Laya ఉన్నట్లుండి సినిమాలు మానేసి…
Laya : కొంతమంది నటీనటులు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుని బాగానే రాణించినప్పటికీ ఉన్నట్లుండి తమ వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కాగా తెలుగులో 1999వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.విజయభాస్కర్ మరియు హీరో తొట్టెంపూడి వేణు ల కాంబినేషన్ లో తెరకెక్కిన “స్వయంవరం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి లయ కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే నటి లయ స్వయంవరం చిత్రంలో నటించడానికంటే ముందుగా భద్రం కొడుకో అనే తెలుగు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత లయ కి నటనపై ఆసక్తి పెరగడంతో సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చింది. ఈ క్రమంలో కూచిపూడి నాట్యం కూడా నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
Laya పెళ్లి మరియు సినిమా ఆఫర్లు :
అయితే స్వయంవరం చిత్రం మంచి హిట్ అవడంతో లయ కి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆఫర్లు బాగానే వరించాయి. ఈ క్రమంలో లయ తెలుగులో జగపతిబాబు, నందమూరి బాలకృష్ణ, సాయి కిరణ్, వడ్డే నవీన్ తదితరులతో కలిసి నటించింది. అయితే ఏమైందో ఏమో కానీ కెరియర్ పరంగా వరుసగా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో విదేశాలలో వైద్య వృత్తిలో బాగానే సెటిల్ అయినటువంటి శ్రీ గణేష్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుని తన భర్తతో పాటూ విదేశాలకు వెళ్లి పోయింది. అంతే కాకుండా నటనకు కూడా దాదాపుగా గుడ్ బై చెప్పేసింది. దాంతో అప్పట్లో నటి లయ గురించి పలు వార్తలు బలంగా వైరల్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా నటి లయ గతంలో తనతోపాటు ఓ చిత్రంలో కలిసి నటించిన హీరోతో ప్రేమలో పడిందని ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు నచ్చకపోవడంతో వెంటనే పెళ్లి చేశారని పలు గుసగుసలు వినిపించాయి. కానీ నటి లయ మాత్రం ఆమె ప్రేమ వ్యవహారం పై వినిపించిన వార్తలపై పెద్దగా స్పందించలేదు.
Laya కు అరవింద సమేత చిత్ర ఆఫర్ :
కాగా పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడినటువంటి లయ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఆ తర్వాత లయ కి 2018 వ సంవత్సరములో టాలివుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో హీరో తల్లి పాత్రలలో నటించే అవకాశం తలుపు తట్టింది. కానీ లయ అప్పటికే విదేశాలలో ఉండటంతో సినిమా షూటింగులకు హాజరయ్యే విషయంలో ఇబ్బంది కలుగుతుందని ఈ చిత్రంలో నటించడానికి నో చెప్పింది. ఈ విషయం గురించి నటి లయ ఆ మధ్య ఓ ప్రముఖ వార్తా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అదే 2018వ సంవత్సరంలో తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నటి లయ కి పెద్దగా సినిమా ఆఫర్లు వరించలేదు.
కాగా నటి లయ కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం నటి లయ తన భర్త, పిల్లలతో కలిసి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటోంది. అయితే ఈ మధ్య కాలంలో నటి లయ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. కాగా తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అలాగే నటి లయ కి 40 ఏళ్ల వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తోంది.
Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )
https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/
https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/
If you like our article about Laya
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites