russia ukraine war : రష్యా దూకుడు చూసి మూడో ప్రపంచ యుధ్దం వస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇక కొన్ని మీడియా సంస్థలైతే మూడో ప్రపంచ యుధ్దం వస్తుందని తెగ డబ్బా కొడుతున్నాయి. ఎక్కడో రష్యా యుద్దం చేస్తే మనకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బంగారం ఆకాశాన్ని తాకుతుంది. మూడో ప్రపంచ యుధ్దం వస్తే ఇక అంతే సంగతులు. సిలీండర్ ధర వెయ్యి నుంచి పదివేలవుతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుధ్దం రావడానికి ఛాన్సే లేదు. అమెరికా యుద్దాన్ని పూసుకుంటే తప్ప. అమెరికా స్వార్ధ పూరిత దేశం. ఇరాన్ మీద ఆంక్షల పేరుతో మనల్ని ఆయిల్ కొనకుండా ఆంక్షలు విధించింది. నష్టపోయింది మనమే. కాబట్టి అమెరికా స్వార్ధానికి ఏ దేశం ఎక్కువగా బలికావడానికి ఇష్టపడదు. కరోనా వస్తేనే అతలాకుతలం అయ్యాము. ఇక ఉక్రెయిన్ కు మేమున్నామని ధైర్యం చెప్పి అమెరికా నక్కలా ఆంక్షల పేరుతో గర్జిస్తోంది. పిల్లి అరుపులకు ఉడుత ఊపులకు భయపడటానికి అది చైనా కాదు రష్యా. నాటో రంగంలోకి దిగినా, అమెరికా స్వయంగా దూకుడుగా వెళ్లినా మూడో ప్రపంచ యుద్దం రావడానికి ఛాన్స్ ఉంది. అమెరికా తనకు లాభం లేని యుద్దం చేయదు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్దం వస్తే మనందరం అడుక్కుతినాల్సిందే. మరి మూడో ప్రపంచ యుధ్దం రాదా అంటే మూడు దేశాల పై ఆధారపడి ఉంది. అవే రష్యా, చైనా, ఇరాన్.
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహమ్ ఒక అద్భుతమైన ఆర్టికిల్ రాశారు. రష్యా విస్తరణ దాహం ఎంతవరకు ఉందనే దాని మీద భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఉక్రెయిన్ ను కూల్ గా భయపెట్టి లొంగదీసుకునేందుకు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్దంగా జనావాసాలపై వైమానిక దాడులు జరుపుతున్నాడు. ఇప్పటికే రాజధానిని ఆక్రమించుకునేందుకు వైమానిక దాడులు చేశారు. వందల మంది సైనికులు, ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. ఉక్రెయిన్ లొంగిపోవాలనేదే రష్యా ప్లాన్. పూర్తి స్తాయి యుద్దం చేయడం మాత్రం కాదంటారాయన. బయటికి మేం భీకర యుద్దం చేస్తున్నామని చెబుతున్నా సెలక్టెడ్ గా బాంబులు వేస్తున్నారు. ఉక్రెయిన్ కు సైన్యం లేదు, ఆయుధాలు లేవు, వారికి యుధ్దం చేసిన అనుభవం లేదు. అందుకే లొంగిపోయేలా భయపెట్టి కొంత మంది అమాయకులను చంపుతున్నాడు పుతిన్. అతను మహా కర్కశుడంటారు గ్రహమ్. ఉక్రెయిన్ లొంగిపోతే తర్వాత ఇంతకు ముందు సోవియెట్ యూనియన్ దేశాలను ఆక్రమించుకుంటాడు పుతిన్. ఉక్రెయినే పోయిన తర్వాత కిజికిస్తాన్, తుర్క్కుమనిస్తాన్ పెద్ద లెక్క కాదు. కాకపోతే ఇవి నాటో దేశాలు. నాటో తో పోల్చుకుంటే ఆయుధాల పరంగా, రక్షణ బడ్జెట్ పరంగా రష్యా వీక్. కాకపోతే రష్యా భయానికి అమెరికా వెనుకడుగు వేస్తే నాటో కూడా చెల్లా చెదరవుతుంది. పైగా మరో యుద్దాన్ని భరించే శక్తి అమెరికాకు లేదు.
సోవియెట్ యూనియన్ ను ఏర్పాటు చేసి ఆర్ధికంగా బలోపేతం కావాలనేది రష్యా ప్లాన్. అదే విస్తరణ సాగితే మూడో ప్రపంచ యుధ్దానికి దారులు ఏర్పడుతాయి. నాటో ఢీకొడితే మాత్రం థర్డ్ వరల్డ్ వార్ కు కొబ్బరికాయ కొట్టినట్లే. ఎందుకంటే రెండో ప్రపంచ యుధ్దం ఎప్పుడో హిట్లర్ 1933 లో హిట్లర్ నాజీ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ముందు సైన్యాన్ని, ఆయుధాలను బలోపేతం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం కనీసం ఆధునిక దేశాలను ఆక్రమించుకోవాలనుకున్నాడు. మొదట పోలండ్ ను ఆక్రమించుకున్నాడు హిట్లర్. 1939 లో హిట్లర్ ను చూసి బ్రేక్ లు వేసేందుకు తూర్పు భాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. అటు వైపు రష్యా ఆ రోజుల్లో హిట్లర్ ను ఆపింది.
అయితే తమ వరకు హిట్లర్ రాడని ఫ్రాన్స్, బ్రిటన్ భావించాయి. చర్చల కోసం హిట్లర్ ను ఆహ్వానించారు. అయితే హిట్లర్ ఒక వైపు చర్చలు చేస్తూనే దాడులు మొదలు పెట్టాడు. జర్మనీ, డెన్మార్క్ ను ఆక్రమించుకున్న తర్వాత అది రెండో ప్రపంచ యుద్దంగా మారింది. ఉమ్మడిగా బ్రిటన్, ఫ్రాన్స్ దళలు రంగంలోకి దిగాయి. జర్మీనికి బ్రేక్ వేసేందుకు అమెరికా కూడా రావడంతో ప్రపంచ యుధ్దం పతాక స్థాయికి చేరుకుంది. ఇటలీ దూకుడుకు మధ్యదరా సముద్రంలో బ్రిటన్ ఆస్ట్రేలియా బ్రేక్ వేశాయి. మరోవైపు జపాన్ చైనాను ఆక్రమించుకుని అతలాకుతలం చేసింది. అయితూ జపాన్ కు అమెరికా షాకిచ్చింది. దీంతో ఆయుధాలు లేక సుదూర ప్రాంతాలు కావడంతో 1944లో మిత్రదేశాలు జర్మనీ, జపాన్ , ఇటలీ ల సైన్యాలను ఓడించాయి. దాంతో ఇక ముందుకు సాగలేమని లొంగిపోవడంతో యుద్దం ముగిసింది.
ఇప్పుడు రష్యా విస్తరణ కాంక్ష ఎక్కడి వరకు ఉందనే దానిమీద మూడో ప్రపంచ యుధ్దం వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే అసలు పోరాటం చైనాతో మొదలవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచమంతా రష్యా,. ఉక్రెయిన్ మీద ఫోకస్ చేస్తే మెరుపు వేగంతో తైవాన్ ను ఆక్రమించుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ప్రపంచానికి చిప్ ల కొరత ఏర్పడుతుంది. దాంతో ప్రపంచాన్ని సాంకేతికంగా శాసిస్తుందని ఆయన భయపెట్టారు. తైవాన్ ను చైనా ఆక్రమించుకోకుండా అడ్డుకుంటేనే ఫోన్ లు, ల్యాప్ టాప్ లు కార్ల నుంచి రాకెట్ ల వరకు చిప్ ల కొరత ఏర్పడుతుంది. ఇతర దేశాలు పరిశోధనల కు కూడా చైనా బ్రేక్ వేయగలదు. ఉక్రెయిన్ లోని వనరులను కొల్లగొట్టి ఆర్దికంగా ఎదగాలనేది రష్యా ప్లాన్. రేపు చైనా కూడా తైవాన్ ను ఆక్రమించుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే ఉక్రెయిన్ విషయంలో అమెరికా పెద్దగా పట్టించుకోలేదు. కానీ చైనా కు కూడా అమెరికా, యూరప్ దేశాలు భయపడితే మాత్రం తైవాన్ ను మింగేస్తుంది. అదే జరిగితే చిప్ ల కొరత స్రుష్టించి రేట్లు పెంచి చైనా మరింత బలపడుతుంది. ప్రపంచాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో శాసిస్తుంది. వాటి కోసమే తైవాన్ మీద చైనా కన్నేసిందని సెనేటర్ లిండ్సే ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరోవైపు ఇరాన్ రంగంలోకి దిగితే చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేసినా చేయొచ్చు. ఆ తర్వాత అది అణ్వాయుదాలకు దారితీస్తుందని చెప్పారు. చైనాను అడ్డుకునేందుకు నాటో వెళ్లినా, అమెరికా వెళ్లినా మూడో ప్రపంచ యుధ్దానికి దారి తీస్తుంది. అది చైనా మీదనే ఆధారపడి ఉంటుంది. ఇరాన్ పిచ్చి దేశమైనా యుద్దం చేసి ఎక్కువ కాలం నిలబడలేదన్నారు.
అయితే ప్రపంచ యుద్దానికి సాంకేతికకు లింక్ ఉందంటారాయన. చైనాకు ఇంటర్నెట్ లేకుండా చేయడం సాధ్యం కాదు. రష్యా నుంచి వారికి సాయం అందుతుంది. అదే ఇరాన్ మెడలు వంచొచ్చు. కానీ అణ్వాయుధం స్తాయికి వెళ్తే ఎవరూ ఆపలేరు. పైగా ఇస్లామిక్ తీవ్రవాదుల చేతిలో పాకిస్తాన్ నుంచి అణ్వాయుధాలు అందాయి. మూడో ప్రపంచ యుధ్దం వస్తే సులభంగా తీవ్రవాదుల చేతికి వెళ్తాయి. ఆసియా దేశాలకు అది పెను ప్రమాదం. కాబట్టి ప్రపంచం కుప్పకూలిపోతుంది. అందుకే రష్యాను ఆపకున్నా కూడా చైనాను ఆపితీరాలంటున్నారు నిపుణులు. రష్యా యుద్దం చేసి వేరే దేశాలను ఆక్రమించుకున్నా వ్యాపారం చేస్తుంది. కానీ చైనా చేతికి తైవాన్ వెళ్తే పెత్తనం చేస్తుంది. భయం అనేది లేకుండా చిన్న దేశాలను మింగేస్తుంది. ఇక మూడో ప్రపంచ యుధ్దం వస్తే సర్వనాశనమే. మనం అందులో పాల్గొనకున్నా శాటిలైట్ లను కూల్చేసి సాంకేతికను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా నేల నుంచి ఆకాశానికి యుద్దం వెళ్తుంది. అయితే ఇప్పుడు చైనా దూకుడుగా వెళ్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. రష్యా యుద్దానికి మద్దతు తెలుపుతూనే ప్రపంచం ఏం చేస్తుందనేది నిశితంగా గమనిస్తోంది చైనా. తైవాన్ మీద మెరుపు దాడి చేస్తే మాత్రం ఆట మొదలైనట్లే. కాకపోతే కరోనాకే ప్రపంచ దేశాలు అట్టుడుకుతున్నాయి. మూడో ప్రపంచ యుద్దం వస్తే వినాశనమే. కాకపోతే చైనా యుద్దం చేసినా ఆంక్షలకు అమెరికా తట్టుకుంది కానీ చైనా తట్టుకోలేదు. రష్యా ఎగుమతులు ఆయిల్, ఆయుధాలే. అవి యూరప్ కు కొన్ని దేశాలకు కావాలి. ఇక ఉక్రెయిన్ చేతికి వస్తే వారికి ఆర్ధికంగా ఇబ్బంది ఉండదు. అదే చైనాకు మాత్రం అంతర్జాతీయంగా నెల రోజులు వ్యాపారం ఆపేస్తే …ఆదేశ ప్రజలు రోడ్ల మీద పడతారు. ఆకలితో చస్తారు. ఎందుకంటే చైనా ఉత్పాదక దేశం. వనరులున్న దేశం మాత్రం కాదు. అందుకే చైనా వెనుకడుగు వేసేది. లేదంటే ఈ పాటికి చిన్న దేశాలను మింగేసేదే. కాబట్టి మూడో ప్రపంచ యుద్దం రాదంటారు నిపుణులు. అది ఆశమాషి వ్యవహారం కాదు. మీడియాలో హడావిడి చేసి టీఆర్పీలు పెంచుకునేందుకు చేసే హంగామానే తప్ప మరొకటి కాదంటున్నారు అమెరికా యుద్ద నిపుణులు.