Divya Bharti మత్తులో చేసిన తప్పు వల్లే మరిణించిందా…?
Divya Bharti: ఒక్కోసారి కొంతమంది నటీనటులకు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కినప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా ఆత్మహత్య చేసుకున్న నటీనటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు వెలువడితే మరికొందరు మాత్రం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు మాత్రం మిస్టరీగానే ఉన్నాయి. అయితే తెలుగులో 1990వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకుడు తెరకెక్కించిన బొబ్బిలి రాజా అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన స్వర్గీయ హీరోయిన్ దివ్య భారతి మృతి కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే నటి దివ్య భారతి ముంబయి నగర పరిసర ప్రాంతంలో పుట్టి, పెరిగింది. దీంతో కాలేజీలో చదివే రోజుల్లోనే మోడలింగ్ రంగంలో పని చేసేది. ఈ క్రమంలో తెలుగులో దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన బొబ్బిలి రాజా చిత్రం ఆడిషన్స్ లో పాల్గొని నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ కావడంతో తెలుగులో వెనువెంటనే మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు వరించాయి. దీంతో అప్పటి నుంచి నటి దివ్యభారతి కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. ఈ క్రమంలో అప్పుడప్పుడు హిందీ, తమిళం, తదితర భాషలలో కూడా సినిమా అవకాశాలు వరించాయి.
అయితే నటి దివ్యభారతి కి అప్పట్లో పలు బాలీవుడ్ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన సాజిద్ నడివాల అనే సినీ నిర్మాత తో పెళ్లయిందని కానీ తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ పెళ్లిని కొంతకాలం పాటు ప్రైవేట్ గా ఉంచారని పలు కథనాలు వినిపించాయి. అయినప్పటికీ నటి దివ్యభారతి మాత్రం వరుస సినిమాల్లో నటించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఉన్నట్లుండి 1993వ సంవత్సరంలోని ఏప్రిల్ 5వ తారీఖున ముంబై లో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్ భవనం నుంచి కిందపడి మరణించడంతో ఒక్కసారిగా టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలు ఉలిక్కి పడ్డాయి. దీంతో నటి దివ్య భారతి తన అపార్ట్ మెంట్ బాల్కనీలో నిలుచుని ఉండగా కాలు జారి పడి మరణించిందని అంతేతప్ప వేరే ఇతర కారణాలు లేవని పోలీసులు కేసు కొట్టి వేశారు. కానీ ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అసలు నమ్మలేదు.
కాగా ఆ మధ్య నటి దివ్యభారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి తన కూతురు మరణంపై స్పందించాడు. ఇందులో భాగంగా తన కూతురు కేవలం ప్రమాదవశాత్తు అపార్ట్ మెంట్ భవనం పైనుంచి కింద పడి మరణించిందని అంతే తప్ప వేరే ఇతర కారణాలు లేవని స్పష్టం చేశాడు. అంతేకాకుండా దివ్యభారతి మరణించిన రోజున మద్యం సేవించి ఉందని అలాగే మద్యం మత్తులో బాల్కనీ వైపు వెళ్లిందని దీనికితోడు బాల్కనీకి ఇనుప గ్రిల్ కూడా లేకపోవడంతో ప్రమాదవశాత్తు కాలుజారి పడిందని ఎమోషనల్ అయ్యాడు. అయితే దివ్య భారతి మరణించిన రోజు ఆమెతోపాటు ఉన్నటువంటి ఆమె బంధువులు మరియు ఇంట్లో పని చేసే పని మనిషి కూడా పోలీసుల విచారణలో ఈ విషయాలను చెప్పినట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ అతి పిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో నటి దివ్యభారతి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఇక ఉన్నట్లుండి నటి దివ్యభారతి మరణించడంతో మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న చిత్రం కూడా మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో 19 సంవత్సరాల వయసున్న యువనటి భవిష్యత్తు మద్యం మత్తులో అర్ధాంతరంగా కూలిపోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
If you like our article about Divya
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites