Nikitha : ఆ కన్నడ హీరో తో ప్రేమాయణం – సినీ కెరియర్ నాశనం ?

189

ఆ కన్నడ హీరో తో ప్రేమాయణం కారణంగానే ఈ తెలుగు హీరోయిన్ సినీ కెరియర్ నాశనం అయ్యిందా..?

Nikitha : ఒకసారి కొంతమంది హీరో హీరోయిన్ల కీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే మంచి హిట్ లభించడంతోపాటు సినిమా అవకాశాలు కూడా బాగానే వరించినప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్నటువంటి సంఘటనల కారణంగా ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నటువంటి నటినటులు చాలామందే ఉన్నారు. అయితే ఇందులో 2003 వ సంవత్సరంలో ప్రముఖ హీరో తొట్టెంపూడి వేణు హీరోగా నటించిన “కళ్యాణ రాముడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ “నిఖిత తుక్రుల్” కూడా ఈ కోవకే చెందుతుంది. కాగా నటి నికిత టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటి కాకపోయినప్పటికీ అందం అభినయం మరియు అప్పటికే రెండు, మూడు చిత్రాల్లో వరుసగా ఆకట్టుకోవడంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే వివరించాయి. దీంతో నటి నిఖిత కూడా తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, తదితర భాషలలో హీరోయిన్గా నటించే కొంత కాలంపాటు బాగానే బిజీబిజీగా గడిపింది.

Nikitha – కన్నడ హీరో తో ప్రేమాయణం మరియు పెళ్లి :

అయితే అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో నటి నిఖిత గురించి మీడియాలో పలు వార్తలు అప్పట్లో కలకలం సృష్టించాయి. ఇందులో ముఖ్యంగా నటి నికిత కన్నడ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని చివరికి ఈ విషయం కాస్తా ఆ హీరో భార్యకి తెలియడంతో అప్పట్లో ఈ విషయం గురించి పెద్ద గొడవ జరిగిందని పలు కథనాలు బలంగా వినిపించాయి. అయితే తన భర్తని ప్రేమ పేరుతో వలలో వేసుకుందని అలాగే ముంబై పరిసర ప్రాంతంలో ఖరీదైన ఇల్లు కూడా కొనిపించుకుందని ఆ హీరో భార్య ఏకంగా కన్నడ సినీ పరిశ్రమ పెద్దల దగ్గరకు వెళ్ళిందట. దీంతో ఆ హీరో భార్య చేసిన ఆరోపణల ఆధారంగా విచారణ చేసిన కన్నడ సినీ పెద్దలు నటి నిఖిత ప్రేమ వ్యవహారం బయట పడటంతో ఆమెని కొంత కాలం పాటు కన్నడ సినీ పరిశ్రమ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో నటి నికిత కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో కొంత కాలం పాటు సినిమాలలో నటించలేదు. ఆ తర్వాత 2016 సంవత్సరం లో నటి నిఖిత గగన్ దీప్ సింగ్ అనే ఓ ప్రముఖ వ్యాపారవేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది.

Nikitha
Nikitha

సినిమా ఆఫర్లు మరియు రీ ఎంట్రీ :

అయితే పెళ్లి అయిన తరువాత నటి నికిత సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో 2017వ సంవత్సరం తర్వాత నటి నిఖిత మళ్ళీ కన్నడలో “రాజా సింహ” అనే చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడికి మళ్ళీ సినిమా ఆఫర్లు పెద్దగా వరించలేదు. అయితే ఇటీవలే నటి నిఖిత కి తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వరించింది. ఈ విషయం గురించి ఆ మధ్య నిఖిత తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. అలాగే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయని తొందర్లోనే ఈ విషయానికి సంబందించిన వివరాలను తెలియజేస్తానని పేర్కొంది. ఏదేమైనప్పటికీ నటి నిఖిత తుక్రుల్ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ వ్యవహారాల కారణంగానే తన సినీ కెరియర్ ని నాశనం చేసుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

If you like our article about Heroine Nikitha

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleAndhrawala సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పా …
Next articleNTR Sr పెళ్లి ఫోటోలు మరియు పెళ్లి పత్రిక చూసారా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here