Rashi :
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి ఉంటే మాత్రం సరిపోదు. అవకాశాల విషయంలో మరియు తమ శరీరం ఫిట్నెస్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఒకటి, రెండు హిట్లు వచ్చినాసరే సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టతరమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకప్పుడు పలు లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ హీరోయిన్ రాశి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
రాశి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో
అయితే నటి రాశి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జగపతి బాబు, వడ్డే నవీన్, సీనియర్ హీరో రాజశేఖర్, నందమూరి బాలకృష్ణ తదితర స్టార్ హీరోల సరసన కలిసి నటించింది. ఈ క్రమంలో నటి రాశి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ తదితర సినీ పరిశ్రమలో కూడా కొన్ని చిత్రాలలో నటించి మెప్పించింది. కాగా నటి రాశి మొదటగా ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు 1997వ సంవత్సరంలో హీరోగా నటించిన “పెళ్లి పందిరి” చిత్రంలో హీరోయిన్ గా నటించి తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో వెంటనే గోకులంలో సీత, శుభాకాంక్షలు తదితర చిత్రాలలో నటించే అవకాశాలు వరించాయి. ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో హీరోయిన్ రాశి కి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కింది.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో నటి రాశి రోజులో ఎక్కువ సమయం సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడిపేది. ఈ క్రమంలో తన శరీరపు ఫిట్నెస్ విషయంపై కొంతమేర ఆశ్రద్ధ చేసింది. దీంతో క్రమక్రమంగా హీరోయిన్ రాశి తనకు తెలియకుండానే బరువు పెరగడం మొదలైంది. ఈ విషయం గమనించిన దర్శక నిర్మాతలు హీరోయిన్ రాశికి సినిమా అవకాశాలు ఇచ్చే విషయంలో కొంతమేర ఆలోచనలో పడ్డారు. అయినప్పటికీ రాశి మాత్రం తాను బరువు పెరుగుతున్న విషయం మర్చిపోయింది. దీంతో ఈ ప్రభావం నటి రాశి సినిమా కెరియర్ పై పడింది. దాంతో నటి రాశికి క్రమక్రమంగా సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఆ తర్వాత నటి రాశి బరువు తగ్గే పనిలో పడినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.
స్పెషల్ సాంగ్స్ లో రాశి
కానీ సినిమా ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకునేందుకు నటి రాశి అప్పుడప్పుడు పలు స్పెషల్ సాంగ్స్ లో నటించింది. అంతేకాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటించినప్పటికీ కెరీర్ మాత్రం మలుపు తిరగలేదు. దీంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించి శ్రీ ముని అనే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో పడి దాదాపుగా 8 సంవత్సరాల పాటు నటనకి బ్రేక్ ఇచ్చింది. అనంతరం తెలుగులో ప్రముఖ సీరియల్ హీరో సాగర్ హీరోగా నటించిన “మెన్ ఆఫ్ ది మ్యాచ్” అనే చిత్రం ద్వారా 2013వ సంవత్సరంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పెద్దగా రాణించలేకపోతోంది. కాగా ప్రస్తుతం నటి రాశి తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న “జానకి కలగనలేదు” అనే ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites