Nidhi Agarwal : నాకు కాబోయే వరుడు అతడేనంటున్న నిధి అగర్వాల్…

222

Nidhi Agarwal : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ముంబై యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన “సవ్యసాచి” చిత్రంలో హీరోయిన్ గా నటించి తన సినీ కెరీర్ ని ఆరంభించింది. కానీ ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినప్పటికీ 2019వ సంవత్సరంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “Iస్మార్ట్ శంకర్” చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.

అంతేగాక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఏకంగా తమిళం, హిందీ, తదితర భాషల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో “హీరో” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం ద్వారా యువ హీరో అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా ప్రముఖ సీనియర్ హీరో జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రం ఈ నెల 15 వ తారీకున సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో తాజాగా నటి నిధి అగర్వాల్ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఈ చిత్రం గురించి మరియు వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

దీంతో ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మరియు హీరో అశోక్ గల్లా చాలా కష్టపడి పని చేశారని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ప్రతి ఒక్కరు కచ్చితంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని కోరింది. అనంతరం తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని విషయం గురించి ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ అడగ్గా ప్రస్తుతం తనకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. కానీ తనని పెళ్లి చేసుకోబోయే వాడు మాత్రం తన తండ్రి మాదిరిగా తనని చూసుకోవాలని కొంచెం లేట్ అయినా సరే అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని భర్తగా చేసుకుంటానని తన అభిప్రాయం తెలిపింది. అంతేగాక తాను ఎప్పుడూ కూడా పెళ్లి బంధానికి ఆస్థి, పాస్తులను ముడిపెట్టనని, అలాగే తననని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కేవలం నన్ను తన తండ్రిలా ప్రేమించే గుణం ఉంటే చాలని అంతకుమించి తన భర్త నుంచి ఏమీ కోరుకోనని చెప్పికొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి నిధి అగర్వాల్ తెలుగులో ప్రముఖ హీరో పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “హరిహర విరమల్లు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. కాగా ప్రస్తుత ఈ చిత్రం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleRashi : ఆ సమస్యలే ఈ హీరోయిన్ కెరీర్ కి శాపం గా మారాయా…?
Next articleLara Dutta : ఇద్దరితో ప్రేమాయణం నడిపి మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న హీరోయిన్… చివరికి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here