టాయిలెట్స్ లో ఏది మంచిది? ఇండియాన? వెస్టర్నా?

106
Toilet
Toilet

Toilet : ప్రాచీన కాలం నుంచి మల విసర్జనకు మనిషి ఒకటే పద్దతి ఆచరిస్తూ వచ్చాడు. ఆదిమ మానవుడు కూడా మోకాళ్లను మలుచుకుని కూర్చోవడం నేచురల్ గా నేర్చుకున్నాడు. ఆ తర్వాత వేల సంవత్సరాలు ఇదే పద్దతి కొనసాగింది. కానీ 16వ శతాభ్దంలో మాత్రం రాజులు, ఇతరత్రా రాణులు, డబ్బున్న వాళ్లంతా సుఖం కోరుకున్నారు. అది కూడా పాశ్చాత్య దేశాల్లోనే. దీంతో వాళ్ల కోసం ఠీవీగా కూర్చునే టాయిలెట్ బేసిన్ లు వచ్చాయి. వాస్తవానికి ఇవి హాస్పిటల్స్ లో వికలాంగుల కోసం, పేషెంట్‌లకోసం డాక్టర్లు ఇలాంటి వెస్టర్న్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ఈ టాయిలెట్ లను వాడటం మొదలు పెట్టారు.

కానీ యూరప్ లో వందల ఏళ్లక్రితం మల విసర్జన కు సంబంధించిన వ్యాదులు రావడం ఎక్కువయ్యాయి. మల బద్దకం, అపెండిసైటిస్, హెమరాయిడ్స్ వచ్చాయి. దీంతో కూర్చునే టాయిలెట్ దీనికి కారణం అయి ఉంటుందని డాక్టర్లు తేల్చారు. కిందకు కూర్చుని ఉండటం, టాయిలెట్ మల ద్వారానికి దగ్గరగా ఉండటం తో పాటు దాని బ్యాక్టీరియా, వైరస్ లు ఏమైనా ఉంటే గదిలోకి కూడా వ్యాపిస్తాయని ప్రచారం మొదలు పెట్టారు. అదే కూర్చుని ఉంటే వెంటనే వాటర్ తో కొడితే మొత్తం పోతుందని శుబ్రతకు ఇదే మంచిదని చెప్పడంతో సీన్ మారిపోయింది.19వ శాతాబ్దానికి ముందే అమెరికా, యూరప్ దేశాల్లో మొత్తం వెస్టర్న్ బేసిన్ లు వచ్చాయి. కానీ ఆరోగ్యం , శరీర నిర్మాణంపై అవగాహన ఉన్న ఇండియా , పాకిస్తాన్ లో మాత్రం మన నేచురల్ టాయిలెట్స్ నే వాడాం. ఇప్పటికీ వాడుతున్నాం కూడా. కానీ కూర్చుంటే హాయిగా ఉంటుందని ఫ్యాషన్ కు వెళ్లి వెస్టర్న్ టాయిలెట్ ను వాడుతున్నారు. కానీ ఇది అనారోగ్యానికి దారి తీస్తుందని ఆలస్యంగా కళ్లు తెరిచారు.

మొదటగా వెస్టర్న్ టాయిలెట్ ఎంత చెడ్డది, ఇండియన్ స్టైల్ బేసిన్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ఒక ఇరానియన్ డాక్టర్ ప్రపంచానికి తెలియజేశాడు. మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాళ్లు ముడుచుకుని పెరుగుతాడు. దీని వల్ల పొత్తికడుపులోని సిస్టం అంతా సరిగ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా మోకాళ్ల మీద కూర్చుంటే మలం అనేది పూర్తిగా బయటకు వస్తుంది. కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. మల ద్వారం వరకు ట్యూబ్ సాఫీగా ఉంటుంది కాబట్టి వెంటనే మొత్తం వచ్చి శుబ్రం అయిపోతుంది. అదే వెస్టర్న్ టాయిలెట్ మీద కూర్చుంటే మల ద్వారం ఉన్న రెక్టమ్ ట్యూబ్ ఒక వైపు కూ ఒత్తుకుని ఉన్నట్లుగా మారిపోయి మల విసర్జన సాఫీగా కాదు. అందుకోసం ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. ఇదే మల బద్దకం, మంటతో కూడిన విసర్జనకు దారి తీస్తుందంటున్నారు డాక్టర్లు. ఈ నేచురల్ పొజిషన్ తో కేన్సర్ లను కూడా నిరోధిస్తుందనేది సైంటిస్టుల మాట.

మోకాళ్ల మీద మల విసర్జనకు వెళ్లడం వెళ్ల ప్రొస్టేట్ బ్లాడర్ నర్వ్ సిస్టం సరిగా పనిచేస్తుంది. స్ట్రెచ్ అయి పాడవకుండా చూస్తుంది. ప్యూబోరెక్టాలిస్ కండరాలపై ఒత్తడి పడకుండా రిలాక్స్ అవుతాయి. తొడలు పొత్తి కడుపుకు ఒత్తుకోవడం వల్ల కూడా మల విసర్జన పూర్తిగా వస్తుంది. ఆ తర్వాత హాయిగా ఉంటుంది. యోగాలో కూడా శశాంకాసన కూడా దీనికోసమే చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వెస్టర్న్ టాయిలెట్ కంటే ఇండియన్ టాయిలెట్ ఎంత మంచిదో ఈ ఒక్క ఆసనాన్ని చూసి అర్దం చేసుకోవచ్చు. వెస్టర్న్ టాయిలెట్స్ లో కూర్చోవడం వరకే హాయిగా ఉంటుంది కానీ లోపల కండరాలపై ఒత్తిడి ఉంటుంది, మల విసర్జన పూర్తి కాదు. ఇది మెల్లిగా కొన్నేళ్లకు ఒకే సారి ప్రభావం చూపిస్తుందంటున్నారు డాక్టర్లు. రాణులు ఠీవీగా కూర్చోవడం కోసం తయారు చేసుకున్న వెస్టర్న్ టాయిలెట్స్ ని అనవసరమైన సిద్దాంతాలతో ప్రాచుర్యం కల్పించారని యోగా నిపుణులు అంటున్నారు.

Previous articleసమ్మర్ లో హెల్దీ ఫన్ గేమ్స్ ఇలా ఉండాలి!
Next articleఆ తల్లికి చేపలాంటి బేబీ పుట్టింది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here