Rajasekhar : ఆ స్టార్ హీరో కి తన భార్య వల్లే ఆ అవకాశం పోయిందంటూ ప్రచారం… కానీ…

420

Rajasekar కి తన భార్య వల్లే ఆ అవకాశం పోయిందంటూ ప్రచారం

Rajasekhar : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరో “రాజశేఖర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు రాజశేఖర్ కి ప్రస్తుతం 59 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ ఇప్పటికి హీరోగా సినిమాల్లో నటిస్తూ బాగానే అలరిస్తున్నాడు. కాగా ఇటీవలే నటుడు రాజశేఖర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తనకు విలన్ గా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తన మనసులో మాటను వ్యక్తం చేశాడు. దీంతో హీరో రాజశేఖర్ కి ఆ మధ్య తెలుగు స్టార్ హీరో హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ గా నటించే అవకాశం వచ్చిందని ఆ మధ్య పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.

విలన్ ఆఫర్ చేజారిందంటూ పుకార్లు :

కానీ ఇటీవలే ఈ అవకాశం కాస్తా చేజారినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు గల కారణాల గురించి అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇందులో ముఖ్యంగా నటి జీవిత ఎక్కువగా తన భర్త రాజశేఖర్ విలన్ గా నటిస్తున్న చిత్రం స్క్రిప్ట్ పనుల్లో కలగజేసుకుంటుందని అందువల్లనే దర్శక నిర్మాతలు రాజశేఖర్ ని తమ చిత్రం నుంచి తప్పించారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ మధ్య కాలంలో హీరో రాజశేఖర్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ కారణాన్ని కూడా సాకుగా చూపించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు హీరో రాజశేఖర్ లేదా అతడి భార్య జీవితలు గానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో రాజశేఖర్ ని విలన్ గా తప్పించారని వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతో ఇంకా తెలియాల్సి ఉంది.

Rajasekhar
Rajasekhar

Rajasekhar మూవీ  రిలీజ్ డేట్ : 

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో హీరో రాజశేఖర్ “పిఎస్వి గరుడ వేగ” చిత్రంలో హీరోగా నటించి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత కల్కి, దెయ్యం తదితర చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం హీరో రాజశేఖర్ తెలుగులో “శేఖర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని ఈనెల 4వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

 

If you like our article Rajasekhar

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleSuman : వందల ఎకరాలు ఆర్మీ కోసం ఫ్రీగా ఇచ్చాడంటూ హీరో గురించి ప్రచారాలు…. చివరికి క్లారిటీ ఇచ్చిన హీరో….
Next articleSaba azad : ఆ సీనియర్ హీరోని ప్రేమిస్తోందని ఈ యంగ్ బ్యూటీ ని వాటికి దూరం పెట్టారట….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here