Gajala : పెళ్ళికి ముందు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యాయత్నం

169

పెళ్ళికి ముందు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యాయత్నం…. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఎలా ఉందంటే…

Gajala : గజాల. ఈ పేరు గురించి నేటి తరం సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ నిన్నటితరం సినీ ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నటి గజాల తన అందచందాలతో మరియు ఇన్నోసెంట్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతేకాకుండా తెలుగులో ప్రముఖ స్టార్ హీరోలైన ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్, జగపతిబాబు, సీనియర్ హీరో రాజశేఖర్, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేమ సన్నివేశాలతో మతి పోగొట్టింది. కాగా ముందుగా నటి గజాల 2001వ సంవత్సరంలో ప్రముఖ హీరో జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన స్టూడెంట్ నెం 1, శ్రీకాంత్, రాజా లతో కలిసి నటించిన ఓ చిన్నదాన తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. దీంతో నటి గజాల కి సినిమా ఆఫర్ల విషయంలో ఎలాంటి కొరత లేకుండా గడిపింది.

కానీ అప్పటివరకూ హీరోయిన్ గా బిజీ బిజీగా గడిపిన గజాల తన చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో 2005 వ సంత్సరం తరువాత నటి గజాల 10కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించగా ఇందులో ఒకట్రెండు చిత్రాలు మినహాయించి దాదాపుగా అన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో నటి గజాల కి సినిమా ఆఫర్లు కరువయ్యాయి. దీనికితోడు గజాల అప్పట్లో ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని కానీ వీరి పెళ్ళికి హీరో కుటుంభ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ అమ్మడు ఆత్మహత్య చేసుకుందని కథనాలు వినిపించాయి. కానీ గజాల ప్రేమించిన హీరో ఎవరనేది మాత్రం బయటికి రాలేదు. ఈ ప్రభావం నాటు గజాల సినీ కెరియర్ పై పడటంతో సినిమా ఆఫర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక సినీ పరిశ్రమలో తన భవిష్యత్తు ని అర్థం చేసుకున్న గజాల తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.

Gajala
Gajala

ఈ క్రమంలో బాలీవుడ్ లో పలు హిందీ ధారావాహికలలో హీరో గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ హిందీ సీరియల్ నటుడు ఫైజల్ రజా ఖాన్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం తన భర్తతో కలసి దుబాయ్ దేశం లో సెటిల్ అయ్యింది. అయితే ఈ మధ్యకాలంలో నటి గజల సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబందించిన ఫోటోలు షేర్ చెయ్యడం, రీల్స్ షేర్ చెయ్యడం వంటివి చేస్తుంటుంది. నటి గజాల లేటెస్ట్ ఫోటోలను చూసినట్లైయితే 36 ఏళ్ల వయసు పైబడినప్పటికీ ఈ బ్యూటీ ఇప్పటికీ వన్నె తరగని అందంతో మతి పోగొడుతోంది.

దీంతో కొందరు ఈ బ్యూటీ అందానికి ఫిదా అయ్యి నటి గజలా ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేసినా మళ్ళీ ఆఫర్లతో బిజీ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా నటి గజాల తెలుగులో 2011వ సంవత్సరంలో ప్రముఖ హీరో జెడి చక్రవర్తి దర్శకత్వం వహించిన మనీ మనీ మోర్ మనీ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ నటి గజాల కి సంబందించిన ఎలాంటి సినీ సమాచారం లేదు.

If you like our article about Gajala

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleNTR Sr పెళ్లి ఫోటోలు మరియు పెళ్లి పత్రిక చూసారా…?
Next articleChiranjeevi and Balakrishna movies షూటింగ్ మధ్యలో…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here