Chiranjeevi కి హీరోగా మొదటి సినిమా అవకాశం
Chiranjeevi : టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు చిరంజీవి మెగాస్టార్ గా మాత్రమే చాలామంది ప్రేక్షకులకి తెలుసు కానీ చిరంజీవి కూడా ఒకప్పుడు చాలా కష్టాలను పడ్డాడు. ఇందులో ముఖ్యంగా చిరంజీవి తండ్రి పోలీసు ఉద్యోగం చేస్తుండడంతో చిరంజీవి నటన వైపు రావడానికి తన తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదు. దాంతో చిరంజీవి నటుడు అవ్వాలనే కల కి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ చిరంజీవి ఈ అడ్డంకుని తప్పించుకొని ఎలాగోలా తన తండ్రిని ఒప్పించి నటనలో శిక్షణ తీసుకోవడానికి మద్రాసు వెళ్ళాడు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ :
అనంతరం మద్రాసు లో ఉన్నటువంటి ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఒకప్పటి ప్రముఖ స్టార్ కమెడియన్ సుధాకర్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరిప్రసాద్ తదితరులతో కలిసి ఒకే రూములో ఉండేవాళ్లు. దీంతో హరిప్రసాద్ మరియు సుధాకర్ లు కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి కూడా వీరితో పాటు పలు చిత్రాల ఆడిషన్స్ కి వెళ్ళేవాడు. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పునాది రాళ్లు చిత్రంలో మొదటగా కమెడియన్ సుధాకర్ కి హీరోగా అవకాశం వచ్చిందట.

కానీ అదే సమయంలోనే సుధాకర్ కి మరో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఒక్కసారిగా నటుడు సుధాకర్ సందిగ్ధంలో పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తో చెప్పాడట. దాంతో మెగాస్టార్ చిరంజీవి భారతీరాజా చిత్రాన్ని ఎంచుకొమ్మని కావాలంటే తాను పునాదిరాళ్లు చిత్ర యూనిట్ సభ్యులతో మాట్లాడతానని సుధాకర్ ని తీసుకొని పునాదిరాళ్లు దర్శక నిర్మాతయిన రాజకుమార్ దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరించాడట. దీంతో మెగాస్టార్ చిరంజీవి నిజాయితీని అర్థం చేసుకున్న దర్శకుడు రాజ్ కుమార్ సుధాకర్ భారతీరాజా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడట. కానీ మరి తన చిత్ర పరిస్థితి ఏమిటని అడగడంతో మళ్లీ సందిగ్ధం నెలకొంది.

Chiranjeevi కి పునాది రాళ్లు మూవీ ఆఫర్ :
అయితే సరిగ్గా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రాజ్ కుమార్ కి నచ్చడంతో సుధాకర్ వరించిన హీరో పాత్ర చిరంజీవికి ఆఫర్ చేశాడట. ఎలాగో మెగాస్టార్ చిరంజీవి కూడా హీరో కావాలనుకోవడంతో చిరంజీవి ఒప్పుకున్నాడట. కానీ ఇక్కడ మరో సమస్య వచ్చి పడింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కి అప్పటికే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ చివరి దశలో ఉంది. ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నియమ, నిబంధనల ప్రకారం శిక్షణ ముగిసేంతవరకు ఎవరూ కూడా సినిమాలలో నటించడానికి వీలు లేదు. దీంతో ఈ విషయం గురించి కూడా దర్శక నిర్మాత రాజ్ కుమార్ కి తెలియజేయడంతో మరేం పర్వాలేదని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సభ్యులతో తాను మాట్లాడతానని వారిని సంప్రదించి మెగాస్టార్ చిరంజీవిని పునాదిరాళ్లు చిత్రంలో హీరోగా నటింపజేసారు.
ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి హీరోగా మొదటి సినిమా ఆఫర్ వచ్చింది మాత్రం ప్రముఖ వెటరన్ స్టార్ కమెడియన్ సుధాకర్ వల్లనే. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, హీరో గా ఆఫర్లు దక్కించుకున్నాడు, మెగాస్టార్ గా బిరుదు తెచ్చుకున్నాడని మాత్రమే అనుకుంటున్నారు. కానీ చిరంజీవి తన కెరియర్ లో పడినటువంటి ఇబ్బందులు గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు.
Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )
https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/
https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/
If you like our article about Chiranjeevi
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites