NTR Sr పెళ్లి ఫోటోలు మరియు పెళ్లి పత్రిక చూసారా…?
NTR : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని వందలకి పైగా చిత్రాలలో హీరో గా నటించి సినీ ప్రేక్షకులను ఏంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు గురించి దాదాపుగా సౌత్ ఇండియాలోనే తెలియని వారుండరు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక తరం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ ముందు ఆ తర్వాత అని మొదలు పెట్టాల్సి ఉంటుంది. కాగా ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉండేది.
దాంతో చాలా మంది ఆర్టిస్టులు ఇబ్బంది పడేవాళ్ళు. ఈ విషయాన్ని గమనించిన సీనియర్ ఎన్టీఆర్ తెలుగువాళ్లకంటూ సెపరేట్ గా ఒక సినీ పరిశ్రమ ఉండాలని చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ ని హైదరాబాద్ కి తరలించడానికి ఎంతగానో కృషి చేసాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ బాగానే అభివృద్ధి చెంది ప్రస్తుతం దేశంలోనే రెండో అతిపెద్ద సినీ పరిశ్రమగా నిలిచింది. అయితే అప్పట్లో నందమూరి తారక రామారావుతో పాటూ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు తదితరులు కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఏంతగానో కృషి చేసారు.
కాగా ఎన్.టీ రామారావు నందమూరి బసవతారకమ్మ ని 1942 వ సంవత్సరం 5వ నెల 2వ తారీఖున వివాహం చేసుకున్నాడు. కాగా అప్పట్లో ఎన్.టీ రామారావు పెళ్ళికి అచ్చు వేయించిన పెళ్లి పత్రిక ఇటీవలే ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో అప్పటినుంచి ఈ వెడ్డింగ్ కార్డుని కొందరు నందమూరి అభిమానులు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే నందమూరి బసవతారకమ్మ 1985వ సంవత్సరంలో మరణించడంతో తన తల్లి జ్ఞాపకార్థం నందమూరి బసవతారకమ్మ పేరు మీదగా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించి ఎంతోమందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే నందమూరి బసవతారకమ్మ పేరు మీద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు తనయులు.
NTR ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకోసం కోసం ఎంతగానో పాటు పడ్డాడు
కాగా నందమూరి తారకరామా రావు కేవలం చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకోసం కోసం ఎంతగానో పాటు పడ్డాడు. ఇందులో భాగంగా 1982వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ ని స్థాపించి 1983వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి అఖండ మెజారీటీతో గెలుపొంది నాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖ్య మంత్రి అయిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అలాగే ప్రజలకు అతితక్కువ ధరకే బియ్యం, వైద్యం, కరెంట్ వంటి వాటితో ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చారు. దీంతో ఇప్పటికీ చాలామంది ప్రజలు ఎన్.టీ రామారావు పాలన అంటే రాముడి పాలన అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
If you like our article about Sr NTR
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites