Rajasekhar – హీరో నాగార్జున పై అలా రివెంజ్ తీర్చుకున్నా
Rajasekhar : మామూలుగా సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు స్టార్ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఒకరు విజయం సాధిస్తే మరొకరు డీలా పడుతుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొందరు హీరోలు తెలుగులో హిట్ అయిన చిత్రాలను తమిళంలో కూడా అనువాదం చేసి విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఒక భాషలో హిట్ అయిన చిత్రాలు మరో భాషలో పెద్దగా ఆకట్టుకోవు. ఇలా జరగడం వల్ల దర్శకనిర్మాతలకు పెద్దగా లాభం ఉండదు. అయితే 1990వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరోలైన కింగ్ నాగార్జున మరియు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోలుగా నటించిన శివ మరియు అంకుశం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. దీంతో శివ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే అంకుశం చిత్రం కూడా పర్వాలేదనిపించినప్పటికీ కలెక్షన్లు మాత్రం సాధించలేకపోయింది. అయితే అంకుశం చిత్రంలో హీరోగా నటించిన తెలుగు ప్రముఖ హీరో రాజశేఖర్ తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని అంకుశం చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
Rajasekhar – అంకుశం చిత్రం కోసం
ఇందులో భాగంగా అంకుశం చిత్రం కోసం దర్శకుడు కోడి రామకృష్ణ మరియు జీవిత తదితరులు చాలా కష్టపడ్డారని అందువల్లనే ఈ చిత్రం తన జీవితంలో చెరిగిపోని మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక టాక్ పరంగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంకుశం చిత్రం అప్పటికే నాగార్జున హీరోగా నటించిన శివ చిత్రం మంచి హిట్ అవడంతో తనకు కలెక్షన్ల విషయంలో కొంతమేర గండి పడిందని చెప్పుకొచ్చాడు. కానీ అంకుశం చిత్రం తెలుగులో పెద్దగా వసూళ్లను సాధించలేక పోయినప్పటికీ తమిళంలో మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుందని తెలిపాడు.
అలాగే తమిళం అనువాద చిత్రానికి తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో తెలుగులో తనకు జరిగిన నష్టం తమిళంలో రికవరీ అయిందని తెలిపాడు. ఈ క్రమంలో మరోమారు శివ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి విడుదల చేశారని అప్పుడు కూడా అంకుశం మరియు శివ చిత్రానికి మధ్య పోటీ ఏర్పడిందని కానీ శివ చిత్రం తమిళంలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పుకొచ్చాడు. దీంతో తనని నాగార్జున తెలుగులో దెబ్బకొడితే తాను తమిళంలో నాగార్జున ని ఎదురుదెబ్బ కొట్టానని సరదాగా వ్యాఖ్యలు చేశాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సందర్భాలు కామన్ దాంతో తాను సినిమా ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ కి మొదటి చిత్రమే అయినప్పటికీ తనలో ఉన్నటువంటి టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. దీంతో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ కి చాలా క్రేజ్ ఉండేది. ఇక శివ సినిమాకి దర్శకత్వం వహించినందుకు రామ్ గోపాల్ వర్మ కి నంది అవార్డు కూడా వరించింది. అయితే శివ సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు పెద్దగా ఆకట్టు కోలేదు, కానీ మూడో రోజు నుంచి మాత్రం కలెక్షన్ల విషయంలో దూసుకుపోయింది. అలాగే ఈ చిత్రంలో హీరో నాగార్జున సైకిల్ చైన్ తెంపే సన్నివేశాలు ఇప్పటికీ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.
ఇక అంకుశం చిత్రం విషయానికివస్తే ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా తెలుగు ప్రముఖ సినీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం కూడా తెలుగులో పెద్దగా ఆకట్టుకోకోకపోయినప్పటికీ తమిళం భాషలో మాత్రం పెద్ద ఎత్తున కలెక్షన్లను సాధించింది.
If you like our article about Rajasekhar vs Nagarjuna
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites