ఈ మొక్క వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు

117

మన ఇంటి ముందు పెరిగే రకరకాల మొక్కలు అనేక రకాలైన ఔషధాలను ఇచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముక్క కంటిచూపును మెరుగుపరుస్తుంది సంతాన సాఫల్యత ను కలిగిస్తుంది. అలాగే శరీరంపై ఏర్పడిన అనేక రకాలైన కణితలను, గడ్డలను తొలగించే మంచి మొక్క అని చాలా మందికి తెలియదు. ఈ మొక్క పేరు ఏమిటి అని అనుకుంటున్నారా రెడ్డివారినానుబాలు. వర్షాకాలంలో ఇంటి ముందు గడ్డిలోనే గేటు ముందు వరి పొలాల గట్ల పైన ఎక్కడపడితే అక్కడ నీరు ఎక్కువగా ఉండే ప్రదేశం లో ఈ మొక్క కనిపిస్తుంది. దీనిని సంస్కృతంలో దుద్ధిగా అని, తెలుగు లో పాలకాడ నానుకాడ అని రకరకాల పేర్లతో పిలుస్తారు.

   ఈ మొక్క  చూడడానికి ఎరుపు తెలుపు రెండు రంగులలో కనిపిస్తుంటుంది. సారవంతంగా ఉండే భూమిలో ఒక అడుగు వరకు పెరిగే పెద్ద రెడ్డివారి నానబాలు కన్నా చిన్నగా ఉండే నానబాలు మొక్క లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీని ఆకుల నించి దంచి వాటి నుంచి తీసిన రసంతో పూర్వకాలంలో పచ్చబొట్టు పొడిచే వాళ్లు. అందుకే దీన్ని పచ్చబొట్లాకు అని కూడా పిలుస్తారు. దీనిని నాగార్జును అని ఎందుకు పిలుస్తారు అంటే పూర్వకాలంలో శాతవాహనులు పరిపాలన చేస్తున్నప్పుడు తీవ్ర కరువు కాటకాలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే సిద్ధ నాగార్జునడు ప్రకృతిపై ఆగ్రహించి శ్రీ పర్వతాన్ని ఫ్రీ రెడ్డివారి నానబాలు ఆకు తో బంగారుమయం గా మార్చారు. అమ్మవారు ప్రత్యక్షమై ఇది ప్రకృతి విరుద్ధమైన పని అని చెప్పి వర్షాలు కురిపించి బంగారు మయమైన శ్రీ పర్వతాన్ని సాధారణ పర్వతం గా మార్చారు. అందుకే ఈ మొక్కను నాగార్జునుని పేరుతో నాగార్జును అని కూడా అంటారు. ఇక దీనిని నానుబాలు అని ఎందుకు పిలుస్తారు అంటే వేమన కవి గా మారిన వేమారెడ్డి ఈ మొక్క ఆకుల నుంచి బంగారం తీయడం వలన దీనిని రెడ్డివారినానుబాలు అని పిలుస్తారు. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను తనలో నింపుకున్న ఆయుర్వేదిక మూలికలు అని ఆయుర్వేదిక నిపుణులకు మాత్రమే తెలుసు. ఈ మొక్క రుచి తీపిగా కారంగా చేదుగా ఉంటుంది. ఈ మొక్క మనలని అనేక రోగాల నుంచి కాపాడగలదు. ఈ మొక్క యొక్క అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఈ మొక్క యొక్క ఆకులేని లేదా ఆకు రసాన్ని ఆకుల ఔషధాన్ని గనుక చెప్పిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటే పైత్య రోగాలు మేహ రోగాలు కడుపులో మంట కడుపులో ఏర్పడిన పుండు నిద్ర రోగాలు చర్మరోగాలు సర్వరోగాలను సమూలంగా నిర్మూలిస్తుంది. ఈ ఆకులు పప్పులో వేసి రెండు పూటలా బాలింతకు తింటూ ఉంటే వారికి సంవృద్దిగా పాలు పడతాయి. దీనితో బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.
చాలామంది రోజురోజుకీ మధుమేహ రోగుల తో కంటి జబ్బుల తో కృంగి కృశించి పోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం లాగా పనిచేస్తుంది. ముందుగా ఈ మొక్కలు ఉత్పత్తి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టాలి. అలా అయిన తర్వాత దాని మెత్తని పొడిగా చేసి ఆ పొడిని జల్లించి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ పోడిన ప్రతి రోజు ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు అర చెంచా పొడిని అర గ్లాసు నీళ్ళలో కలిపి తీసుకుంటూ ఉంటే మధుమేహం కంట్రోల్ లోకి రావడం మాత్రమే కాకుండా కంటి చూపు కూడా మెరుగవుతుంది. శరీరంలో చాలా చోట్ల కణితలు కొవ్వు గడ్డలకు ఇబ్బంది పడేవారు ఈ మొక్కని మధ్యభాగానికి వెళ్ళినప్పుడు తెల్లని పాల లాంటి ద్రవం వస్తుంది దానిని ఆ గడ్డ పైన రాశి మెల్లగా మర్దన చేస్తే ఆ గడ్డలు కణితలు తొందరగా కరిగిపోతుంది. ఇలా కాడ నుంచి వచ్చే పాల చుక్కలను కంటిలో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటే కంటిచూపులో మెరుగుదల కనిపిస్తుంది. అయితే వేడి శరీర తత్వం ఉన్నవారు దీనిని రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. మిగతా వారు ప్రతిరోజు పెట్టుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా 20 రోజుల పాటు చూస్తూ ఉండాలి. ఒక పది రోజుల పాటు విరామం ఇచ్చి మరో 20 రోజులు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కంటి పూలు కంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. పూర్తిగా కంటిచూపు కనబడక నల్లగుడ్డు తెల్ల గా మారిపోయిన వారు కూడా దీని పాలను కంటిలో పెట్టుకుంటూ ఈ ఆకులను ప్రతిరోజు నమిలి మింగుతూ ఉంటే కంటిచూపు మెరుగవుతుంది.
దీని యొక్క ఆకులను తీసుకుని ఒక తెల్లటి కాటన్ వస్త్రం వేసి మెత్తని పొడిగా చేసి దాని నుంచి వచ్చినటువంటి రసాన్ని తీసి ఒక ఐదు స్పూన్ రసానికి అర స్పూన్ మిరియాల పొడి కలుపుకొని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు తీసుకోవాలి తీసుకుంటూ ఉండటం వలన మహిళలకు గర్భాశయం లో ఉన్న లోపాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా చేయలేని వారు ఈ ఆకులని తీసుకువచ్చి ఎండబెట్టి మెత్తని పొడి లాగా చేసి ఆ పొడిని కండ చక్కెర తో కలిపి ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు నీటిలో కలుపుకొని కొద్దిగా ఆవుపాలను కూడా కలుపుకొని క్రమం తప్పకుండా ఒక నెల రోజులపాటు తీసుకుంటే స్త్రీలలో గర్భాశయ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అయితే వీటిని తినేటప్పుడు ఉప్పు కారం బాగా తగ్గించాలి పులుపు అస్సలు తినకూడదు. వీలైనంత వరకు అన్నం పెసరపప్పు తీపి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అలాగే ఆవుపాలు ఆవుపెరుగు ఆవునెయ్యి బాగా తీసుకోవాలి. ఇంట్లో తయారుచేసిన నేతి పిండివంటలను మాత్రమే తినాలి.
చాలా మంది పులిపిరలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ మొక్క నుంచి వచ్చే పాలను ఆ పులిపిరులపైన గనుక పెట్టుకుంటూ ఉంటే అవి తొందరగా తగ్గిపోతాయి. అలా చేస్తూనే ఈ ఆకుల పొడిని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు ఒక అరస్పూన్ ఒక గ్లాసు నీళ్లలో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ సమస్య పూర్తిగా నయమవుతుంది.
మన కళ్ళ ముందు పిచ్చిమొక్కలు కలిగించే ఈ నానబాలు మొక్క మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తుంది.

Previous articleఒకే ఒక చిన్న చిట్కా తో యూరిన్ ఇన్ఫెక్షన్ మాయం మల్లి రమ్మన్నా రాదు
Next articleకే జి ఫ్ వెనకాల ఉన్న అసలు కథ తెలిస్తే ఆశ్చర్య పోతారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here