క కరిచిన వెంటనే ఈ అతిబల ఆకుల రసాన్ని 70 గ్రాములు మోతాదులో ఆఖరి ఇచ్చిన వ్యక్తికి తాగిస్తే ఇది పిచ్చి కుక్క కాటుకు విరుగుడు గా పనిచేస్తుంది. ఈ ఆకుల రసాన్ని బాగా నూరి కుక్క కరిచిన చోట కట్టుకడితే ఇది ఆ కాటుకి విరుగుడు గా పనిచేస్తుంది. శీఘ్రస్కలనం తో బాధపడే పురుషులు ఈ ఆకులను 50 గ్రాములు శతావరి గింజల పొడిని ఒక 50 గ్రాములు ఈ రెండింటినీ సమానంగా పటికి బెల్లం పొడితో కలిపి నిల్వచేసుకొని రెండు పూటలా ఒక చెంచా పొడిని చప్పరించి తరువాత ఒక కప్పు పాలు తాగుతూ ఉంటే శీఘ్రస్కలనం సమస్య కూడా తగ్గిపోతుంది. పైత్యం తో బాధపడేవారు ఈ అతిబల ఆకులను ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడిగి ఒక బట్టలో వేసి బాగా నూరి ఆ తరువాత ఒక స్టైనర్స్ సహాయంతో వడపోసి దానిలో కొద్దిగా పంచదార కలిపి తాగుతూ ఉంటే మీ శరీరంలో అధిక వేడి వలన కలిగిన గుండె దడ కానీ పైత్యం కానీ త్వరగా తగ్గిపోతుంది. నడుము నొప్పితో బాధపడేవారు ఈ ఆకులతో తయారుచేసిన కషాయాన్ని రెండుపూటలా తాగుతూ ఆకులను నలగ్గొట్టి వేడి చేసి నొప్పుల పైన వేసి కట్టు కట్టుకుంటూ ఉంటే కేవలం నడుము నొప్పి మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న ఏ నొప్పులైనా తగ్గిపోతాయి. మొలలతో బాధపడేవారు ఈ అతిబల ఆకులను కూరగా వండుకొని మొలలు వాటి నుండి కారే రక్తం కూడా ఆగిపోతుంది. అతిబల ఆకులను ఇరవై ఒకటి తీసుకుని మిరియాలను ఇరవై ఒకటి తీసుకుని మెత్తగా నూరి చిన్న చిన్న గోలీలు తయారు చేసుకోవాలి. రోజుకొక గోళి చొప్పున పరగడుపున గోరువెచ్చని నీటితో ప్రతి రోజు ఒక నెల రోజులపాటు తీసుకుంటే వాత దోషం వలన కలిగే మొలలు తగ్గిపోతాయి. స్త్రీలలో చాలామంది స్థానల వాపులతో బాధపడుతూ ఉంటారు. ఈ అతిబల వేరు లను నిల్వ చేసుకొని రోజు రెండు పూటలా ఆ వేరు ని సానరాయి పై అర గా తీసుకొని ఆ గంధాన్ని మీ స్తనల వాపు లపై పట్టిస్తూ ఉంటే ఆ వాపు లన్నీ తగ్గిపోతాయి. కండరాల వాపు పై కూడా పట్టిస్తూ ఉంటే ఆ వాపు కూడా తగ్గిపోతుంది. దగ్గు ఉబ్బసంతో బాధపడేవారు బాగా ముదిరిపోయిన అతిబల చెట్టు ని తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఆ తరువాత కాల్చి బూడిద చేయాలి ఆ బూడిదను ఒక కుండలో పోసి నిండా నీళ్లు పోసి మూడు రోజులపాటు నిల్వ ఉంచుకోవాలి. రోజుకొకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. నాలుగో రోజు నా పైకి తేలిన నీటిని మాత్రమే ఉంచుకొని చిన్నమంటపై మరిగించాలి అంత తెల్లగా ఒక బూడిద లాగా మిగులుతుంది. దానిని మీరు మెత్తగా నూరి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఒక చిటికెడు ఉప్పు రెండు చెంచాల తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు ఉబ్బసం హరించుకుపోతాయి. మూత్రపిండాల నొప్పి కూడా తగ్గడానికి ఈ ఆకు ని ఉపయోగిస్తారు. దానికోసం ఒక 50 గ్రాములు ఆకుల్ని తీసుకుని మెత్తగా దంచి చిన్నచిన్న బిల్లలు లాగా తయారు చేసుకొని తర్వాత 50 గ్రాములు ఆవునెయ్యిని పొయ్యి మీద వేడి చేసి ఆ నెయ్యి మరుగుతున్నప్పుడు ఈ బిళ్లలను అందులో వేయాలి ఈ బిళ్ళలు అన్ని వేగే వరకు ఉంచి తరువాత వడపోసుకొని వాటిని నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకున్న వాటిని రోజూ రెండు పూటలా ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల నొప్పి తగ్గిపోతుంది. అతిబల వేళ్ళని దంచి పొడిచేసి జల్లించి దానిని నిల్వచేసుకోవాలి ఆ పొడిని 2 ,3 చిటికెలు ఆవు నెయ్యితో కలిపి రెండుపూటలా ఆహారానికి ఒక గంట ముందు తీసుకుంటే గుండెకి బలం కలగడం మాత్రమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా అవుతుంది. మొటిమలు చర్మ సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా దేనికీ పనికి రాని ట్లుగా పిచ్చిమొక్కలు కనిపించే అతిబల మొక్క లు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Previous articleఅందం – ఆరోగ్యం – శృంగార పటుత్వం పెంచే గింజలు…రోజుకి ఒక స్పూన్ చాలు
Next articleతిరుమల లో ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here