ప్రతి అమ్మాయికి శరీరం మీద ఉండి అవాంఛిత రోమాలతో ఇబ్బందికరంగానే ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తొలగించుకోవడానికి రేజర్స్ క్రీమ్స్ వ్యాక్సింగ్ లాంటివి వాడుతూ ఉంటారు. ఈ రోజు చెప్పబోయే చిట్కాలు తో పాటు మరి కొన్ని టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటే అవాంచిత రోమాలను చాలా తేలికగా తొలగించుకోవచ్చు. ముందుగా అవాంఛిత రోమాలు శాశ్వతంగా తొలగించే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం ముందుగా ఒక బావుల్ తీసుకోవాలి. తర్వాత కావాల్సినది టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ వీలైనంతవరకు తెల్లగా ఉండేది తీసుకోండి. ఒకసారి బ్రష్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత టూత్పేస్టు తీసుకోవాలి. ఆ తరువాత కావలసిన పదార్థం బేకింగ్ సోడా. దీన్ని కూడా ఒక స్పూన్ లో ఒక పావు వంతు మోతాదులో తీసుకొని పేస్టులో కలుపుకోవాలి. తర్వాత కావలసిన పదార్థం నీళ్లు. ఇవి వేడి నీళ్లు శరీరం తట్టుకోగలిగిన అంత వేడి చేసుకొని ఈ బౌల్లో కొద్ది మోతాదులో కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా ద్రవ పదార్థం గా మారే వరకు కలుపుకోవాలి. టూత్ పేస్ట్ మరియు చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగించి ఆ ప్రదేశంలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి చర్మాన్ని మృదువుగా చేయడానికి బాగా సహాయపడుతుంది. బేకింగ్ సోడా ఆ ప్రదేశంలోని నలుపుని తొలగిస్తుంది. మృత కణాలను కూడా తొలగించి ఒక క్లెన్సర్లా గా పనిచేస్తుంది. ఆ ప్రదేశంలో ఏర్పడి అవాంఛితరోమాలు సహజసిద్ధంగా ఓడిపోయే లాగా చేస్తుంది. దీనితో అవాంఛిత రోమాల సమస్య అనేది శాశ్వతంగా పోతుంది. కొద్దిగా దూదిని తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి ఏ ప్రదేశంలో అవాంఛిత రోమాలు ఉంటాయో ఆ ప్రదేశంలో అప్లై చేయాలి. ఈ మిశ్రమం మొత్తం చర్మంలోకి బాగా ఇంకిపోయేవరకు చేతి తో మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకొని 15 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ఉపయోగించిన వెంటనే ఫలితం కనిపించదు.
ఈ చిట్కా ని కనీసం రెండు నుంచి మూడు రోజులపాటు చేస్తూ ఉంటే అవాంచిత రోమాలను రాలిపోవడాన్ని మీరే గమనిస్తారు. తప్పకుండా ఈ చిట్కాలు ప్రయత్నించి చూడాలి. ఈ రెమెడీ ఫాలో అవుతూనే అవాంఛిత రోమాలు తొలగిపోవాలి అంటే కొన్ని చిట్కాలను కూడా జాగ్రత్తగా పాటించాలి. శరీరం మీద ఉన్న అవాంచిత రోమాలను తొలగించే ముందు శరీరంపై ఉన్న మృత కణాలను తొలగించుకోవాలి. దీనితో చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. ఈ చిట్కా ని ఉపయోగించే ముందు చర్మాన్ని కచ్చితంగా స్క్రబ్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. దీనితో అవాంఛిత రోమాలు తొలగించడం మరింత తేలిక అవుతుంది. రెమిడీ ఉపయోగించిన తర్వాత ఆ ప్రాంతంలో కొద్దిగా మాయిశ్చరైజర్ వాడుకోవాలి. దీనితో ఎటువంటి ఎలర్జీ చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవ కుండా ఉంటుంది. అవాంఛిత రోమాల సమస్యతో ఎక్కువగా బాధపడేవారు ప్రతిరోజు రెండు కప్పుల పుదీనా రసం తప్పకుండా తీసుకోవాలి. పొదిన టి మహిళల్లో ముఖం మీద పెరిగే అవాంచిత రోమాలను తగ్గిస్తుంది. చాలా పరిశోధనల్లో కూడా ఈ పుదీనా వల్ల అవాంచిత రోమాలు తగ్గిపోతాయని తెలిసింది. పురుషులలో మీసాలు గడ్డలు రావడానికి ముఖ్యమైన కారణం టెస్టోస్టిరాన్. ఈ హార్మోన్ కొంతమంది మహిళలలో కూడా కొన్ని కారణాల వల్ల మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా ముఖం మీద శరీరం మీద మిగతా ప్రదేశాలలో అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పుదీనాలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ని తగ్గించే గుణాలు ఉన్నాయి. పుదీనా రసం తీసుకోవడం వల్ల అవాంచిత రోమాలు తగ్గిపోవడం మాత్రమేకాదు వాంతులు వికారం గా ఉండడం జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. జలుబు సైనసైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటిస్తూ ఉంటే అవాంఛిత రోమాలను చాలా తేలికగా తగ్గించుకోవచ్చు.