Rachana Benerjee : ఒకప్పుడు స్టార్ హీరోలతో కలసి నటించిన ఈ హీరోయిన్ ఉన్నట్లుండి తెరమరుగవడానికి కారణాలు అవేనా….?
Rachana Benerjee : సినిమా అనేది రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలో అందం, అభినయం, అనుకువ, నటనా ప్రతిభ, వంటివి మాత్రమే కాకుండా అలవాట్లను కూడా సరిగ్గా ఉంటేనే మనుగడ కొనసాగుతుంది. లేకపోతే ఒక్కసారిగా సినీ కెరియర్ ఎదో ఒక దశలో తలకిందులవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకట్రెండు చిత్రాల్లో నటించగానే పాపులారిటీ, క్రేజ్ రాగానే చెడు అలవాట్లకు బానిసై సినిమా కెరీర్ ని పోగొట్టుకున్నటువంటి నటీనటులు ఇండస్ట్రీలో లేకపోలేదు. అయితే 1998వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరో శ్రీకాంత్ మరియు కన్నడ ప్రముఖ హీరో ఉపేంద్ర తదితరులు కలిసి మల్టీస్టారర్ గా నటించిన “కన్యాదానం” అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బెంగాలీ బ్యూటీ “రచన బెనర్జీ” కూడా ఈ కోవకే చెందుతుంది.
కాగా రచన బెనర్జీ స్వతహాగా బెంగాలీ సినిమా పరిశ్రమకి చెందిన నటి అయినప్పటికీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. దీనికితోడు నటి రచన బెనర్జీ అప్పట్లో కొంతమేర ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండటం అలాగే ఎక్కువగా లవ్ ఓరియెంటెడ్ పాత్రలలో కనిపించడంతోపాటూ డీసెంట్ గా ఉండేటువంటి పాత్రలో నటించడంతో మంచి క్రేజ్ ఉండేది.
అయితే నటి రచన బెనర్జీ వచ్చీరావడంతోనే కన్యాదానం చిత్రంలో నటించి బాగానే ఆకట్టుకోవడంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మరియు నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఈ అమ్మడు స్టార్ హీరోలతో కలిసి నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. దీంతో నటి రచన బెనర్జీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, బెంగాలీ, ఒడియా, భోజ్ పూరి తదితర భాషలలో సినిమా ఆఫర్లు బాగానే వరించాయి.
చేతినిండా ఆఫర్లతో బాగానే రాణిస్తున్న సమయంలో నటి రచన బెనర్జీ కొంతమేర చెడు అలవాట్లకు బానిసయింది. ఈ క్రమంలో మద్యపానం, ధూమపానం వంటివి చేయడం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా అప్పుడప్పుడు సినిమా షూటింగ్ జరిగే ప్రాంతాల్లోకి కూడా ధూమపానం చేసి వెళుతూ ఉండేదని నటి రచన బెనర్జీపై తోటి నటీనటులు దర్శక నిర్మాతలకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రభావం రచన బెనర్జీ సినిమా అవకాశాలపై పడింది. దాంతో అప్పటివరకు హీరోయిన్ గా రాణించిన రచన బెనర్జీ కి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.
విషయం గ్రహించిన Rachana Benerjee
దీంతో ఈ విషయం గ్రహించిన రచన బెనర్జీ తన అలవాట్ల విషయంలో తొందరగానే మారిపోయింది. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో హీరోయిన్ గా పెద్దగా సినిమా అవకాశాలు వరించలేదు. దీంతో నటి రచన బెనర్జీ బెంగాలీ మరియు ఒడియా సినిమా పరిశ్రమలపై దృష్టి సారించి బాగానే విజయం సాధించింది. కాగా నటి రచన బెనర్జీ 2007వ సంవత్సరంలో ప్రబోల్ బసు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన నటి రచన బెనర్జీ అప్పుడప్పుడు పలు టీవీ షోలలో మరియు డాన్స్ కాంపిటీషన్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా ఇటీవలే నటి రచన బెనర్జీ తన కొడుకు ను హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తూన్నాయి.
If you like our article about Rachana Benerjee
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites