Eight wives for a Thailand citizen Ong Dam sorot
Ong Dam sorot have Eight Wives : పెళ్లి, భారతీయ వైవాహిక జీవితంలో పెళ్లి అనే బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ పెళ్లి బంధం ఇద్దరు వ్యక్తులని ఒకటి చేయడమే కాకుండా ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతుందని అందరూ భావిస్తారు. అందువల్లనే ఈ పెళ్లి అనే బంధానికి చాలా విలువ ఇస్తారు. దీంతో మామూలుగా పెళ్లి, ప్రేమవంటి బంధానికి విలువ ఇచ్చే వాళ్ళు ఒకటి లేదా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే పర్యాటక ప్రాంతాలకి సుందరవనాలకి అలాగే బాడీ మసాజ్ లకి పెట్టింది పేరైన థాయిలాండ్ దేశంలో ఓంగ్ డామ్ సొరట్ అనే అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై టాటూ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. కాగా తాజాగా ఓంగ్ డామ్ సొరట్ తన ప్రేమ పెళ్లిళ్ల గురించి థాయిలాండ్ కి చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా తాను తన ఎనిమిది మంది భార్యలని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.
అందరూ కలిసి ఒకే ఇంట్లో – Ong Dam Sorot
అలాగే ప్రస్తుతం తాము అందరూ కలిసి ఒకే ఇంట్లో చాలా సంతోషంగా గడుపుతున్నామని తెలిపాడు. ఈ క్రమంలో తన భార్యలలో దాదాపుగా ఐదు మందిని తాను సోషల్ మీడియా మాధ్యమాలలో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ఇక మరో ఇద్దరిని సినిమా షూటింగులలో చూసి ప్రేమించానని చెప్పుకొచ్చాడు. ఇక తన 8మంది భార్యలు కూడా ఒక్కో రంగంలో ఉద్యోగం చేస్తున్నారని దాంతో తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని స్పష్టం చేశాడు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఒకరు, ఇద్దరు భార్యల తోనే కొంతమంది సతమతమౌతుంటే ఏకంగా 8 మంది భార్యలని ఎలా భరిస్తున్నారు బ్రదర్ అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెబుతున్నావంటే “సాహసమనే చెప్పాలి” అంటూ టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు మరియు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చెప్పిన కామెడీ డైలాగులు వల్లిస్తున్నారు. మరికొందరు మాత్రం మనసు తెలుసుకుని మసలుకుంటే ఒకరైనా, 10 మంది అయినా లైఫ్ తో పాటూ కాపురం కూడా బాగుంటుందని లేకపోతే గొడవలు, విభేదాలు తప్పవని ఆవహిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites