కొండా అంచులో పడిపోకుండా వేల ఏళ్ల నుంచి ఉన్న మహిమగల రాయి

128

పదమూడు వందల సంవత్సరాల నాటి రాయి గుండ్రంగా ఉంటుంది. కొండ అంచుల్లో ఉంటుంది ఎటు పడి పోతుందో తెలీదు. దాన్ని కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇంత కూడా కదిలించలేక పోయారు. అంతటి శక్తివంతమైన రాయిని శ్రీ కృష్ణుడు వెన్న ముద్దగా అక్కడ ప్రజలు అభివర్ణిస్తారు. ఈ రాయి ఎందుకు కలదు దాని మహిమ ఏంటి ఈ రాయిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చెన్నై సమీపంలోని మహాబలిపురం వెళ్లిన వారందరూ కూడా కృష్ణుడు వెన్న ముద్దగా  చెప్పిన రాయిని తప్పకుండా సందర్శిస్తారు. నున్నని కొండ రాతి అంచు మీద ఐదు మీటర్ల వ్యాసం 250 టన్నుల బరువుతో గుండ్రంగా ఉన్న ఆ రాయి ఏటు దోర్ల కుండా నిలిచి ఉండడం చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. అది ఎలా నిలిచి ఉంది అనేది ఏ భౌతిక శాస్త్రానికి అందడం లేదు సరికదా సహజంగా నిలిచి ఉంది అంటే నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అలాగని భారీ క్రేన్లు ఉన్న ఈ కాలంలో కూడా అంతటి బరువు ఉన్న పెద్ద రాతిని కొండ అంచులకు చేర్చడం సాధ్యం కాదు కదా. వేల సంవత్సరాల క్రితం దాన్ని అక్కడ ఎలా ఉంచారు అనేది ఎవరి ఊహకు అందడం లేదు. దానిని కలిపేందుకు ఎందరో రకరకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ఏదీ కూడా ఫలించలేదు. 1908లో అప్పటి మద్రాసు గవర్నర్ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అది దొర్లితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ప్రమాదకరం అని భావించి 7 ఏనుగులతో దాన్ని కదిలించే ప్రయత్నం చేస్తే అంగుళం కూడా కదలలేదు దానితో భారత ప్రభుత్వం మరోసారి ఆ ప్రయత్నం చేయలేదు. వెన్న ప్రియుడైన బాలకృష్ణుడు వెన్నను దొంగిలించి అక్కడ పెట్టుకుని తినేవాడిని అది అలా అలా పెరిగి పెరిగి రాయి గా మారింది అని అక్కడి పౌరాణిక గాధ కృష్ణుడు వెన్న ముద్ద ని ఆకాశ దేవతలే అక్కడ ఉంచారు అని. లేదు లేదు ఆకాశం నుంచి జారి పడింది అని అనేక రకాలైన ఊహాగానాల వల్ల స్టోన్ ఆఫ్ స్కై గాడ్ అని పిలుస్తున్నారు తప్ప దాని వెనుక ఉన్న మర్మం ఏమిటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ అంతుపట్టలేదు. మహాబలిపురంలో ఉన్న రాయి కి క్రేజ్ పెరిగింది. ఈ రాయిని చూడడానికి వచ్చే స్వదేశీ టూరిస్టు దగ్గర 40 రూపాయల చొప్పున విదేశీ టూరిస్ట్ నుంచి 600 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మహాబలిపురం దేశవిదేశాల పర్యాటకుల తోటి కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక వెన్నముద్ద కథ ఏమిటి అంటే ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు అమ్మ యశోదమ్మ దాచిన మజ్జిగ గుండెల్లో నుంచి వెన్నముద్దలు దొంగిలించి తీసుకొని వచ్చాడట. ఆ వెన్న ముద్ద ఇక్కడ పడిపోయి రాయి రూపంలో మారిపోయింది చెప్తారు. ఈ రాయి 6 మీటర్ల ఎత్తు ఐదు మీటర్ల వెడల్పు ఉంది. 250 టన్నులకు పైగా ఉంటుంది. ఇది ఆ రాయి యొక్క ప్రత్యేకత.

Previous articleఈ ఆలయాన్ని ఒక్కసారి చూస్తే ఎంతటి పాపమైన పోతుంది
Next articleఒకే ఒక చిన్న చిట్కా తో యూరిన్ ఇన్ఫెక్షన్ మాయం మల్లి రమ్మన్నా రాదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here